Optical Illusion: ఈ చిత్రంలో దాగి ఉన్న ఉడుతను 20 సెకన్లలో గుర్తించండి.. మీ చూపు డేగ చూపే..

ఆప్టికల్ ఇల్యూషన్లు చిత్రాలు సాధారణంగా ప్రజల మెదడుకి పదును పెడతాయి. తెలివితేటలను పరీక్షిస్తాయి. ఈ పజిల్ చిత్రాలను చూసిన వెంటనే గందరగోళానికి గురవడం సహజం. అయితే ఇప్పుడు ఇలాంటి ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రం వైరల్ అయ్యింది. ఈ చిత్రంలో ఒక ఉడుత దాగి ఉంది. ఈ పజిల్‌ను ఇరవై సెకన్లలోపు పరిష్కరించమని మీకు సవాలు ఇవ్వబడింది. అలా కనుగొంటే.. మీ చూపు డేగ చూపట.

Optical Illusion: ఈ చిత్రంలో దాగి ఉన్న ఉడుతను 20 సెకన్లలో గుర్తించండి.. మీ చూపు డేగ చూపే..
Optical Illusion

Updated on: Sep 05, 2025 | 6:45 PM

కళ్ళు , మెదడును సవాలు చేసే ఆసక్తికరమైన ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కొంతమందికి ఇలాంటి చిక్కుముడుల చిత్రాలను పరిష్కరించడం చాలా ఆనందంగా ఉంటుంది. అయితే చాలా మంది అలాంటి పజిల్స్‌ను పరిష్కరించడంలో విఫలమవుతారు. కానీ ఈ చిత్రాలు కొంచెం భ్రమని కలిగిస్తూ.. రకరకాలుగా కనిపిస్తూ.. మన కళ్ళ సున్నితత్వాన్ని , ఆలోచనా సామర్థ్యాన్ని పరీక్షిస్తాయి. కొన్ని మన వ్యక్తిత్వాన్ని వెల్లడిస్తాయి. మరికొన్ని దృష్టి సామర్ధ్యాన్ని, పరిశీలన శక్తిని తెలియజేస్తాయి. ఇప్పుడు అలాంటి ఒక చిత్రం వైరల్ అయింది. ఈ త్రాన్ని జాగ్రత్తగా చూసి ఇక్కడ ఉడుత ఎక్కడ దాగి ఉందో చెప్పండి. ఈ పజిల్ చిత్రాన్ని పరిష్కరించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా?

ఈ చిత్రంలో ఏముంది?

ఆప్టికల్ ఇల్యూషన్స్ చూడటం చాలా సాధారణంగా కనిపిస్తుంది. అయితే ఫోటోలో సమాధానం కనుగొనడానికి కూర్చున్నప్పుడు.. అది ఎంత కష్టమో అర్థమవుతుంది. ఇప్పుడు వైరల్ అయిన ఈ చిత్రంలో, పిల్లల నుంచి యువకులు, మహిళలు వరకు పచ్చని పొలంలో పడి ఉన్న చెత్తను తీయడంలో బిజీగా ఉన్నారు. కానీ ఈ చిత్రంలో ఒక ఉడుత దాగి ఉంది. ఈ ఉడుత ఎక్కడ ఉందో కేవలం 20 సెకన్లలో కనుగొనే సవాలు మీకు ఇవ్వబడింది. మీరు సిద్ధంగా ఉంటే.. సమయం ఇప్పుడే ప్రారంభం అయింది.

మీరు ఈ సవాలును స్వీకరించారా?

సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ చిత్రం ఆప్టికల్ ఇల్యూషన్ కు ఒక చక్కటి ఉదాహరణ. మీకు డేగ లాంటి కళ్ళు ఉంటే.. నిర్ణీత సమయంలోనే ఉడుతను గుర్తించగలరు. ఈ పజిల్ చిత్రాన్ని పరిష్కరించడానికి మీరు సవాలుకు సిద్ధంగా ఉన్నారని, సిద్ధంగా ఉన్నారని మేము ఆశిస్తున్నాము.

ఇవి కూడా చదవండి

మీరు ఉడుతను కనుగొన్నారా?

Optical Illusion 1

ఈ ఆప్టికల్ ఇల్యూషన్ ఫోటో ప్రజలను గందరగోళానికి గురిచేసింది. మీరు ఈ చిక్కును పరిష్కరించగలిగితే, మీకు మంచి కంటి చూపు ఉందని, తెలివైనవారని అర్థం. ఇచ్చిన సమయంలో మీరు ఉడుతను కనుగొనలేకపోతే,.. ఎక్కువగా చింతించకండి. సమాధానం మేము చెబుతాము. ఈ చిత్రంలో ఒక యువతి చెత్తను తీసుకుని గోనె సంచిలో వేయడం కనిపిస్తుంది. ఆ గోనె సంచి పక్కన ఒక ఉడుత ఉంది.

 

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..