Viral Video: మనుషులేనా పల్టీలు కొట్టేది.. నేను కొట్టలేనా.. సోషల్ మీడియాలో పావురం ఛాలెంజ్

సోషల్ మీడియాలో (Social media) మనం రోజూ ఎన్నో రకాల వీడియోలు చూస్తూ ఉంటాం. వాటిలో కొన్ని ఫన్నీగా అనిపిస్తే.. మరికొన్ని ఆశ్చర్యం కలిగిస్తాయి. అయితే ప్రస్తుతం ఇంటర్నెట్ లో ట్రెండ్ అవుతున్న వీడియోల్లో (Video) అధిక శాతం యువతవే....

Viral Video: మనుషులేనా పల్టీలు కొట్టేది.. నేను కొట్టలేనా.. సోషల్ మీడియాలో పావురం ఛాలెంజ్
Pigeon Video
Follow us
Ganesh Mudavath

|

Updated on: Jul 29, 2022 | 9:14 PM

సోషల్ మీడియాలో (Social media) మనం రోజూ ఎన్నో రకాల వీడియోలు చూస్తూ ఉంటాం. వాటిలో కొన్ని ఫన్నీగా అనిపిస్తే.. మరికొన్ని ఆశ్చర్యం కలిగిస్తాయి. అయితే ప్రస్తుతం ఇంటర్నెట్ లో ట్రెండ్ అవుతున్న వీడియోల్లో (Video) అధిక శాతం యువతవే ఉంటున్నాయి. పాటలు పాడడం, డ్యాన్స్ చేయడం, స్టంట్స్‌కి సంబంధించిన వీడియోలు ట్రెండింగ్ గా నిలుస్తున్నాయి. అయితే స్టంట్స్ కు సంబంధించిన వీడియోనూ ఎక్కువ మంది యూజర్లు చూస్తారు. వివిధ యాప్ లలో ఇలా స్టంట్ చేసే వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఇప్పటి వరకు మనుషులు స్టంట్స్ చేస్తారన్న విషయం మనందరికీ తెలుసు. కానీ ఓ పావురం స్టంట్స్ చేయడాన్ని మీరెప్పుడైనా చూశారా.. చూడకపోతే ఒకసారి ఈ వీడియో చూసేయండి. ఈ క్లిప్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తెగ చక్కర్లు కొడుతోంది. వీడియోలో పావురం బ్యాక్‌ఫ్లిప్‌ (పల్టీ) కొట్టడం కనిపిస్తుంది. రెక్కలు విప్పడం, ఎగరడం, పల్టీలు కొట్టడాన్ని చూడొచ్చు. పర్ఫెక్ట్ పర్ఫెక్షన్‌తో బ్యాక్‌ఫ్లిప్‌ కొడుతుంది.

ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారం ట్విట్టర్‌లో పోస్ట్ అయింది. ఈ 11 సెకన్ల వీడియోను ఇప్పటి వరకు 6.3 మిలియన్ల మంది చూశారు. వందలాది మంది ఈ వీడియోను లైక్ చేసి రకరకాల కామెంట్లు చేస్తున్నారు. పల్టీలు కొట్టడానికి చాలా కష్టపడాలని, కానీ ఈ పావురం మాత్రం సులభంగా చేసేస్తోందని తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. కాగా ఈ వీడియోను చూసిన వారు తమకు తెలిసిన వారికి కూడా షేర్ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి