AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kethanarth: కేదార్‌నాథ్‌లో డీజే సాంగ్స్ కి యువకుల నృత్యం.. వీడియో షేర్ చేస్తే చర్యలు తప్పవని పోలీసుల హెచ్చరిక..

చార్ ధామ్ యాత్ర ప్రారంభం అయింది. ఉత్తరాఖండ్‌లో ఉన్న నాలుగు పుణ్య క్షేత్రాలను దర్శించుకునేందుకు ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు విశ్వాసం, భక్తి , మానసిక శాంతి, ఆధ్యాత్మిక మార్గంలో పయనించేందుకు ఇక్కడికి వస్తారు. అటువంటి పుణ్యక్షేత్రాలను సందర్శించే సమయంలో యాత్ర స్థల విశిష్టతను దృష్టిలో పెట్టుకుని భక్తులు కొన్ని నియమాలను పాటించాలి. అయితే కేదార్నాథ్ కి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది అందరినీ షాక్‌కు గురిచేస్తోంది. ఈ వైరల్ వీడియోలో కొంతమంది యువకులు ఆలయ ప్రాంగణం వెనుక పెద్ద స్పీకర్‌ పెట్టుకుని పంజాబీ పాటలకు డ్యాన్స్ చేస్తున్నారు.

Kethanarth: కేదార్‌నాథ్‌లో డీజే సాంగ్స్ కి యువకుల నృత్యం.. వీడియో షేర్ చేస్తే చర్యలు తప్పవని పోలీసుల హెచ్చరిక..
Kedarnath Temple
Surya Kala
|

Updated on: May 06, 2025 | 4:24 PM

Share

ఉత్తరాఖండ్‌లోని నాలుగు ధామ్‌లు కేదార్‌నాథ్, బద్రీనాథ్, యమునోత్రి, గంగోత్రి పుణ్యక్షేత్రాలు. ప్రతి సంవత్సరం భక్తులు భారీ సంఖ్యలో ఇక్కడికి తీర్థయాత్రకు వస్తారు. ఇప్పటికే చార్ ధామ్ యాత్ర ప్రారంభమైంది. ప్రారంభంలోనే భక్తులు నాలుగు ధామ్‌లకు భారీ సంఖ్యలో చేరుకుంటున్నారు. ఇప్పుడు రుద్రప్రయాగ జిల్లాలో ఉన్న కేదార్‌నాథ్ ధామ్ కి సంబంధించిన ఒక వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన తర్వాత జనాలు షాక్ అవుతున్నారు.

ఈ వీడియో వైరల్ అయిన తర్వాత ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైరల్‌గా మారిన ఈ వీడియోలో కేదార్‌నాథ్ ఆలయ సముదాయం వెనుక ఉన్న పెద్ద స్పీకర్‌ నుంచి పంజాబీ పాటలను పెద్ద సౌండ్ పెట్టి ప్లే చేస్తున్నారు. ఆ సమయంలో కొంతమంది యువకులు నృత్యం చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఇలా సాయంత్రం సమయంలో జరిగినట్లు కనిపిస్తోంది. భక్తులు ఈ సంఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా చేసిన యువకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా ఆలయ పరిపాలన దృష్టి పెట్టాలని కూడా సూచిస్తున్నారు.

వీడియోలో ఏముందంటే

ఇవి కూడా చదవండి

వీడియోలో కేదార్‌నాథ్ ఆలయ సముదాయం వెనుక ఒక స్పీకర్‌ను చూడవచ్చు. పార్టీ చేసుకున్నట్లు లైట్లు కూడా చూడవచ్చు. స్పీకర్లలో పంజాబీ పాటలు వినిపిస్తున్నాయి. ఆ పాటలకు అనుగుణంగా యువత డ్యాన్స్ చేస్తున్నారు. ఈ వీడియో సోమవారం వెలుగులోకి వచ్చింది. దీని తరువాత నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆలయం వంటి పవిత్ర స్థలంలో ఇలాంటి ప్రవర్తన సరికాదంటూ ఖండించారు.

యువకులపై చర్యల కోసం డిమాండ్

కేదార్‌నాథ్ ధామ్‌లో ఎంతటి దుస్థితి ఏర్పడిందో అంటూ కొంతమంది భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ యువకులు ఇలాంటి పనులు చేసి ఆ స్థల పవిత్రతను ఉల్లంఘించారు. వారికి కఠిన శిక్ష విధించాలి. తద్వారా ఇలా మళ్ళీ చేయాలనే ఆలోచన ఎవరికీ రాదు.. ఇలాంటి పనులను అస్సలు సహించకూడదని కామెంట్ చేస్తున్నారు.

కేదార్‌నాథ్ ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఒకటి. తమ జీవిత కాలంలో ఒక్క సారి యినా దర్శించాలని ప్రతి హిందువు కోరుకుంటారు. అటువంటి హిందువులకు విశ్వాస కేంద్రంమైన కేదార్నాథ్ లో జరిగిన సంఘటన చాలా మంది భక్తులను బాధించింది.

పోలీసుల విజ్ఞప్తి ఏమిటంటే

రుద్రప్రయాగ జిల్లా పోలీసు యంత్రాంగం ఈ వీడియోను షేర్ చేయవద్దని లేదా ప్రసారం చేయవద్దని సాధారణ ప్రజలకు విజ్ఞప్తి చేసింది. ఇలా చేయడం అంటే పుణ్యక్షేత్రం పవిత్రతకు అవమానంగా పరిగణించబడటమే కాకుండా చట్టాన్ని ఉల్లంఘించినట్లుగా పరిగణించబడుతుంది.

కేదార్‌నాథ్ వంటి పవిత్ర స్థలం గౌరవాన్ని కాపాడుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అని పోలీసులు అంటున్నారు. కొంతమంది సామాజిక వ్యతిరేక శక్తులు చేసే ఇటువంటి చర్యలు మతపరమైన భావాలను దెబ్బతీయడమే కాదు మొత్తం సమాజంలో తప్పుడు సందేశాన్ని వ్యాపింపజేస్తాయని చెప్పారు. ఇలాంటి సంఘటనల పట్ల జిల్లా యంత్రాంగం, పోలీసు బలగాలు పూర్తిగా అప్రమత్తంగా ఉన్నాయని ఎలాంటి అనుచిత చర్యలను సహించబోమని స్పష్టం చేశారు. సోషల్ మీడియాను పర్యవేక్షిస్తున్నారు.

కేదార్‌నాథ్ ధామ్‌లో భక్తులు, పర్యాటకులు భక్తితో ప్రవర్తించాలని.. ఎలాంటి అనుచిత కార్యకలాపాలకు పాల్పడ వద్దని విజ్ఞప్తి చేశారు. అలాగే, మీరు అలాంటి అనుమానాస్పద కార్యకలాపాలను చూసినట్లయితే, వెంటనే స్థానిక పోలీసులకు తెలియజేయమని కోరుతున్నారు. కేదార్‌నాథ్ ధామ్ పవిత్రత , గౌరవాన్ని కాపాడటానికి.. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవడానికి రుద్రప్రయాగ్ పోలీసులు ఈ చర్య తీసుకున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..