మీరు వేరుశెనగ, బెల్లం మిఠాయి ప్రియులా..? ఐతే మీరు ఈ వీడియోను ఒకసారి తప్పక చూడండి. ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్‌గా మారుతున్న ఈ వీడియో ఫ్యాక్టరీలో పల్లి చిక్కీని ఎలా తయారు చేస్తారో చూపిస్తుంది. ఒక ఇంట్లో కొందరు కార్మికులు పల్లిలు, బెల్లం పాకంతో తయారయ్యే చిక్కీలను వారు ఎలా చేస్తున్నారో చూస్తే మీరు షాక్ అవుతారు. చిక్కీ తయారీ కోసం వారు ఎలాంటి పరిశుభ్రతను పాటించటం లేదు.. కాళ్లతో తొక్కుతున్న నేలపైనే వారు బెల్లం పాకంలో వేసిన చిక్కీలకు అచ్చులు పోస్తున్నారు. ఇక్కడ తయారవుతున్న పల్లి పట్టీల ఈ వీడియో చూడటానికి నిజంగా అసహ్యంగా ఉంది. ఈ వైరల్ వీడియో తమిళంలో ఉంది. లక్ష్మీకుంజి అనే వినియోగదారు తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో వీడియో షేర్ చేశారు. దీంతో వీడియో చూసిన నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
వైరల్ అవుతున్న వీడియోలో అప్పటికే బెల్లం పాకంలో పోసిన వేరుశెనగలను కావాల్సిన ఆకారాల్లో అచ్చు వేస్తున్నారు. వీడియోలో చూసినట్టుగా అక్కడ కొందరు పల్లి పట్టీలు తయారు చేసే పనిలో నిమగ్నమై ఉన్నారు. వారంతా అక్కడి నేలపైనే చిక్కీలు తయారు చేస్తున్నారు. పాకంలో పోసిన పల్లీల మిశ్రమాన్ని వారు నేలపైనే కొడుతున్నారు. చిక్కీ తయారు చేసే అచ్చుల్లో బెల్లం, పల్లీల మిశ్రమాన్ని వేసి, దానిని చపాతీ కర్రతో రోల్ చేస్తున్నారు. ఆ తర్వాత దానిని ముక్కలుగా కట్ చేస్తున్నారు. ఇదంతా వారు తొక్కుతున్న నేలపైనే చేస్తున్నారు. ఈ వైరల్ వీడియో చూసి ప్రజలు షాక్ అయ్యారు.
Instagram వైరల్ అవుతున్న ఈ వీడియోపై నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. బాబోయ్ మనం ఎంతో ఇష్టంగా తినే వేరుశెనగ చిక్కీలను ఇంత దారుణంగా తయారు చేస్తారా అనుకుంటూ షాక్ అవుతున్నారు. ఇంత మురికి ప్రదేశంలో చిక్కీ తయారైందా అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అయితే, మీరు నాణ్యమైన బెల్లం చిక్కీని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు:
కాబట్టి నాణ్యత లేని బెల్లం చిక్కీని కొనుగోలు చేయకుండా ఇంట్లోనే తయారు చేసుకోండి. ఇంట్లోనే పల్లి పట్టీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
అవసరమైన పదార్థాలు..
వేరుశెనగలు – 1 కప్పు
నువ్వులు – 1/2 కప్పు
బెల్లం – 1/2 కప్పు
నెయ్యి – 2 టేబుల్ స్పూన్లు
రెసిపీ:
ముందుగా వేరుశెనగలు, నువ్వులను శుభ్రంగా కడిగి బాణలిలో వేసి సరైన పద్దతిలో, మంచి రంగు వచ్చేవరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాణలిలో బెల్లం వేసి కావాల్సిన మేరకు పాకాన్ని సిద్ధం చేసుకోవాలి. పాకం సరిగ్గా వచ్చిన తర్వాత వేయించిన వేరుశెనగలు, నువ్వులను వేసి బాగా కలపాలి. తర్వాత వెడల్పాటి పాన్‌కు నెయ్యి రాసి అందులో ఈ మిశ్రమాన్ని పోయాలి. తరువాత మీకు నచ్చిన ఆకారంలో ముక్కలుగా కట్ చేసి చల్లారనివ్వండి.. అంతే.. ఇప్పుడు రుచికరమైన వేరుశెనగ మిఠాయి రెడీ.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..