ఉన్నత చదువులు పూర్తి చేసుకుని ఉద్యోగంలోకి చేరాలనుకునేవారు మొదట చేసే పని రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకోవడం. తమ విద్యార్హతలు, నైపుణ్యాలను, భవిష్యత్‌లో సాధించాల్సిన లక్ష్యాలతో పాటు తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలన్నింటినీ అందులో పొందుపరుస్తారు. ప్రస్తుతం సంస్థలన్నీ రెజ్యూమ్ ఆధారంగానే ఉద్యోగ ఎంపికలు నిర్వహిస్తున్నాయి కాబట్టి రిక్రూటర్లను ఆకట్టుకునేలా రెజ్యూమ్‌లు ప్రిపేర్ చేసుకుంటున్నారు. ఈక్రమంలో అందరిలాగా సీవీ పంపితే తనను ఎవరు గుర్తిస్తారు? అనుకున్నాడేమో.. రెజ్యూమ్‌ను పంపించడంలో తన సృజనాత్మకతను చాటుకున్నాడు జైపూర్‌కి చెందిన మేనేజ్‌మెంట్ ట్రైనీ అయిన అమన్ ఖండేల్‌వాల్. జొమాటో బాయ్ గెటప్‌లో వివిధ కంపెనీలకు పంపిన అతను పంపిన రెజ్యూమ్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారింది. అంతేకాదు పెద్ద పెద్ద సంస్థలను సైతం ఆకట్టుకుంటోంది.
Dressed as a @zomato delivery boy I delivered my resume in a box of pastry.
Delivered it to a bunch of startups in Bengaluru.
Is this a @peakbengaluru moment.@zomato #resume pic.twitter.com/HOZM3TWYsE ఇవి కూడా చదవండి— Aman Khandelwal (@AmanKhandelwall) July 2, 2022
పుణేలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ డెవలప్‌మెంట్ అండ్ రీసెర్చ్ నుంచి పట్టభద్రుడైన అమన్ ఉద్యోగం కోసం రెజ్యూమ్‌ను పంపించాడు. అయితే దీని కోసం కాస్త క్రియేటివిటీగా ఆలోచించాడు. జొమాటో బాయ్ అవతారమెత్తి పేస్ట్రీ బాక్స్‌లో కేక్‌తోపాటు రెజ్యూమ్‌ను స్టార్టప్ కంపెనీలకు పంపించాడు. ‘ సాధారణంగా అన్ని రెజ్యూమ్‌లు చెత్తబుట్టల్లోకి వెళ్తాయి.. కానీ నా రెజ్యూమ్ మాత్రం మీ పొట్టలోకి వెళ్తుంది’ అంటూ తన రెజ్యూమ్‌ను ట్విట్టర్‌లో షేర్ చేశాడు. దీంతో అమన్ రెజ్యూమ్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. అతని ఐడియా నెటిజన్లతోపాటు డన్జో, జొమాటోను కూడా ఆకట్టుకుంటోంది. ఈ సందర్భంగా తమకు ఢోక్లా సప్లై చేయాలని డన్జో సరదాగా కామెంట్ చేసింది. ‘హే అమన్, మీ ఆలోచన చాలా బాగుంది, ఎగ్జిక్యూషన్ అద్భుతంగా ఉంది’ జొమాటో ప్రశంసించింది. నెటిజన్లు కూడా ‘ఇదొక క్రేజీ రెజ్యూమ్’ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..