AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mount Athos: వెయ్యేళ్లుగా మహిళలకు నో ఎంట్రీ.. ఆడ పురుగు కూడా రావొద్దు..! వెళితే ఏమౌతుందో తెలుసా..?

ఈ మిరుమిట్లు గొలిపే, సాంకేతికతతో నడిచే ప్రపంచంలో, శతాబ్దాల నాటి, రహస్యమైన సంప్రదాయాలను తనలో ఇముడ్చుకున్న ఒక ప్రదేశం ఉందని తెలిస్తే షాక్‌ అవుతారు. ఎందుకంటే.. ఈ ప్రాంతానికి నేటికీ మహిళల ప్రవేశంపై నిషేధం అమల్లో ఉంది. అది మరెక్కడో కాదు.. గ్రీస్‌లోని అందమైన, ఏకాంతమైన పర్వత ప్రాంతం మౌంట్ అథోస్..అయితే, ఈ నిషేధం వెనుక ఉన్న నిజం ఏమిటి? ప్రపంచ దృష్టికి దూరంగా ఈ ప్రదేశం తన రహస్యాలను ఎందుకు దాచిపెడుతోంది? కాలం స్తంభించిపోయినట్లు అనిపించే గతంలో ఎప్పుడూ చూడని, వినని ఆ సీక్రేట్స్‌ ఏంటో ఇప్పుడు చూద్దాం..

Mount Athos: వెయ్యేళ్లుగా మహిళలకు నో ఎంట్రీ.. ఆడ పురుగు కూడా రావొద్దు..! వెళితే ఏమౌతుందో తెలుసా..?
Mount Athos Women Ban
Jyothi Gadda
|

Updated on: Sep 17, 2026 | 4:11 PM

Share

ప్రపంచంలో అనేక ఆధ్యాత్మిక, పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. కానీ, గ్రీస్ దేశంలోని ఉత్తర భాగంలో ఉన్న మౌంట్ అథోస్ అనే పర్వత ద్వీపకల్పం మాత్రం అత్యంత భిన్నమైనది. ఈ ప్రాంతంలో గత వెయ్యి సంవత్సరాలకు పైగా మహిళలు అడుగుపెట్టడంపై తీవ్ర నిషేధం అమల్లో ఉంది.

ఏంటీ మౌంట్ అథోస్?:

మౌంట్ అథోస్ అనేది తూర్పు ఆర్థోడాక్స్ క్రైస్తవ వర్గానికి చెందిన అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం. గ్రీస్ దేశ భౌగోళిక సరిహద్దుల్లో ఉన్నప్పటికీ, దీనికి ప్రత్యేక స్వయంప్రతిపత్తి హోదా ఉంది. ఇక్కడ దాదాపు 20 ప్రాచీనమైన క్రైస్తవ మఠాలు ఉన్నాయి. ప్రస్తుతం ఇక్కడ సుమారు 2,000 మందికి పైగా సన్యాసులు నివసిస్తూ, ప్రపంచానికి దూరంగా తమ జీవితాన్ని ప్రార్థనలు, ఆధ్యాత్మిక సాధనలకే అంకితం చేశారు.

మహిళల ప్రవేశంపై నిషేధం ఎందుకు?:

క్రీస్తు శకం 1060 నుండి ఇక్కడ మహిళల ప్రవేశాన్ని నిషేధిస్తూ అధికారిక నియమం అమలులో ఉంది. దీని వెనుక ప్రధానంగా రెండు బలమైన కారణాలు ఉన్నాయి. సాంప్రదాయ విశ్వాసాల ప్రకారం, ఈ ప్రాంతాన్ని గార్డెన్ ఆఫ్ ది వర్జిన్ మేరీ అని పిలుస్తారు. మేరీ మాత ఒక్కరే ఈ పవిత్ర భూమికి ప్రాతినిధ్యం వహిస్తారని, మరొక మహిళకు ఇక్కడ స్థానం లేదని సన్యాసులు నమ్ముతారు.

ఇవి కూడా చదవండి

ఇక్కడ నివసించే సన్యాసులు పూర్తి బ్రహ్మచర్యాన్ని పాటిస్తారు. మహిళల రాకపోకల వల్ల వారి ఏకాగ్రత, ఆధ్యాత్మిక సాధన దెబ్బతినకుండా ఉండేందుకే ఈ నియమాన్ని తీసుకొచ్చారు. ఎంతలా అంటే, చివరికి పిల్లులు, కోళ్లు తప్ప ఇతర ఆడ పెంపుడు జంతువులను కూడా ఈ ద్వీపకల్పంలోకి అనుమతించకపోవడం గమనార్హం!

నిబంధనలు అతిక్రమిస్తే కఠిన శిక్షలు:

ఈ నిబంధనను ఉల్లంఘించి ఎవరైనా మహిళలు లోపలికి ప్రవేశించడానికి ప్రయత్నిస్తే 1 నుండి 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంటుంది. యునెస్కో ఈ ప్రాంతాన్ని ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించినప్పటికీ, ఇక్కడి మతపరమైన ఆచారాల ఆధారంగా ఈ ప్రత్యేక చట్టం కొనసాగుతోంది.

పర్యాటకులకు ప్రవేశం ఎలా?:

ఇక్కడికి ప్రతిరోజూ కేవలం 100 మంది ఆర్థోడాక్స్ ప్రయాణికులకు, 10 మంది ఆర్థోడాక్స్ యేతర పురుష పర్యాటకులకు మాత్రమే ప్రత్యేక పర్మిట్ ద్వారా ప్రవేశం కల్పిస్తారు. మహిళలు మాత్రం కేవలం తీరప్రాంతం నుండి పడవల ద్వారా దాదాపు 500 మీటర్ల దూరంలో ఉండి మాత్రమే ఈ అందమైన మఠాలను వీక్షించడానికి అనుమతి ఉంటుంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us