ఆడదాని ఓర చూపుతో జగాన ఓడిపోని దీరుడేవ్వడూ అంటూ ఓ సిని కవి అన్నట్లు… అమ్మాయిని ఆకట్టుకోవడానికి.. తమ ప్రేమికురాలిని ప్రసన్నం చేసుకోవడానికి అబ్బాయిలు రకరకాల సర్కస్ ఫీట్లు చేస్తూ ఉంటారు. కొంతమంది ఖరీదైన బహుమతులు ఇస్తారు. మరికొందరు తమ ప్రియురాలి కుటుంబాన్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. అమ్మాయిని మెప్పించేందుకు చేయని ప్రయత్నం అంటూ ఉండదు. అబ్బాయిలు తమ గర్ల్‌ఫ్రెండ్‌లను ప్రసన్నం చేసుకోవడానికి పొగడ్తలతో ముంచెత్తుతారు కూడా.. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ప్రియురాలిని ప్రసన్నం చేసుకోవడానికి చేసిన ప్రయత్నం నెటిజన్లను షాక్ కు గురి చేసింది.
ప్రియురాలిని ప్రసన్నం చేసుకునేందుకు ఆమె నడిచే చోట డబ్బులను కార్పెట్ గా పరిచాడు. అవును.. ఎవరైనా సాధారణంగా తమకు ఇష్టమైన వ్యక్తులను స్వాగతించడానికి పూలను తివాచీగా అలంకరిస్తారు. అయితే వైరల్ వీడియోలోని ఓ వ్యాపారవేత్త తన గర్ల్ ఫ్రెండ్ హెలికాప్టర్ నుండి దిగగానే నోట్ల కార్పెట్‌తో స్వాగతం పలికాడు. అయితే ఈ వీడియో ఇప్పటిది కాదు.. కానీ మళ్ళీ వైరల్ అవుతూ నెటిజన్లను ఆకట్టుకుంటుంది.
సెర్గీ కొసెంకో అనే రష్యన్ వ్యాపారవేత్త తన ప్రియురాలికి స్వాగతం పలికేందుకు నోట్ల కార్పెట్‌ను పరిచిన ఈ పాత వీడియో ఇప్పుడు మళ్లీ వైరల్ అవుతోంది.
ఈ పోస్ట్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో చూడండి
ఇన్‌స్టాగ్రామ్ ఖాతా @mr.thank.youలో షేర్ చేసిన ఈ వీడియోలో సెర్గీ కొసెంకో తన ప్రియురాలి కోసం డబ్బులను కార్పెట్ గా పరచడం చూడవచ్చు. అతని స్నేహితురాలు హెలికాప్టర్ నుండి దిగగానే.. కొసెంకో ఆమె చేతిని పట్టుకుని నోట్లమీద నడిపించాడు.
ఈ వీడియోకి మిలియన్ల వ్యూస్ రావడంతో పాటు చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. వార్నీ ప్రేమ ఎంత పని చేసింది అని కామెంట్ చేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..