Uses Of Cars In Pak: పెరుగుతున్న పెట్రోల్ ధరలు.. గాడిద మీద ఆఫీస్‌కు రావడానికి అనుమతి కోరుతున్న ఉద్యోగులు.. ఫన్నీమీమ్స్ వైరల్..

రోజు రోజుకీ పెరుగుతున్న ధరలతో ప్రజల జీవితంపై తీవ్ర ప్రభావం పడింది. తాము ఇక కార్లు, మోటార్ బైక్స్ వంటివాటిని ఉపయోగించలేమని.. ఇక నుంచి 'గాడిద బండి'ని ఉపయోగించాలేమో అంటూ ప్రజలు కామెంట్ చేస్తున్నారు. ఇటీవల, విమానాశ్రయం ఉద్యోగి పంపిన లేఖ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

Uses Of Cars In Pak: పెరుగుతున్న పెట్రోల్ ధరలు.. గాడిద మీద ఆఫీస్‌కు రావడానికి అనుమతి కోరుతున్న ఉద్యోగులు.. ఫన్నీమీమ్స్ వైరల్..
Uses Of Cars In Pak

Updated on: Jun 07, 2022 | 7:48 AM

Uses Of Cars In Pak: పాకిస్థాన్‌లో ప్రభుత్వం మారడంతో సామాన్య ప్రజల ఇబ్బందులు కూడా పెరిగాయి. ఇమ్రాన్‌కు బదులు షాబాజ్ షరీఫ్‌ను సింహాసనంపై కూర్చోబెడితే ‘మంచి రోజులు’ వస్తాయని ఇంతకు ముందు ప్రజలు భావించారు. అయితే షరీఫ్ ప్రభుత్వం కూడా పాక్ ప్రజల జీవితాన్ని ఏ మాత్రం మార్చే దిశగా పనిచేయలేదు.. సరికదా అంతకు ముందు కంటే ప్రజల జీవితాన్ని మరింత అధ్వాన్నంగా చేసింది. నానాటికీ పెరుగుతున్న ద్రవ్యోల్బణం ప్రజలకు చెమటలు  పట్టిస్తోంది. నిత్యావసర వస్తువులు.. ముఖ్యంగా చమురు ధరలు భారీగా పెరిగాయి. గత ప్రభుత్వంలో పెట్రోల్ ధర రూ.140 ఉంటే ఇప్పుడు రూ.200కి  చేసింది. గత వారం రోజులుగా పాకిస్థాన్‌లో పెట్రోల్ ధర రూ. 60 కంటే ఎక్కువ పెరిగింది. రోజు రోజుకీ పెరుగుతున్న ధరలతో ప్రజల జీవితంపై తీవ్ర ప్రభావం పడింది. తాము ఇక కార్లు, మోటార్ బైక్స్ వంటివాటిని ఉపయోగించలేమని.. ఇక నుంచి ‘గాడిద బండి’ని ఉపయోగించాలేమో అంటూ ప్రజలు కామెంట్ చేస్తున్నారు. ఇటీవల, విమానాశ్రయం ఉద్యోగి పంపిన లేఖ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అందులో అతను గాడిదపై కార్యాలయానికి రావడానికి పాకిస్తాన్ ఏవియేషన్ అథారిటీని అనుమతి కోరాడు.

 

అంతే కాకుండా పెరుగుతున్న పెట్రోల్ ధరలపై సోషల్ మీడియాలో చాలా మీమ్స్, వీడియోలు హల్ చల్ చేస్తున్నాయి. ప్రజలు వివిధ రకాల మీమ్స్‌ను పంచుకుంటున్నారు. వారి భావాలను వ్యక్తం చేస్తూ.. తాజాగా ప్రభుత్వం తీరుపై నిరసన తెలియజేస్తున్నారు. వ్యక్తులు షేర్ చేసిన కొన్ని ఫన్నీ మీమ్‌లను చూద్దాం…

పెరుగుతున్న చమురు ధరల కారణంగా పాకిస్తాన్‌లో అనేక చోట్ల ప్రదర్శనలు కూడా చేస్తున్నారు.  రోడ్లపై టైర్లు తగులబెట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు.

 

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..