మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలకు నవంబర్ 20న పోలింగ్ జరగనుంది. ఈలోపు రాష్ట్రవ్యాప్తంగా భారీ మొత్తంలో డబ్బు, వెండి, బంగారం, మద్యం పోలీసులకు పట్టుబడుతోంది. ఇక ఎన్నికలకు సరిగ్గా నాలుగు రోజులు ముందుగా ముంబై పోలీసులు ఓ పెద్ద అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేశారు. ఒక ట్రక్కులో 8,476 కిలోల వెండి అక్రమ రవాణా అవుతుండగా.. దాన్ని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు పోలీసులు. దీని విలువ దాదాపు 80 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. ఇంత పెద్ద మొత్తంలో వెండిని చూసి పోలీసులు సైతం అవాక్కయ్యారు.
ఇది చదవండి: మీరు పుట్టిన తేదీని బట్టి మీ వెనకున్న దేవుడెవరో చెప్పొచ్చు.! ఎలాగో తెల్సా
వాశి చెక్‌పోస్టు వద్ద వాహనాలను తనిఖీ చేస్తున్న మన్‌ఖుర్డ్ పోలీసులు.. శుక్రవారం రాత్రి అటుగా వచ్చిన ఈ భారీ ట్రక్కును ఆపారు. దాన్ని తనిఖీ చేయగా.. భారీ మొత్తంలో వెండి బయటపడింది. సుమారు అది 8,476 కిలోల వెండి కాగా.. దాని విలువ రూ. 80 కోట్లు ఉంటుందని అంచనా. విచారణ నిమిత్తం డ్రైవర్‌ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఐటీ అధికారులు, ఈసీ బృందం రంగంలోకి దిగి.. ఈ వెండికి సంబంధించిన యజమాని ఎవరన్న దానిపై ఆరా తీస్తున్నారు. ఇక ఈ వెండిని అక్రమంగా తరలిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది.
ఇది చదవండి: బాబోయ్.. అది రోడ్డు కాదు భారీ కొండచిలువ.. పట్టు జారితే పరలోకానికే
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..