PNB New Plan: పిల్లల భవిష్యత్‌పై దిగులు అవసరం లేదు.. సరికొత్త పథకం ప్రవేశపెట్టిన పంజాబ్ నేషనల్ బ్యాంక్.. ఇవీ లాభాలు..

PNB New Plan: ప్రస్తుత కాలంలో తల్లిదండ్రులు తమ పిల్లల భద్రత, భవిష్యత్తు గురించి చాలా ఆలోచనలు చేస్తుంటారు. కాలక్రమేణా పిల్లల వయస్సుతో పాటు, అవసరాలు కూడా పెరుగుతాయి.

PNB New Plan: పిల్లల భవిష్యత్‌పై దిగులు అవసరం లేదు.. సరికొత్త పథకం ప్రవేశపెట్టిన పంజాబ్ నేషనల్ బ్యాంక్.. ఇవీ లాభాలు..
Pnb

PNB New Plan: ప్రస్తుత కాలంలో తల్లిదండ్రులు తమ పిల్లల భద్రత, భవిష్యత్తు గురించి చాలా ఆలోచనలు చేస్తుంటారు. కాలక్రమేణా పిల్లల వయస్సుతో పాటు, అవసరాలు కూడా పెరుగుతాయి. అలాంటి పరిస్థితిలో చాలా మంది తల్లిదండ్రులు బిడ్డ పుట్టిన వెంటనే వారి భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. వారి చదువుల కోసం కూడా చాలా చోట్ల పెట్టుబడి పెడుతుంటారు. దాంతో స్కూల్, కాలేజీకి, ఉన్నత చదువులకు ఎలాంటి ఇబ్బందీ ఉండదు. పిల్లల భవిష్యత్ అవసరాల కోసం పెట్టుబడులు పెట్టేందుకు అనేక చాయిస్‌లు ఉన్నాయి. అయితే, బెటర్ చాయిస్‌ను ఎంచుకోవాల్సిన అవసరం ఉంది.

దేశంలోనే రెండో అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకు అయిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) పిల్లల భవిష్యత్తు కోసం ప్రత్యేక ప్లాన్‌ను తీసుకువచ్చింది. ఈ ప్లాన్ కింద పిల్లలకు పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో ఖాతా తెరవడానికి అనుమతి ఇవ్వబడుతుంది. PNB జూనియర్ సేవింగ్స్ ఫండ్ అకౌంట్ పేరుతో ఈ ప్లాన్‌ను తీసుకువచ్చింది పిఎన్‌బి. ఇందులోభాగంగా చిన్నారులకు అనేక సౌకర్యాలు కల్పిస్తున్నారు.

PNB జూనియర్ సేవింగ్స్ ఫండ్ అకౌంట్..
పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) తన అధికారిక ట్విట్టర్‌లో దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించింది. PNB జూనియర్ సేవింగ్స్ ఫండ్ ఖాతాతో మీ పిల్లలకు ఉజ్వల భవిష్యత్తును అందంచండి అని పేర్కొన్న పిఎన్‌బి.. ఒక లింక్‌ను కూడా యాడ్ చేసింది. ఈ లింక్‌పై క్లిక్ చేయడం ద్వారా జూనియర్ సేవింగ్స్ ఫండ్ అకౌంట్‌కు సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకోవచ్చునని పేర్కొంది. అలాగే.. పిఎన్‌బి అధికారిక వెబ్‌సైట్.. www.pnbindia.inని సందర్శించడం ద్వారా కూడా దీనికి సంబంధించిన సమాచారాన్ని పొందవచ్చు. ఈ ఖాతాలో ఇంటర్నెట్ బ్యాంకింగ్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది.

సేవింగ్స్ బ్యాంక్ ఖాతాను పిల్లలు కూడా ఆపరేట్ చేయొచ్చు..
పంజాబ్ నేషనల్ బ్యాంక్ తెలిపిన సమాచారం ప్రకారం.. ఈ సేవింగ్స్ ఖాతాను తల్లిదండ్రులు తమ బిడ్డల కోసం ఓపెన్ చేయొచ్చు. అదే సమయంలో, 10 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలు వారు కోరుకుంటే స్వతంత్రంగా పొదుపు ఖాతాను తెరవవచ్చు. దీంతో పాటు, ఈ ఖాతాను ఆపరేట్ చేయడానికి అనుమతి కూడా ఇవ్వబడింది. ఈ ఖాతా KYC, ఖాతా అప్లికేషన్‌ను ఫిల్ చేయడం, ఫోటోగ్రాఫ్, గుర్తింపు కార్డు, చిరునామా వంటి అవసరమైన ధృవీకరణ పత్రాల ఆధారంగా ఈ అకౌంట్‌ను తెరుస్తారు.

పాఠశాల/కళాశాలకు ఉచితంగా DD చేయవచ్చు..
ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఈ ఖాతాలో మినిమమ్ బ్యాలెన్స్ ఉంచాల్సిన అవసరం లేదు. అలాగే ఖాతాను జీరో బ్యాలెన్స్‌తో తెరవవచ్చు. ఇంకా ఈ ఖాతా ద్వారా పాఠశాల, కళాశాలలకు ఉచితంగా డిమాండ్ డ్రాఫ్ట్ (DD) తయారు చేయబడుతుందని పిఎన్‌బి ప్రకటించింది. అలాగే, 18 ఏళ్ల వయస్సు వచ్చిన తర్వాత, అన్ని సాధారణ నియమాలు ఈ ఖాతాకు వర్తింపజేయబడతాయని బ్యాంక్ స్పష్టం చేసింది. ఇది కాకుండా.. నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్‌ఫర్ (NEFT) లావాదేవీలను ఈ ఖాతా కింద రోజుకు 10 వేల రూపాయల వరకు ఉచితంగా చేయవచ్చు. అంటే ఎటువంటి ఛార్జీ తీసుకోబడదన్నమాట. కాగా, మైనర్‌కు 18 ఏళ్లు నిండిన తరువాత ఆ ఖాతా సాధారణ కేటగిరీ సేవింగ్స్ ఫండ్ ఖాతాగా మార్చబడుతుంది. తద్వారా మైనర్ యొక్క ఖాతా ఏ విధంగానూ దుర్వినియోగం చేయబడదు.

Also read:

Aadi Saikumar: నయా మూవీ మొదలు పెట్టిన యంగ్ హీరో.. రెగ్యులర్ షూటింగ్‌లో ఆది సాయికుమార్ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్

Keerthy Suresh : చీరకట్టు.. చిరునవ్వు.. కుర్రాళ్ళ గుండెల్లో బాణాలు గుచ్చుతున్న ముద్దుగుమ్మ..

Akhanda: బాలయ్య యాక్షన్‌కు థియేటర్స్ దద్దరిలాల్ల్సిందే.. అఖండలో నటసింహం విశ్వరూపం చూపించనున్నారట..

Click on your DTH Provider to Add TV9 Telugu