Bullet catches fire: కాలి బూడిదైన బుల్లెట్.. రెప్పపాటులోనే విధ్వంసం.. వీడియో చూస్తే షాకవ్వాల్సిందే..

అది అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఉండే రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ దానంతటే అదే దగ్ధమైన ఘటన ఇటీవల అందరినీ షాక్ గురిచేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

Bullet catches fire: కాలి బూడిదైన బుల్లెట్.. రెప్పపాటులోనే విధ్వంసం.. వీడియో చూస్తే షాకవ్వాల్సిందే..
Royal Enfield Bullet 350 Fire

Edited By:

Updated on: Dec 19, 2022 | 11:53 AM

ఇటీవల కాలంలో ఏదైనా ఒక బైక్ దగ్ధమైంది అని అంటే అది ఎలక్ట్రిక్ వాహనమే అని సాధారణంగా మనం అనుకుంటాం. ఎందుకంటే తరచూ ఏదో సాంకేతికత కారణంతో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల బ్యాటరీలు వాటంతట అవే పేలిపోయి కాలిపోతున్నాయి. అయితే సంప్రదాయ పెట్రోల్ ద్విచక్ర వాహనాలు సాధారణంగా దగ్ధమవడానికి చాన్స్ ఉండదు. ఇంజిన్ లోపలే కంబషన్ జరుగుతున్నా.. ఎప్పుడో హాట్ సమ్మర్ లో ఏదో ఒకటి అర ఇటువంటి సంఘటనలు చోటుచేసుకుంటుంటాయి. కానీ లడక్ లాంటి చలి ప్రదేశంలో .. అది అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఉండే రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ దానంతటే అదే దగ్ధమైన ఘటన ఇటీవల అందరినీ షాక్ గురిచేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

పార్క్ చేసిన బైక్ నుంచి..

రోడ్డు పక్కన పార్క్ చేసిన బైక్ నుంచి అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి. మొదట బండి దానంతట అదే సెల్ఫ్ స్టార్ట్ అయ్యింది. ఆ తర్వాత ఒక్కసారిగా మంటలు ఉద్ధృతమయ్యి.. బైక్ మొత్తం కాలి బూడిదయిపోయింది. దీనిని గమనించిన పక్కన ఉన్న వారు ఆ మంటలు అదుపుచేసేందుకు ఇసుకను, నీటిని బండిపై కుమ్మరించారు. కానీ ఫలితం లభించలేదు. దీనికి సంబంధించిన వీడియోను @trippyyogi669 అకౌంట్ నుంచి యూ ట్యూబ్ షార్ట్స్ లో పోస్టయ్యింది. పోస్ట్ అయిన నిమిషాల్లో ఫుల్ వైరల్ అయిపోయింది. ప్రమాదంలో దగ్ధమైన బైక్ రాయల్ ఎన్ ఫీల్డ్ కంపెనీకి చెందిన హై ఎండ్ మోడల్ బుల్లెట్ 350 సిరీస్ లోనిది. దీనిలో ఎలక్ట్రిక్ స్టార్టర్ ఉంటుంది.

షార్ట్ సర్క్యూటే కారణమా?

అసలు ఈ ప్రమాదం ఎలా జరిగి ఉండొచ్చా అని ఆరా తీస్తే.. ఆ ప్రమాదంలో దగ్ధమైన రాయల్ ఎన్ ఫీల్డ్ బుల్లెట్ బండి లడక్ రీజియన్లోని నుబ్రా వ్యాలీ నుంచి పాంగాంగ్ సరస్సు ను దాటుకుంటూ వచ్చింది. ఈ క్రమంలో నీరు సెల్ఫ్ మోటార్ లోకి వెళ్లాయి. ఆ నీటి కారణం మోటర్ వద్ద ఉన్న వైరింగ్ షార్ట్ సర్క్యూట్ నకు గురయ్యింది. దీంతో బండి పక్కన పార్క్ చేసి ఉంచినా.. దానంతట అదే సెల్ఫ్ స్టార్ అయ్యి నింపు అంటుకుంది. అయితే ఆ బండి పక్కనే మరి కొన్ని బుల్లెట్లు ఉన్నా.. వాటికి మంటలు వ్యాపించకపోవడం, పక్కనే మనుష్యులకు కూడా ఎటువంటి గాయవ కాకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

ఇవి కూడా చదవండి

షార్ట్ సర్క్యూట్ ఎందుకు జరిగింది..

రాయల్ ఎన్ ఫీల్డ్ బండి షార్ట్ సర్క్యూట్ నకు గురవడం ఇదే మొదటి సారి కాదని నిపుణులు చెబుతున్నారు. అంతకు ముందు కూడా ఇటువంటి ఘటనలు చోటుచేసుకున్నాయని వివరిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం మితిమీరిన ఎలక్ట్రిక్ వైరింగ్ అని చెబుతున్నారు. అంటే కంపెనీ ఇచ్చే సామగ్రి మాత్రమే కాక.. కొందరు బయట మార్కెట్ మరికొన్ని ఎలక్ట్రిక్ సామాన్లు బండి ఫిట్ చేస్తుంటారు. వీటి వల్ల బండి వైరింగ్ పై అధిక ఒత్తిడి పడి, షార్ట్ సర్క్యూట్ నకు కారణమవుతున్నాయని వివరిస్తున్నారు. అందుకే ఏ బండికైనా ఆ కంపెనీ ఇచ్చే ఎలక్ట్రికల్ యాక్ససరీస్ కాకుండా ఇతర సామగ్రి ఇన్ స్టాల్ చేయవద్దని సూచిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం క్లిక్ చేయండి..