Rare Fish Sighting: రెస్టారెంట్‌లో కస్టమర్లకు వింత డిన్నర్.. గ్లాస్‌ టేబుల్ కింద కదులుతూ వచ్చిన చేప..

ఈ భూమీ మీద మనం ఇంతకు ముందెన్నడూ చూడని అనేక జాతుల జీవులు ఉన్నాయి. ఈ జీవులు అకస్మాత్తుగా మన కళ్ళ ముందు కనిపించినప్పుడు మనం ఆశ్చర్యపోవాల్సి వస్తుంది. కానీ, సోషల్ మీడియా వంటి మాధ్యమాల ద్వారా ప్రపంచం నుండి ఉద్భవించే ప్రత్యేకమైన జీవుల గురించి మనం ఎప్పటికప్పుడు తెలుసుకుంటాము. ఈ రోజు మనం ఇంతకు ముందు ఎప్పుడూ చూడని అలాంటి ఒక వింత జీవిని చూడబోతున్నాం..అది కూడా పాములాంటి చేప.. రెస్టారెంట్ లో భోజనం చేసేందుకు కూర్చున్న కస్టమర్ల ముందు టేబుల్‌పై ఈ ప్రత్యేకమైన వింత చేప చక్కర్లు కొడుతోంది. ఈ దృశ్యం స్థానికులతో పాటుగా, వీక్షకులను ఆశ్చర్యపరుస్తుంది.

Rare Fish Sighting: రెస్టారెంట్‌లో కస్టమర్లకు వింత డిన్నర్.. గ్లాస్‌ టేబుల్ కింద కదులుతూ వచ్చిన చేప..
Rare Fish Sighting

Updated on: Nov 09, 2025 | 9:20 AM

సోషల్‌ మీడియాలో ఒక వింత దృశ్యం వేగంగా వైరల్‌ అవుతోంది. రెస్టారెంట్‌కి వచ్చిన ప్రజలు ఇది చూసి షాక్ అవుతున్నారు. గ్లాస్‌ టేబుల్ కింద స్నోఫ్లేక్ మోరే అని పిలువడే ఒక ప్రత్యేకమైన చేప తిరుగుతూ కనిపిస్తోంది. ఈ దృశ్యం చాలా ప్రత్యేకమైనది. ఈ వీడియో ఎక్కడ తీశారు అన్న వివరాలు తెలియలేదు. కానీ, ఈ వీడియోలో ప్రజలు ఒక రెస్టారెంట్‌లో ముందు గాజు టేబుల్‌తో కూర్చుని ఉండటం కనిపిస్తుంది. అంతలనే హఠాత్తుగా ఆ టేబుల్ కింద ఒక స్నోఫ్లేక్ మోరే పాకుతూ దూసుకు వచ్చింది. దాంతో వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు.

వీడియోలో ఒక మహిళ మొదట దానిని చూసి, వెంటనే దూరంగా పారిపోయే ప్రయత్నం చేస్తుంది. స్నోఫ్లేక్ మోరే గాజు టేబుల్ పైనే ఉన్నట్టుగా కనిపిస్తుంది. అది చూసిన ఆమె దానిని మరొక మహిళకు చూపిస్తుంది. ఆ మహిళ మొదట దానిని పట్టించుకోదు, కానీ, ఆమె కూడా స్నోఫ్లేక్ మోరేను చూసిన వెంటనే చాలా భయపడుతుంది. ఆమె కూడా ఆ పాములాంటి చేప వారి గ్లాస్‌ టేబుల్‌ పైనే ఉందని అనుకుంటుంది.

ఇవి కూడా చదవండి

వీడియో ఇక్కడ చూడండి..

ఈ ప్రత్యేకమైన దృశ్యాన్ని ఎవరో రికార్డ్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోకు ప్రజలు వివిధ రకాల కామెంట్లతో స్పందించారు. కొందరు ఇంత ప్రత్యేకమైన దృశ్యాన్ని తాము ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదని చెప్పగా, మరికొందరు ఇది చాలా అందంగా ఉందని, మరికొందరు ఇది మనోహరంగా ఉందని అన్నారు. ప్రజలు ఈ వీడియోను విస్తృతంగా షేర్‌ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..