AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అత్యంత ప్రతిభావంతమైన యువనేతల జాబితాలో నారా లోకేశ్

విజయవాడ: ప్రపంచ అత్యంత ప్రతిభావంతమైన యువ నేతల జాబితాలో నారా లోకేశ్‌కు చోటు దక్కింది. 2019 ఏడాదికి గానూ వరల్డ్ ఎకనామిక్ ఫోరం విడుదల చేసిన జాబితాలో నారా లోకేశ్ పేరు కూడా ఉంది. మొత్తం 127 మంది ఉన్న యంగ్ గ్లోబల్ లీడర్స్ జాబితాలో నారా లోకేశ్ దక్షిణాసియా విభాగంలో ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న యువ నేతల్లో ప్రభావం చూపించిన వారిని ఈ జాబితాకు ఎంపిక చేశారు. అయితే ఈ విషయంపై లోకేశ్ స్పందించారు. […]

అత్యంత ప్రతిభావంతమైన యువనేతల జాబితాలో నారా లోకేశ్
Vijay K
|

Updated on: Mar 14, 2019 | 6:34 PM

Share

విజయవాడ: ప్రపంచ అత్యంత ప్రతిభావంతమైన యువ నేతల జాబితాలో నారా లోకేశ్‌కు చోటు దక్కింది. 2019 ఏడాదికి గానూ వరల్డ్ ఎకనామిక్ ఫోరం విడుదల చేసిన జాబితాలో నారా లోకేశ్ పేరు కూడా ఉంది. మొత్తం 127 మంది ఉన్న యంగ్ గ్లోబల్ లీడర్స్ జాబితాలో నారా లోకేశ్ దక్షిణాసియా విభాగంలో ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న యువ నేతల్లో ప్రభావం చూపించిన వారిని ఈ జాబితాకు ఎంపిక చేశారు.

అయితే ఈ విషయంపై లోకేశ్ స్పందించారు. 2019 యంగ్ గ్లోబల్ లీడర్స్‌లో తనకు కూడా చోటు దక్కడం గౌరవంగా భావిస్తున్నానని అన్నారు. తనతో పాటు చోటు దక్కించుకున్న ఇతర యువ నేతలకు శుభాకాంక్షలని ట్వీట్ చేశారు. వారందరితో పలు అంశాలపై చర్చించేందుకు ఆసక్తిగా ఉన్నట్టు లోకేశ్ చెప్పారు.

Follow Us