వాణిజ్య నగరం ముంబైని కలల నగరం అని పిలుస్తారు. ఇక్కడి లోకల్ ట్రైన్ నగరానికి హృదయ స్పందనలాంటిదిగా పోల్చి చెబుతారు. ఇక్కడ చాలా వరకు లోకల్ ట్రైన్ ద్వారా ప్రజల ప్రయాణం జరుగుతుంది. ఇక్కడ దాదాపు అన్ని స్టేషన్లలో మీరు అన్ని రకాల ఆహార పదార్థాలను సులభంగా పొందగలుగుతారు. కానీ, రైలు ప్రయాణంలో ఉండగా, హోటల్‌ల్లో ఉన్నట్టుగా ఏర్పాట్లు, కావాల్సిన భోజనం చేయటం ప్రయాణికులకు గొప్ప సరదా వంటిది. అందుకే అలాంటి వారి కోర్కెలకు అనుగుణంగా ఇద్దరు వ్యక్తులు కలిసి ముంబై లోకల్ ట్రైన్‌లో తాత్కాలికంగా ఓ వినూత్న రెస్టారెంట్‌ను ఏర్పాటు చేశారు. వారు ఏర్పాటు చేసిన రైల్లో హోటల్ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. అవును, ఇది మీకు కొంచెం వింతగా అనిపించవచ్చు కానీ ఇది నిజం. రైళ్లో హోటల్ కు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారుతుండగా, ప్రజలు దాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. వారి టాలెంట్‌కు ఫిదా అవుతూ ప్రశంసలతో ముంచేస్తున్నారు.
వైరల్ అవుతున్న వీడియోలో…ముంబై లోకల్ ట్రైన్ కంపార్ట్‌మెంట్‌లో ఓ ఇద్దరు వ్యక్తులు కలిసి చిన్నపాటి ఫోల్డింగ్ టేబుల్‌ని ఏర్పాటు చేశారు. దీంతో పాటు ఇద్దరూ ప్రయాణికులకు మెనూలు ఇచ్చారు. ఆ వెంటనే కస్టమర్ల ఆర్డర్ మేరకు ప్రయాణికులకు మ్యాగీ, జలేబీని అందించారు. ప్రయాణీకులతో సెల్ఫీలు దిగిన తర్వాత ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం కూడా కనిపించింది. ముంబై లోకల్ రైల్లో ఇద్దరు వ్యక్తులు కలిసి ఈ వింత హోటల్ సెటప్ చేశారు. అతను ఆహ్వానంతో సహా ఆలోచనను రియాలిటీగా మార్చడానికి చేసిన సన్నాహాలను కూడా వివరించాడు. ఇక అంతే వీడియోని ఇంటర్ నెట్‌లో పోస్ట్ చేయటమే ఆలస్యం విపరీతంగా వైరల్ అవుతోంది. లైకులు, షేర్లతో నెట్టింట తెగ సందడి చేస్తోంది.
లోకల్ ట్రైన్‌లో ఆ ఇద్దరు వ్యక్తులు చేసిన పనిని చాలా మంది నెటిజన్లు చాలా ఇష్టపడుతున్నారు. మాకు ఎంతగానో నచ్చిందంటూ, దానిపై వారి స్పందనలు కూడా ఇస్తున్నారు. వైరల్ అవుతున్న వీడియోను కటారియార్యన్, సార్థక్‌సచ్‌దేవ అనే వినియోగదారు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. వైరల్ అవుతున్న ఈ క్లిప్‌కి ఇప్పటివరకు 99,000 కంటే ఎక్కువ లైక్‌లు, చాలా కామెంట్‌లు వచ్చాయి. వినియోగదారులు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. చాలా మంది తమకు బాగా నచ్చిందని, మీ కాన్సెప్ట్ మాకు నచ్చిందంటూ పొగడ్తలు కురిపిస్తున్నారు. లోకల్ ట్రైన్‌లో హోటల్.. సూపర్ కాన్సెప్ట్ బ్రో అంటూ చాలా మంది ఆ ఇద్దరు యువకుల ప్రయత్నాన్ని తెగ ప్రశంసిస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..