Viral Video: ఓర్నాయనో ఫ్లాష్ మాన్.. చిన్న కథ కాదు ఇది.. పానీపూరీతో ఇంత సంపాదనా..!
సాధారణంగా ఓ పానీపూరీ బండి నడిపే వ్యక్తి సంపాధన ఎంత ఉంటుంది అంటే.. 20-30 వేలు ఉండొచ్చని చాలా మంది అనుకుంటారు. కానీ ఇక్కడో పానీపూరీ విక్రయించే వ్యక్తి నెలసరి ఆదాయం ఎంతో తెలిస్తే మీరు నోరెళ్లబెడతారు. అవును ప్రస్తుతం ఆ వ్యక్తి సంపాధన గురించే సోషల్ మీడియా మొత్తం చర్చ నడుస్తోంది. ఇంతకూ అతని ఆదాయం ఎంతటనే కదా మీ డౌట్ అయితే తెలుసుకుందాం పదండి.

ఒక పానీపూరీ వ్యాపారి సంపాదన గురించిన ఓ ఇన్‌ఫ్లూఎన్సర్ షేర్ చేసిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. ఆ కంటెంట్ క్రియేటర్ షేర్ చేసిన వివరాల ప్రకారం, ఆ వ్యాపారి నెలకు ఏకంగా రూ. 90,000 సంపాదిస్తున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. కాంటెంట్ క్రియేటైర్ అయిన కాశీ పెరీరా అనే యువకుడు స్థానికంగా ఉన్న ఓ పానిపూరీ బండి వద్దకు వెళ్లి ఒక రోజంతా ఆ స్టాల్ వద్ద హెల్పర్‌గా పని చేశాడు. ఈ క్రమంలో అతను వ్యాపిరి రోజంతా ఎంత సంపాధిస్తున్నాడు అనే విషయాలు వెల్లడించాడు.
ఈ పానీపూరి వ్యాపారి సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు తన వ్యాపారాన్ని నడిపిస్తారని. ప్లేటుకు రూ.30 చొప్పునా రోజంతా సుమారు 80 నుండి 100 ప్లేట్లు అమ్ముడవుతాడని కాశీ చెప్పుకొచ్చాడు, దీని బట్టి చూస్తే ఆ పానీపూరి వ్యాపారి ఒక రోజు మొత్తం రూ.3,000 సంపాధిస్తున్నాడని తెలిపాడు. అంటే ఒక నెలలో అతను ఏకంగా 90,000 సంపాధిస్తున్నాడని, సంవత్సరానికి దాదాపు రూ. 10.8 లక్షల ఆదాయాన్ని ఆర్జిస్తున్నాడని పరేరా తెలిపారు.
వీడియో చూడండి..
View this post on Instagram
నెటిజన్ల రియాక్షన్
కాపీ పరేరా పోస్ట్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఇతని సంపాదన నా సీటీసీ (CTC) కంటే ఎక్కువే ఉందని ఓ యూజర్ కామెంట్ చేయగా, బీకామ్ చదివే తన స్నేహితులకు ఈ వీడియో చూపించాల్సిందే అంటూ మరో క్రియేటర్ సరదాగా కామెంట్ చేశాడు. దీనికి రిప్లేగా మరో యూజర్ ఇలా కామెంట్ చేశాడు.. ఇతనికి బీకామ్ గ్రాడ్యుయేట్స్ అంటే ఏదో పాత కక్ష ఉన్నట్టుందని రాసుకొచ్చాడు. అయితే, కొందరు మాత్రం ఈ లెక్కలను తప్పని చెబుతున్నారు. అతను కేవలం ఆదాయం మాత్రమే చెబుతున్నారని.. కానీ, అందులో ఖర్చులు, రెంట్ అన్ని తీసేస్తే మిగిలే లాభం తక్కువగానే ఉండవచ్చని అభిప్రాయపడుతున్నారు.
అయితే గతంలో ఇలానే ఓ వ్యక్తి చేసిన పోస్ట్ వైరల్ కావడంతో తమిళనాడులో ఒక పానీపూరీ వ్యాపారి ఏడాదికి రూ. 40 లక్షల ఆన్‌లైన్ పేమెంట్స్ అందుకున్నాడని ఆరోపణలు రావడంతో జీఎస్టీ అధికారులు అతనికి నోటీసులు జారీ చేశారు. దీంతో ఈ విషయం కూడా అప్పుడు సోషల్ మీడియాలో తెగవైరల్‌గా మారింది.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
