Optical Illusion: ఛాలెంజ్ స్వీకరించాలంటే దమ్ముండాలి.. ఈ ఏనుగుకి ఎన్ని కాళ్లు ఉన్నాయో చెప్పగలరా?

|

Dec 15, 2022 | 7:59 PM

Optical Illusion: వినేదంతా నిజం కాదనేది ఎంత వాస్తవమో.. చూసేదంతా నిజం కాదనేది కూడా అంతే వాస్తవం. ఎందుకంటే.. ఒక్కోసారి మన కళ్లే మనల్ని మోసం చేస్తుంటాయి. ఇలాంటి పరిస్థితి ప్రతి ఒక్కరు తమ జీవితంలో ఒక్కసారైనా ఫేస్ చేసి ఉంటారు.

Optical Illusion: ఛాలెంజ్ స్వీకరించాలంటే దమ్ముండాలి.. ఈ ఏనుగుకి ఎన్ని కాళ్లు ఉన్నాయో చెప్పగలరా?
Optical Illusion
Follow us on

వినేదంతా నిజం కాదనేది ఎంత వాస్తవమో.. చూసేదంతా నిజం కాదనేది కూడా అంతే వాస్తవం. ఎందుకంటే.. ఒక్కోసారి మన కళ్లే మనల్ని మోసం చేస్తుంటాయి. ఇలాంటి పరిస్థితి ప్రతి ఒక్కరు తమ జీవితంలో ఒక్కసారైనా ఫేస్ చేసి ఉంటారు. ఎండమావులను ఉదాహరణకు చెప్పుకోవచ్చు. దూరం నుంచి చూస్తే.. అక్కడ పెద్ద నీటి కొలను ఉన్నట్లే అనిపిస్తుంది. కానీ, ఎంతకీ నీరు కనిపించదు. అలాంటివే ఆప్టికల్ ఇల్యూజన్ ఫోటోలు కూడా. ఇవి చూడటానికి బాగానే ఉన్నా.. అందులోని వాస్తవాలు గజిబిజిగా ఉండి గందరగోళం క్రియేట్ చేస్తుంది. గందరగోళం అనడం కంటే.. మన శక్తి సామర్థ్యాలకు, ఐక్యూ, పరిశోధనా శక్తికి ఒక పరీక్షగా చెప్పుకుంటే బెటర్. ఎందుకంటే.. ఇందులోని రహస్యాన్ని కనిపెట్టడం పెద్ద టాస్క్ లా ఉంటుంది. తాజాగా అలాంటి ఫోటో ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

సోషల్ మీడియాలో ‘ఏనుగు’కు సంబందించి ఒక స్కెచ్ పేయింటింగ్ వైరల్ అవుతోంది. సాధారణంగా ఏనుగు భారీ కాయంతో నాలుగు కాళ్లు, ఒక తొండం, ఒక తోక, రెండు దంతాలు కలిగి ఉంటుంది. ఈ పేయింటింగ్‌లోని ఏనుగు కూడా అలాగే ఉంది. అయితే, ఇందులోని ఏనుగు చాలా స్పెషల్. చూడటానికి నాలుగు కాళ్లే ఉంటాయి. లెక్కపెడితే చుక్కలు కనిపిస్తాయి. అంత కన్‌ఫ్యూజ్‌గా ఉంటుంది. ఆ ఏనుగుకు ఎన్ని కాళ్లు ఉంటాయో చెప్పడం చాలా కష్టంగా ఉంటుంది. మీరేమైనా చెప్పగలిగితే చెప్పండి. ఆ ఏనుగుకు ఎన్ని కాళ్లు ఉన్నాయో చెబితే మీరు నిజంగా తోపులే అనుకోవచ్చు.

వాస్తవానికి ఇది పెద్ద సవాలే. ఆ ఏనుగుకు ఎన్ని కాళ్లు ఉన్నాయో చెప్పడం చాలా కష్టం. దీనిని కనిపెట్టేందుకు చాలా మంది ప్రయత్నించినప్పటికీ.. చాలామంది ఫెయిల్ అయ్యారు. మరి మీలో ఈ సవాలును స్వీకరించే సత్తా ఉందా? ఆ ఏనుగకు ఎన్ని కాళ్లు ఉన్నాయో చెప్పగలరా? అయితే కింద ఫోటో ఉంది చూసి ఎన్ని కాళ్లు ఉన్నాయో చెప్పండి.

ఇవి కూడా చదవండి

Optical Illusion

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..