AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తలనొప్పితో కోమాలోకి వెళ్లిన మహిళ.. 6 వారాల తర్వాత స్పృహలోకి వచ్చి షాకింగ్ నిజం చెప్పింది.!

నటాలీని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆమె దాదాపు 6 వారాల పాటు కోమాలోనే ఉంది. వైద్యులు ఆశ వదులుకున్నారు. ఆమెకు లైఫ్ సపోర్ట్ మెషీన్‌ను తొలగించాల్సి రావచ్చని వైద్యులు చర్చించుకుంటున్నారు. కానీ, నటాలీ కోమాలో ఉన్నప్పుడు కూడా తన చుట్టూ ఉన్నవన్నీ విన్నానని చెబుతోంది. కుటుంబ సభ్యుల మాటలు, వారి ఏడుపు అన్ని తనకు వినిపించాయని చెప్పింది. అంతేకాదు.. తాను కోమాలో ఉండగా...

తలనొప్పితో కోమాలోకి వెళ్లిన మహిళ.. 6 వారాల తర్వాత స్పృహలోకి వచ్చి షాకింగ్ నిజం చెప్పింది.!
Natalie fisher wakes after 6 week coma
Jyothi Gadda
|

Updated on: Sep 08, 2025 | 8:35 PM

Share

UKలోని స్టాక్‌పోర్ట్‌కు చెందిన ఒక తల్లి కథ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బ్రిటన్ కు చెందిన ఈ మహిళ కథ ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది. 41 ఏళ్ల నటాలీ ఫిషర్‌కు అకస్మాత్తుగా తీవ్రమైన తలనొప్పితో ఇబ్బంది పడింది. కాసేపు విశ్రాంతి తీసుకోవడానికి మంచం మీద వాలింది. ఆ తర్వాత ఆమె స్పృహ ఎంతకీ స్పృహలోకి రాలేదు. చాలా సేపు ఆమెను నిద్రలేపే ప్రయత్రం చేసిన కుటుంబ సభ్యులు చివరకు అంబులెన్స్‌కు ఫోన్ చేశారు.. ఆమెను పరీక్షించిన వైద్యులు తనకు బ్రెయిన్ అనూరిజం ఉందని నిర్ధారించారు. బ్రెయిన్ ఆర్టరీ పగిలిపోవడం వల్ల వచ్చే స్ట్రోక్. వాస్తవానికి, బ్రెయిన్ అనూరిజం అనేది మెదడులోని ధమనులలో అసాధారణమైన ఉబ్బరం. అది పగిలినప్పుడు మెదడులో రక్తస్రావం ప్రారంభమవుతుంది. స్ట్రోక్ సంభవించవచ్చు.

ఆమె 6 వారాల పాటు కోమాలో ఉంది:

నటాలీని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆమె దాదాపు 6 వారాల పాటు కోమాలోనే ఉంది. వైద్యులు ఆశ వదులుకున్నారు. ఆమెకు లైఫ్ సపోర్ట్ మెషీన్‌ను తొలగించాల్సి రావచ్చని వైద్యులు చర్చించుకుంటున్నారు. కానీ, నటాలీ కోమాలో ఉన్నప్పుడు కూడా తన చుట్టూ ఉన్నవన్నీ విన్నానని చెబుతోంది. కుటుంబ సభ్యుల మాటలు, వారి ఏడుపు అన్ని తనకు వినిపించాయని చెప్పింది. నేను అరవాలనుకున్నాను, కానీ మాట్లాడలేకపోయాను అని చెప్పింది. తన చుట్టూ ఉన్నవాళ్లు చెప్పింది నేను ప్రయత్నిస్తున్నాను. కానీ, తన శరీరం అందుకు సహకరించడం లేదని చెప్పింది. తన కళ్ళు మూసుకున్నాయి. మాట్లాడలేకపోయాను. కానీ నేను ప్రతిదీ అనుభూతి చెందుతున్నానని చెప్పింది.. కోమాలో ఉన్నప్పుడు, నటాలీ తన దివంగత అమ్మమ్మను చూశానని చెప్పింది. ఆమె అమ్మమ్మ తన తల్లి వద్దకు తిరిగి వెళ్ళమని చెప్పిందని, ఆ తర్వాతే తాను మొదటిసారి కళ్ళు తెరిచానని చెప్పటంతో అంతా ఆశ్చర్యపోయారు.

ఇవి కూడా చదవండి

అనంతరం నటాలీని షెల్ఫోర్డ్ రాయల్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఆమె మెదడుకు శస్త్రచికిత్స చేసి, ఆమె నరాలను మెటల్ క్లిప్‌లతో సీలు చేశారు. చివరకు 14 జనవరి 2025న, దాదాపు 6 వారాల తర్వాత ఆమె స్పృహ తిరిగి వచ్చింది. వెంటిలేటర్ ట్యూబ్ కారణంగా ఆమె గొంతు దెబ్బతిన్నప్పటికీ, నటాలీ ఇప్పుడు ప్రమాదం నుండి బయటపడింది. ఇప్పుడు ఆమె ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతోందని వైద్యులు వెల్లడించారు. నా పిల్లలే నా ప్రపంచం అని చెప్పింది నటాలీ. తాను చిన్న చిన్న అడుగులు వేస్తూ నెమ్మదిగా కోలుకుంటున్నానని చెప్పింది. తాను మళ్ళీ పూర్తిగా కొలుకుని నిలబడతానని తనకు నమ్మకం ఉందని చెప్పింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..