Viral Video: అమ్మా..! అస్సలు భయం లేకుండా పోయిందే.. గొర్రె పిల్లను బెదిరించిన కోడిపుంజు.. చివరకు..

Rooster - Goat Funny Video: సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా.. మరికొన్ని ఆశ్చర్యకరంగా ఉంటాయి. వైరల్ అయ్యే వాటిల్లో ఎక్కువగా

Viral Video: అమ్మా..! అస్సలు భయం లేకుండా పోయిందే.. గొర్రె పిల్లను బెదిరించిన కోడిపుంజు.. చివరకు..
Viral Video
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Apr 10, 2022 | 11:42 AM

Rooster – Goat Funny Video: సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా.. మరికొన్ని ఆశ్చర్యకరంగా ఉంటాయి. వైరల్ అయ్యే వాటిల్లో ఎక్కువగా జంతువులకు సంబంధించినవే ఉంటాయి. వీటిని చూసి నెటిజన్లు తెగ నవ్వుకుంటూ ఫన్నీ కామెంట్లు చేస్తుంటారు. తాజాగా ఓ కోడిపుంజు.. గొర్రె పిల్లకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అయితే.. చివరకు ఊహించని పరిణామంతో కోడిపుంజు పారిపోతుంది. సాధారణంగా కోడిపుంజులు, గొర్రెలు చిన్నపిల్లల్లా అల్లరి చేస్తుంటాయి. కోళ్లు పోరాడుతున్న వీడియోలను మనం చాలానే చూసుంటాం.. అలాగే గొర్రెలకు సంబంధించిన పోరాటాలను కూడా చూసుంటాం.. తాజాగా.. రెండూ పోరాడుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కోడిపుంజు.. గొర్రె పోట్లాడటం అరుదుగా ఉంటుందని.. కానీ చూస్తే నవ్వాపుకోలేకపోతున్నాం అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

వైరల్ వీడియోలో.. కోడిపుంజు ఎగురుకుంటూ వచ్చి గొర్రె పిల్లను కాళ్లతో తన్నుతున్న దృశ్యాన్ని వీడియోలో చూడవచ్చు. పిల్ల కావడంతో కోడిపుంజుకు స్పందించలేదు.. ఏం అనడం లేదని మళ్లీ కోడిపుంజు.. గొర్రె పిల్లను తన్నుతుంది. ఈ క్రమంలో బిడ్డను కోడిపుంజు తన్నడాన్ని చూసి.. తల్లి గొర్రె వెంటనే స్పందిస్తుంది. కోడిపుంజుపైకి దూసుకెళ్లి తలతో జవాబు చెబుతుంది. తన బిడ్డ జోలికొస్తే.. ఖబర్దార్ అంటూ గొర్రె.. కోడిపుంజుకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది. దీంతో కోడిపుంజు అక్కడినుంచి పరారవుతుంది.

వైరల్ వీడియో..

View this post on Instagram

A post shared by Rosicchaves (@rosicchaves)

ఈ ఫన్నీ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో రోసిచావ్స్ అనే యూజర్ షేర్ చేశారు. దీన్ని ఇప్పటివరకు లక్షమందికి పైగా వీక్షించగా.. వేలాది మంది లైక్ చేసారు. అదే సమయంలో పలు రకాల ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.

Also Read:

Viral Video: నూతన వధూవరులకు విసన కర్రలు గిఫ్ట్.. ఎక్కడో తెలుసా అంటూ.. ఫన్నీ వీడియో నెట్టింట్లో వైరల్..

Viral Video: మహిళకు సాయం చేసిన వ్యక్తి అనంతరం కిందపడిన వ్యక్తి నెట్టింట వైరల్ అవుతున్న వీడియో

మిర్చి రైతు వినూత్న ఆలోచన..పొలంలో పెట్టిన ఫ్లెక్సీ చూస్తే అవాక్కే
మిర్చి రైతు వినూత్న ఆలోచన..పొలంలో పెట్టిన ఫ్లెక్సీ చూస్తే అవాక్కే
ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు.. పూజారి ఇంట్లోకి వచ్చిన చిరుత..
ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు.. పూజారి ఇంట్లోకి వచ్చిన చిరుత..
మరో మంచి పనికి శ్రీకారం చుట్టిన స్టార్ హీరో కిచ్చా సుదీప్
మరో మంచి పనికి శ్రీకారం చుట్టిన స్టార్ హీరో కిచ్చా సుదీప్
కోహ్లీకి అదొక్కటే దారి! విలువైన సలహా ఇచ్చిన ఫేమస్ క్రికెటర్..
కోహ్లీకి అదొక్కటే దారి! విలువైన సలహా ఇచ్చిన ఫేమస్ క్రికెటర్..
గిన్నిస్ వరల్డ్ రికార్డులో తెలంగాణడ్రిల్ మ్యాన్.ఒళ్లు గగుర్పొడిచే
గిన్నిస్ వరల్డ్ రికార్డులో తెలంగాణడ్రిల్ మ్యాన్.ఒళ్లు గగుర్పొడిచే
రజనీకాంత్‌కు గుడి కట్టి పూజలు చేస్తోన్న రిటైర్డ్ జవాన్.. వీడియో
రజనీకాంత్‌కు గుడి కట్టి పూజలు చేస్తోన్న రిటైర్డ్ జవాన్.. వీడియో
విలేకరుల సమావేశంలో పాట్ కమ్మిన్స్ క్యూట్ మూమెంట్..
విలేకరుల సమావేశంలో పాట్ కమ్మిన్స్ క్యూట్ మూమెంట్..
బోర్డర్‌తో పాటు ట్రోఫీ అందజేయకపోవడం పై గవాస్కర్ అలక..!
బోర్డర్‌తో పాటు ట్రోఫీ అందజేయకపోవడం పై గవాస్కర్ అలక..!
విరాట్ కోహ్లి రిటైర్మెంట్ రూమర్స్.. ఇప్పుడు మరో గందరగోళం
విరాట్ కోహ్లి రిటైర్మెంట్ రూమర్స్.. ఇప్పుడు మరో గందరగోళం
మ‌ర‌ణించిన చెర్రీ అభిమానుల‌ కుటుంబాలకు దిల్ రాజు ఆర్థిక సాయం
మ‌ర‌ణించిన చెర్రీ అభిమానుల‌ కుటుంబాలకు దిల్ రాజు ఆర్థిక సాయం