Funny Samosa: ఇలాంటి సమోసాను మీ జీవితంలో చూసి ఉండరు.. నెట్టింట్లో హల్‌చల్ చేస్తోన్న ఫోటో..

|

Sep 03, 2021 | 6:22 AM

Samosa with serial number: భారతీయులకు ఇష్టమైన స్నాక్స్ లలో సమోసా ఒకటి. ఒక కప్పు గరం చాయ్.. సమోసాలు ఉంటే చాలు ఆ సమయం అద్భుతం అనే చెప్పాలి.

Funny Samosa: ఇలాంటి సమోసాను మీ జీవితంలో చూసి ఉండరు.. నెట్టింట్లో హల్‌చల్ చేస్తోన్న ఫోటో..
Samosa
Follow us on

Samosa with serial number: భారతీయులకు ఇష్టమైన స్నాక్స్ లలో సమోసా ఒకటి. ఒక కప్పు గరం చాయ్.. సమోసాలు ఉంటే చాలు ఆ సమయం అద్భుతం అనే చెప్పాలి. క్రంచీ క్రస్ట్‌గా బంగాళాదుంపలను ఇతర కూరగాయలతో కలిపి తయారు చేసిన చేసిన సమోసాను జనాలు తెగ ఇష్టపడుతారు. అయితే, దేశ వ్యాప్తంగా ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా సమోసాను తయారుచేస్తుంటారు.

అయితే, తాజాగా ఓ వింత సమోసా వెలుగులోకి వచ్చింది. ఓ ట్విట్టర్ యూజర్ ఆ ఫోటోను షేర్ చేయడంతో అది ఇప్పుడు ట్రెండింగ్‌గా నిలిచింది. అసలేం జరిగిందంటే.. ఓ ట్విట్టర్ యూజర్ ఆన్‌లైన్‌లో సమోసా ఆర్డర్ చేశాడు. ఆ ఆర్డర్ మేరకు అతనికి సమోసాలు చేరాయి కూడా. అయితే ఆ సమోసాల దిగువన సీరియస్ నంబర్స్ ఉన్నాయి. అది చూసి అతను షాక్ అయ్యాడు. సమోసాలకు సీరియల్ నెంబర్లు ఏంటి అనే సందేహంతో.. వెంటనే ఆ సమోసాలను ఫోటో తీశాడు. ఆపై సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ‘‘నేను ఆర్డర్ చేసిన సమోసాలకు క్రమ సంఖ్యలు ఉన్నాయి. టెక్నాలజీ పీక్స్‌లోకి వెళ్లిపోయిందనడానికి ఇదే నిదర్శనం’’ అని క్యాప్షన్ పెట్టాడు.

కాగా, సదరు యూజర్ ఆ సమోసాల పిక్‌ను పోస్ట్ చేయడమే ఆలస్యం అదికాస్తా వైరల్‌గా మారింది. ఈ పోస్ట్‌ను వందలాది మంది రీట్వీట్ చేశారు. దాదాపు 15 వేల మందికిపైగా లైక్స్ కొట్టారు. ఈ సీరియల్ నెంబర్ సమోసాపై ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

Also read:

Gold News: బంగారం కొనుగోలు చేస్తున్నారా?.. ఈ మూడు మార్కులను తప్పక చూడండి.. లేదంటే అంతే సంగతులు..

Maharashtra: 8 నెలల ఎంజాయ్ చేశాడు.. రూ. 25 లక్షల బిల్లు చేశాడు.. ఆ తరువాత బాత్రూమ్ కిటీకీ నుంచి..

Gold Price Today: బంగారం ప్రియులకు ఊరట.. దిగి వస్తున్న పసిడి ధరలు.. తాజా ధరల వివరాలు..!