Viral News: ఆన్‌లైన్‌ షాపింగ్‌లో రికార్డు సేల్స్‌.. రూ. 14 వేల కోట్లు విలువ చేసే వస్తువుల్ని ఒక్కడే అదీ గంటలో అమ్మేశాడు!

|

Oct 24, 2021 | 5:42 AM

Viral News: దీపావళి సేల్‌ అంటూ ఆన్‌లైన్‌ షాపింగ్‌కు సంబంధించి అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ వంటి ఈ కామర్స్ వెబ్‌సైట్లు భారీ ఆఫర్లతో ఊదరగొట్టడం చూస్తూనే ఉంటాం.

Viral News: ఆన్‌లైన్‌ షాపింగ్‌లో రికార్డు సేల్స్‌.. రూ. 14 వేల కోట్లు విలువ చేసే వస్తువుల్ని ఒక్కడే అదీ గంటలో అమ్మేశాడు!
Shopping
Follow us on

Viral News: దీపావళి సేల్‌ అంటూ ఆన్‌లైన్‌ షాపింగ్‌కు సంబంధించి అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ వంటి ఈ కామర్స్ వెబ్‌సైట్లు భారీ ఆఫర్లతో ఊదరగొట్టడం చూస్తూనే ఉంటాం. కొన్ని టీవీ ఛానెల్స్‌లో ప్రమోటర్లు కొన్ని వస్తువు గురించి వివరిస్తూ అమ్మే ప్రయత్నం చేస్తుంటారు. అలాగే చైనాలోనూ ‘టవోబవో’ పేరుతో చైనీస్‌ షాపింగ్‌ యాప్‌ ఉంది. అలీ బాబా గ్రూపునకు చెందిన ఈ యాప్‌లో సోషల్‌మీడియా బ్యూటీ ఇన్‌ఫ్లూయెన్సర్‌ లీ జియాకి వస్తువుల గురించి తెలియజేస్తూ విక్రయిస్తుంటాడు. మహిళలు వాడే లిప్‌స్టిక్స్‌ను అమ్మడంలో లీ దిట్ట. అందుకే అతడు ‘కింగ్‌ ఆఫ్ లిప్‌స్టిక్స్‌’, ‘లిప్‌స్టిక్‌ బ్రదర్‌’గా పాపులారిటీ సంపాదించాడు. అయితే, తాజాగా లీ ఒక్క రోజులోనే వేల కోట్ల రూపాయల విలువ చేసే వస్తువుల్ని విక్రయించి సరికొత్త రికార్డు సృష్టించాడు.

మన దేశంలో దివాలీ సేల్‌లాగా.. అలీబాబా సంస్థ ఏటా యాన్యువల్‌ షాపింగ్‌ ఫెస్టివల్‌ను నిర్వహించి భారీ ఆఫర్లను ప్రకటిస్తుంటుంది. ఈ నేపథ్యంలో లీ జియాకి ప్రత్యక్షప్రసారం ద్వారా ఒక్క రోజులోనే లోషన్స్‌ నుంచి యాపిల్ ఎయిర్‌పాడ్స్‌ వరకు 14 వేల కోట్లు విలువ చేసే వస్తువుల్ని విక్రయించాడు. దీంతో చైనాలో అతడి పేరు మరోసారి మార్మోగిపోయింది.

గతంలో ఓసారి ఐదు నిమిషాల్లో 15వేల లిప్‌స్టిక్స్‌ను అమ్మి అందరి మన్ననలు పొందాడు లీ జియాకి. అంతేకాదు మోడల్స్‌కు 30 సెకన్లలో అత్యధిక లిప్‌స్టిక్స్‌ రాసిన వ్యక్తిగా గిన్నిస్‌ రికార్డులో చోటు కూడా సంపాదించాడు. అతడి సేల్స్‌ స్కిల్స్‌కు అందరూ ఫిదా అవుతున్నారు. డౌయిన్‌ అనే చైనీస్‌ టిక్‌టాక్‌లో లీ జియాకీకి 4 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. అమ్మకానికి పెట్టిన వస్తువుల గురించి తను నిజాయితీగా వివరిస్తూ.. కొనుగోలుదారుల నమ్మకాన్ని, మనసుల్ని గెలుచుకున్నాడు.

Also read:

World Biggest Bat: ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ బ్యాటట్‌.. ట్యాంక్ బండ్‌పై ఆవిష్కరించిన తెలంగాణ సర్కార్..

Weight Loss Tips: కొవ్వును కొవ్వుతోనే కరిగించాలి.. అదెలాగో ఇక్కడ తెలుసుకోండి.. ఆసక్తికర విశేషాలు మీకోసం..

Ind vs Pak T20 Match: నేడు భారత్-పాక్ మధ్య టీ20 మ్యాచ్.. ఫుల్ స్వింగ్‌లో బెట్టింగ్ రాయుళ్లు.. ఏకంగా ఇతర రాష్ట్రాల ఐపీతో..