Find Number: కళ్లలో చురుకుదనం, పదునైన ఆలోచన మీ సొంతమా.. ఇందులో మిస్‌ అయిన నెంబర్‌ను కనిపెట్టండి చూద్దాం.

సోషల్‌ మీడియా అంటే కేవలం ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదు. మెదడకు మేత పెట్టే లాజికల్‌ క్వశ్చన్స్‌కు కూడా కేంద్రంగా మారాయి. నెటిజన్ల ఆసక్తికి అనుగుణంగా రకరకాల ఆప్టికల్ ఇల్యూజన్స్‌ సోషల్‌ మీడియాలో సందడి చేస్తున్నాయి. ఒకప్పుడు కేవలం న్యూస్ పేపర్స్‌కి మాత్రమే పరిమితమైన..

Find Number: కళ్లలో చురుకుదనం, పదునైన ఆలోచన మీ సొంతమా.. ఇందులో మిస్‌ అయిన నెంబర్‌ను కనిపెట్టండి చూద్దాం.

Updated on: Mar 02, 2023 | 6:21 PM

సోషల్‌ మీడియా అంటే కేవలం ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదు. మెదడకు మేత పెట్టే లాజికల్‌ క్వశ్చన్స్‌కు కూడా కేంద్రంగా మారాయి. నెటిజన్ల ఆసక్తికి అనుగుణంగా రకరకాల ఆప్టికల్ ఇల్యూజన్స్‌ సోషల్‌ మీడియాలో సందడి చేస్తున్నాయి. ఒకప్పుడు కేవలం న్యూస్ పేపర్స్‌కి మాత్రమే పరిమితమైన ఇలాంటివి ఇప్పుడు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇమేజ్‌ ఆప్టికల్ ఇల్యూజన్స్‌, నెంబర్‌ ఆప్టికల్ ఇల్యూజన్స్‌ నెటిజన్లకు ఛాలెంజ్‌ విసురుతున్నాయి.

తాజాగా ఇలాంటి ఓ పజిల్‌ నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. పైన కనిపిస్తోన్న ఫొటోలో 1 నుంచి 100 వరకు నెంబర్లు కనిపిస్తున్నాయి కదూ! అయితే ఇందులో ఒక నెంబర్‌ను మిస్‌ చేశారు. ఆ మిస్‌ నెంబర్‌ను కనిపెట్టడమే ఈ పజిల్‌ ముఖ్య ఉద్దేశం ఇంతకీ ఆ నెంబర్‌ ఏంటో కనిపెట్టారా.? ఏముంది 1 నుంచి 100 వరకు అన్ని నెంబర్స్‌ని వెతుక్కుంటూ పోతే కనిపెట్టడం కష్టమేమి కాదంటారా.? అలా అయితే ఎవరైనా కనిపెట్టగలరు అందులో ఏముంది.. ఫొటో చూసిన పది సెకండ్లలో కనిపెట్టడమే గొప్పతనం.

ఇవి కూడా చదవండి

మరి మీకు మ్యాథ్య్స్‌పై ఎంత పట్టు ఉందో ఓసారి ప్రయత్నించండి.. మిస్సింగ్‌ నెంబర్‌ను క్షణాల్లో కనిపెట్టండి. అంత త్వరగా కనిపెట్టడం ఈజీ కాదంటారా.? అయితే ఒక చిన్న లాజిక్‌తో త్వరగా గుర్తించవచ్చు. ఓసారి రైట్‌ సైడ్‌ చివరి లైన్‌ను వర్టికల్‌గా గమనించండి. చివరి నెంబర్‌ +9 అవుతూ ఉంది కదూ! అయితే నెంబర్‌ మిస్‌ అయిన నెంబర్‌లో మాత్రం మార్పు గమనిస్తారు. అదే ’63 నుంచి 73′.. దీనర్థం సదరు లైన్‌లోనే నెంబర్‌ మిస్‌ అయ్యిందని. ఇప్పుడు ఆ లైన్‌ను గమనిస్తే వెంటనే మిస్సింగ్‌ నెంబర్‌ తెలిసిపోతుంది. గుర్తుపట్టారా.. అవును ఇందులో మిస్‌ అయిన నెంబర్‌ ’68’. చూశారుగా ఇలా చిన్న లాజిక్స్‌తో ఇలాంటి పజిల్స్‌ను సాల్వ్‌ చేయొచ్చు.

మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..