మనం ఎండ మావులు చూసే ఉంటాం. రోడ్డుపై గానీ, విశాలమైన మైదానంలో గానీ ఈ ఎండమావులు కనిపిస్తాయి. చూసేందుకు కొంత దూరంలో నీళ్లు ఉన్నట్లు అనిపిస్తుంటుంది. ఆ నీళ్లను వెతుకుతూ పోతే అవి ఎంతకీ కనిపించవు. మన భ్రమ మాత్రమే. అలా మన కళ్లే మనల్ని కన్‌ఫ్యూజ్ చేస్తాయన్నమాట. ఇక ఆప్టికల్ ఇల్యూజన్ పిక్స్ కూడా అంతే. తికమకకు గురి చేస్తాయి. అలాంటి గజిబిజి గందరగోళం సృష్టించే ఫోటోలో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. తాజాగా అలాంటి ఫోటో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. చూసేందుకు ఈజీగా ఉన్నా.. చాలా క్యాలిక్యూలేటెడ్‌గా అందరిని ఆలోచనలో పడేస్తోంది.
వైరల్ అవుతున్న ఈ లాజికల్, ఆప్టికల్ ఇల్యూజన్ పిక్‌లో గుడ్ల ట్రే ఉంది. ఆ ట్రే లో కొన్ని గుడ్లు ఉన్నాయి. అయితే, పైకి కొన్ని గుడ్లు మాత్రమే కనిపిస్తున్నాయి. కనిపించని గుడ్లు ఎన్నో చెప్పడమే ఇక్కడ బిగ్ టాస్క్. వాస్తవానికి ఈ టాస్క్ చేయడం చాలా ఈజీ. కాస్త ఫోకస్ పెడితే.. ఆ ట్రేలో మొత్తం ఎన్ని గుడ్లు ఉన్నాయో ఈజీగా చెప్పేయొచ్చు.
ముందుగా కనిపించే ట్రే లో 16 గుడ్లు ఉన్నాయి. అయితే, వీటి వెనుక మరికొన్ని గుడ్లు ఉన్నాయి. ఆ ట్రే లో మొత్తం ఎన్ని గుడ్లు ఉన్నాయో ఇప్పుడు మీరు కనిపెట్టాలి. అదే మీ టాస్క్. దీనిని కనిపెట్టడం వలన మీ బ్రెయిన్ షార్ప్ అవడమే కాకుండా, ఆలోచన పరిధి విస్తృతమవుతుంది. ఓర్పు, సహనం, ఆలోచనా శక్తి, సమస్య పరిష్కార సామర్థ్యం పెరుగుతుంది.
ట్రే లో మొత్తం 30 గుడ్లు ఉన్నాయి. అదెలా కనుగొనాలో ఇప్పుడు తెలుసుకుందాం.
యనం చూస్తున్న ట్రేలో దిగువన 4 వరుసల 4 గుడ్లు ఉన్నాయి. అంటే దానిలో 4*4 = 16 గుడ్లు ఉన్నాయి.
రెండవ లైన్‌లో 3 వరుసల 3 గుడ్లు ఉన్నాయి. అంటే 3*3 = 9 గుడ్లు ఉన్నాయి.
దాని పై లైన్‌లో 2 వరుసల 2 గుడ్లు ఉన్నాయి. అంటే 2*2 = 4 గుడ్లు ఉన్నాయి.
చివరన ఒక గుడ్డు మాత్రమే ఉంటుంది.
మీరు అన్ని లేయర్‌లలో గుడ్లను కలిపితే.. 16+9+4+1 ట్రేలోని మొత్తం గుడ్ల సంఖ్య 30కి అవుతుంది.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..