Biscuit price rise: బిస్కెట్ ధరలూ పెరగనున్నాయి.. ఎంత నుంచి ఎంతకు పెరుగుతుందంటే.. వివరాలు మీకోసం..

| Edited By: Ravi Kiran

Nov 24, 2021 | 7:23 AM

Biscuit price rise: ధరల పెరుగుదల పర్వం కొనసాగుతోంది. పెట్రోల్, డీజిల్, వాహనాలు, వంటింటి సామాగ్రి, దుస్తులు మొదలు అన్నింటి రేట్లు మండిపోతున్నాయి.

Biscuit price rise: బిస్కెట్ ధరలూ పెరగనున్నాయి.. ఎంత నుంచి ఎంతకు పెరుగుతుందంటే.. వివరాలు మీకోసం..
Biscuits
Follow us on

Biscuit price rise: ధరల పెరుగుదల పర్వం కొనసాగుతోంది. పెట్రోల్, డీజిల్, వాహనాలు, వంటింటి సామాగ్రి, దుస్తులు మొదలు అన్నింటి రేట్లు మండిపోతున్నాయి. తాజాగా మరో ధరల బాంబ్ పేలేందుకు సిద్ధంగా ఉంది. బిస్కెట్ల ధరలు భారీగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. ప్రముఖ బిస్కెట్ తయారీ కంపెనీ పార్లె ప్రోడక్ట్స్.. రెండోసారి తమ బిస్కెట్ల ధరలను పెంచేందుకు సన్నాహాలు చేస్తోంది. త్వరలోనే బిస్కెట్లు సహా దాని ఉత్పత్తులపై ధరలు పెంచనున్నట్లు పార్లే ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022) మూడు, నాలుగో త్రైమాసికంలో బిస్కెట్ల ధరలు 10-20 శాతం పెరిగే అవకాశం ఉందని తెలిపింది.

ఈ ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో పార్లే 10-15% ధరలు పెంచింది. దేశంలో నూనె, మైదా, పంచదార ధరలు పెరగడంతో బిస్కెట్ల ధరలు పెంచుతున్నట్లు కంపెనీ చెబుతోంది. బిస్కెట్ల తయారీకి ముడిసరుకుగా ఉపయోగించే పదార్థాల ధరలు పెరగడంతో బిస్కెట్ల ధరలు కూడా పెంచాల్సి వస్తోందని తెలిపింది. పార్లే తన తదుపరి దశలో బిస్కెట్లు, మిఠాయిలు, స్నాక్స్ వంటి అన్ని శ్రేణులపై రేట్లను పెంచబోతోన్నట్లు ప్రకటించింది.

ఎంత రేటు పెరుగుతుందంటే..
పార్లె తెలిపిన వివరాల ప్రకారం.. 300 గ్రాముల రస్క్ ప్యాకెట్ ధరను రూ. 10 మేరకు పెంచనుంది. వివిధ రకాల పార్లే బిస్కెట్లలో పార్లే జి, క్రాక్‌జాక్ మొదలైన వాటి ధరలు 5-10 శాతం వరకు పెరగవచ్చు. 400 గ్రాముల రస్క్ ప్యాకెట్ ధర భారీగా పెరిగే ఛాన్స్ ఉంది. అయితే, కంపెనీ రేట్ల పెంచని వాటికి సంబంధించి ప్యాకింగ్ సైజ్‌ను తగ్గించింది. 10 నుంచి 30 రూపాయల విలువైన ఉత్పత్తులు ఈ విభాగంలోకి వస్తాయి. ఉదాహరణకు రూ.10 ప్యాకెట్ ధర అలాగే ఉంటుంది.. దాని క్వాంటిటీ మాత్రం కాస్త తగ్గుతుందన్నమాట.

పార్లే ఇటీవలే బ్రేక్‌ఫాస్ట్ సీరియల్ మార్కెట్‌లోకి ప్రవేశించనున్నట్లు ప్రకటించింది. పార్లే తన ప్రసిద్ధ బ్రాండ్ హైడ్ & సీక్ పేరుతో బ్రేక్‌ఫాస్ట్ ఉత్పత్తుల మార్కెట్‌లోకి ప్రవేశించేందుకు సిద్ధమవుతోంది. బిస్కెట్లు, చిరుతిళ్లు, మిఠాయిలకు ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో.. అల్పాహార ఉత్పత్తులకు కూడా అదే స్థాయిలో స్పందన వచ్చే అవకాశం ఉందని పార్లే భావిస్తోంది. ఇటీవల పార్లే సీనియర్ కేటగిరీ మార్కెటింగ్ హెడ్ బి కృష్ణారావు మాట్లాడుతూ “ఇన్‌పుట్ ధరలు పెరిగాయి. ఇది ధరల పెరుగుదలకు దారి తీస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వాటి ధరల పెరుగుదల 15% మించకుండా ఉండేలా చూస్తాము. నిర్దిష్ట ఉత్పత్తికి కస్టమర్ డిమాండ్ తగ్గడం ప్రారంభించినప్పుడు 15% ధర పెరుగుదల జరుగుతుంది.’’ అని చెప్పుకొచ్చారు.

ఈ కంపెనీలు ధరలు పెంచాయి..
మారికో, హిందుస్థాన్ యూనిలీవర్, నెస్లే ఇండియా వంటి కంపెనీలు తమ ఉత్పత్తుల రేట్లను పెంచాయి. ఈ ఏడాదే రేట్లన్నీ పెరిగాయి. మారికో తన ఉత్పత్తుల ధరలను 50 శాతం మేరకు పెంచింది. అదేవిధంగా, హిందుస్థాన్ యూనిలీవర్.. డోవ్, లక్స్, పెయిర్స్, హమామ్, లిరిల్, సర్ఫ్ ఎక్సెల్, వీల్ వంటి ప్రఖ్యాత ఉత్పత్తులను తయారు చేస్తోంది. ఈ కంపెనీ సర్ఫ్ ఎక్సెల్, రిన్, లక్స్, వీల్ డిటర్జెంట్ ధరలను 2.5 శాతం పెంచింది. నెస్లే ఇండియా కంపెనీ నెస్లే, కిట్‌క్యాట్, మంచ్, బార్వాన్, నెస్కేఫ్, మ్యాగీ వంటి ఉత్పత్తులను తయారు చేస్తుంది. ఇది కూడా పలు ఉత్పత్తుల ధరలు 1-3 శాతం పెంచింది.

Also read:

Aadi Saikumar: నయా మూవీ మొదలు పెట్టిన యంగ్ హీరో.. రెగ్యులర్ షూటింగ్‌లో ఆది సాయికుమార్ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్

Keerthy Suresh : చీరకట్టు.. చిరునవ్వు.. కుర్రాళ్ళ గుండెల్లో బాణాలు గుచ్చుతున్న ముద్దుగుమ్మ..

Akhanda: బాలయ్య యాక్షన్‌కు థియేటర్స్ దద్దరిలాల్ల్సిందే.. అఖండలో నటసింహం విశ్వరూపం చూపించనున్నారట..