Video: హిమాచల్ ప్రదేశ్ లో పుష్ప 3.0.. వీడియో
హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలల్ల క్లౌడ్ బరస్ట్ లచ్చి కొండచరియలు ఇర్సుకపడి ఊర్లకు ఊర్లు, ఇండ్లకు ఇండ్లే కొట్కపోవుడు, మునిగిపోవుడు నడుస్తుందిగద? ఆర్నెల్లల్లనే కొన్ని వందల మంది పానాలు పోయ్నయ్.. అదట్లవెడ్తె.. ఆ క్లౌడ్ బరస్ట్ లు, ఫ్లాష్ ఫ్లడ్సు చెయ్యవట్టి.. ఓ పెద్ద స్మగ్లింగ్ మాఫియా సంగతి బైటవడ్డది గిట్ల..
క్లౌడ్ బరస్ట్ లు, ఫ్లాష్ ఫ్లడ్లు చెయ్యవట్టి, హిమాచల్ ప్రదేశ్ల పారే చినాబ్, రావి నదులకు వర్దలొస్తుంటె.. ఆ వర్దలల్ల మొద్దులు కొట్కొస్తున్నయ్ గిట్ల.. మొత్తం గుట్టలమీద, కొండలమీదంత కొట్టి పెట్టినట్టుర్రి.. గట్టిగ వానల్ కొట్టేవరకు ఆ కొండచరియలు ఇర్సుకపడి నీళ్లతోపాటు జారకుంట నదిల కల్శొస్తున్నయట.. పోలీసోల్లు, ఫారెస్టోల్లు కనిపెట్టినా, సూశి సూడనట్టు ఊకోని శెప్పకున్నా.. స్మగ్లింగ్ మాఫియా గుట్టు ప్రక్రుతే బైటవెట్టింది గిట్ల.. మరివ్వి ఏమేం శెట్ల మొద్దులు, ఎంత ఇల్వగల్లయోగనీ.. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలల్ల అడ్వులే లేకుంట పొతం పెడ్తున్నరు స్మగ్లర్ గాళ్లు.. ఆ మాఫియా గుట్టును ప్రక్రుతే బైటవెట్టిందిగిట్ల..
వైరల్ వీడియోలు
‘బిర్యానీ క్యాపిటల్’గా టాప్లో హైదరాబాద్
బైకర్ చెంపపై కొట్టిన ట్రాఫిక్ పోలీస్.. నెటిజన్లు సీరియస్
సంక్రాంతి ముందు నాన్వెజ్ ప్రియులకు షాక్..
రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. ఆగిపోయిన వాహనాలు
కత్తులతో నడిరోడ్డుపై రచ్చ చేసిన మహిళ..
రాకుమారుల రుమాలు.. రేటు జస్ట్.. రూ.7 లక్షలే
అర్ధరాత్రి పోలీసుల ముందే బైక్ స్టంట్స్.. వీడియో వైరల్

