Watch: వావ్‌..రైలు బోగీల్లో పుట్టగొడుగుల పెంపకం..! ఎలా సాధ్యమంటారా..? చూస్తే అవాక్కే..

|

Aug 21, 2024 | 7:39 PM

ఇది చూసిన తర్వాత మీరు షాక్ అవుతారు.. ఎందుకంటే మీరు ఇంతకు ముందు ఇలాంటి దృశ్యాన్ని ఎక్కడా, ఎప్పుడూ చూసి ఉండరు..! ఇది చూసిన వారంతా ఆశ్చర్యంతో ముక్కున వేలేసుకుంటున్నారు. అంతటి విచిత్రం ఏంటా అని ఆలోచిస్తున్నారు కదా.. అదేంటంటే.. మట్టిలో పెంచే పుట్టగొడుగులను.. రైల్వే శాఖ తన రైలు బోగీల్లో పెంచుతుంది.. ఏంటీ అవాక్కయ్యారా..?

Watch: వావ్‌..రైలు బోగీల్లో పుట్టగొడుగుల పెంపకం..! ఎలా సాధ్యమంటారా..? చూస్తే అవాక్కే..
Mushrooms Sprouting Inside Train Coach
Follow us on

నేటికీ మన భారతదేశంలో అత్యాధిక మంది ప్రజలు ఉపయోగించే రవాణా వ్యవస్థ రైలు మార్గం. సుదూర ప్రాంతాలకు వెళ్లాలన్నా, సుఖంగా, తక్కువ ఖర్చుతో కూడిన ప్రయాణం రైలు.. సామాన్యులకు సైతం అందుబాటు ఉండే ధరలతో భారతీయ రైల్వే వ్యవస్థ లక్షల మందిని తమ గమ్యస్థానాలకు చేర్చుతోంది. కానీ, శతాబ్ధాల చరిత్ర కలిగిన మన రైల్వే వ్యవస్థ పరిస్థితి ఇప్పుడు అధ్వాన్నంగా మారింది. రైల్వేకు సంబంధించి అనేక రకాల వీడియోలు ప్రతిరోజూ ప్రజలలో వైరల్ అవుతున్నాయి. కొన్ని రైళ్లలో వర్షం పడుతుండగా ప్రయాణికులు గొడుగులు పట్టుకున్న దృశ్యం ఇప్పటికే ఇంటర్‌నెట్‌లో వైరల్‌గా మారింది. తాజాగా మరో విచిత్రం వెలుగు చూసింది. ఈ రైల్లో కనిపించిన ఈ దృశ్యం ప్రస్తుతం జనాల్లో చర్చనీయాంశమైంది. పూర్తి వివరాల్లోకి వెళితే…

ప్రతిరోజూ సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇలాంటి వీడియోలు మనకు చాలాసార్లు వస్తుంటాయి. ఇది మన దైనందిన జీవితానికి సంబంధించినది. తాజాగా ఓ పోస్ట్ ప్రజల్లో చర్చనీయాంశమైంది. ఇండియన్ రైల్వేస్ కు సంబందించిన ఇలాంటి వీడియో ప్రజల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ఇది చూసిన తర్వాత మీరు షాక్ అవుతారు.. ఎందుకంటే మీరు ఇంతకు ముందు ఇలాంటి దృశ్యాన్ని ఎక్కడా, ఎప్పుడూ చూసి ఉండరు..! ఇది చూసిన వారంతా ఆశ్చర్యంతో ముక్కున వేలేసుకుంటున్నారు. అంతటి విచిత్రం ఏంటా అని ఆలోచిస్తున్నారు కదా.. అదేంటంటే.. మట్టిలో పెంచే పుట్టగొడుగులను.. రైల్వే శాఖ తన రైలు బోగీల్లో పెంచుతుంది.. ఏంటీ అవాక్కయ్యారా..? ఇది నిజమేనండోయ్.. ఇప్పుడు ఈ ఫోటోలు, వీడియోలు ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

ఇక్కడ చూడండి..

ఓ ప్యాసింజర్ రైలు బోగీలో పుట్టగొడుగులు పెరిగి ఉండటం గుర్తించారు ప్రయాణికులు. బోగీ పై భాగంలో ఆరు పుట్టగొడుగులు పుట్టుకొచ్చాయి.. అది చూసిన ప్రయాణికులు వెంటనే తమ సెల్‌ఫోన్లలో ఫోటో క్లిక్‌ మనిపించారు. ఇంకేం ఇన్‌స్టా, వాట్సాప్‌, ఫేస్‌బుక్‌ ఇలా అన్ని సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో షేర్‌ చేశారు. దీంతో రైలు బోగీల్లో పుట్టగొడుగులా అంటూ ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. రైళ్లల్లో పరిశుభ్రత ఎలా ఉంది అనటానికి ఇదే నిదర్శనం అంటున్నారు నెటిజన్లు.. పుట్టగొడుగులు పెరగాటానికి తేమ శాతం ఎక్కువ ఉండాలి.. అంటే రైలు బోగీల్లో తేమ ఉంటుందా.. బోగీలు క్లీన్ చేయటం లేదా.. బోగీలపైన నీళ్లు ఉంటున్నాయా అంటూ ఈ ఫొటో చూసిన నెటిజన్లు మండిపడుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..