గాల్లో ఒక్కసారిగా మారిన ఎయిరిండియా విమానం ఎత్తు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..?
ఎయిరిండియా విమానానికి పెనుప్రమాదం తప్పింది. గాల్లో ప్రయాణిస్తున్న విమానంలో ఒక్కసారిగా తీవ్రమైన కుదుపులు చోటుచేసుకున్నాయి. అనుకోకుండా విమానం ఎత్తు మారడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులతో పాటు విమాన సిబ్బందికి కూడా గాయాలయ్యాయి. అయితే పైలట్ సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో విమానం ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయి పెద్ద ప్రమాదం తప్పింది.

అసలేం జరిగింది?
ఎయిర్ ఇండియాకు చెందిన AI2379 విమానం ఆకాశంలో ప్రయాణిస్తున్న సమయంలో అకస్మాత్తుగా తీవ్రమైన వాతావరణ మార్పులు లేదా సాంకేతిక కారణాల వల్ల భారీ కుదుపులకు లోనైంది. గాల్లో ఉండగానే విమానం ఎత్తు ఒక్కసారిగా పడిపోవడంతో లోపల ఉన్న ప్రయాణికులు, విధులు నిర్వహిస్తున్న క్యాబిన్ క్రూ సిబ్బందికి గాయాలు అయ్యాయి. ఈ ఘటనతో విమానంలో ఒక్కసారిగా గందరగోళం ఏర్పడగా.. ప్రయాణికుల హాహాకారాలు వ్యక్తం చేశారు.
సురక్షిత ల్యాండింగ్ – ప్రాథమిక వైద్యం
విమానం తీవ్రమైన కుదుపులకు గురైనప్పటికీ, పైలట్లు ఎంతో చాకచక్యంగా పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. వెంటనే ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కి సమాచారం అందించి ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు అనుమతి కోరారు. ఢిల్లీ విమానాశ్రయంలో విమానం సురక్షితంగా ల్యాండింగ్ కావడంతో ప్రయాణికులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రయాణికులు, విమాన సిబ్బంది అందరినీ క్షేమంగా కిందకు దించారు. గాయపడిన పలువురు ప్రయాణికులు, క్యాబిన్ సిబ్బందికి చికిత్స అందించారు. ప్రస్తుతం ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారని, ఈ ఘటనపై సంబంధిత అధికారులు విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది.