AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అందాల జలపాతంలో అలజడి.. చంటిబిడ్డతో ఉన్న వ్యక్తిపై ఎగిరొచ్చి పడ్డ భారీ పాము..

ప్రకృతి అందాలను తిలకిస్తూ, జలపాతం నీటిలో హాయిగా గడుపుదామని వచ్చిన పర్యాటకులకు ఊహించని షాక్ తగిలింది. జలపాతం వద్ద పర్యాటకులను తీవ్ర భయాందోళనకు గురిచేసే భయంకరమైన సంఘటన అది. ఒక వ్యక్తి తన చిన్నారిని గుండెలకు హత్తుకుని జలపాతం కింద నీటిలో నిలబడి ఉండగా, పైనున్న కొండరాళ్ల నుంచి ఒక భారీ పాము అకస్మాత్తుగా వచ్చి అతని భుజంపై పడింది. ఆ తర్వాత ఏం జరిగింది..? పూర్తి వివరాల్లోకి వెళితే..

అందాల జలపాతంలో అలజడి.. చంటిబిడ్డతో ఉన్న వ్యక్తిపై ఎగిరొచ్చి పడ్డ భారీ పాము..
Huge Snake Falls On Man
Jyothi Gadda
|

Updated on: Sep 17, 2026 | 3:12 PM

Share

ప్రకృతి అందాలను తిలకిస్తూ, జలపాతం నీటిలో హాయిగా గడుపుదామని వచ్చిన పర్యాటకులకు ఊహించని షాక్ తగిలింది. మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లాలో ఉన్న అత్యంత ప్రసిద్ధ అంబోలీ జలపాతం వద్ద అత్యంత ప్రమాదకరమైన సంఘటన ఒకటి చోటుచేసుకుంది. తన చిన్నారిని ఎత్తుకుని నీటిలో ఆడుకుంటున్న ఒక వ్యక్తిపై పైనుంచి ఉన్నట్టుండి ఒక భారీ పాము పడటంతో అక్కడున్న వారంతా భయాందోళనతో కేకలు వేశారు. అసలేం జరిగింది?

వర్షాకాలం కావడంతో అంబోలీ జలపాతాన్ని వీక్షించేందుకు పర్యాటకులు భారీగా తరలివచ్చారు. ఒక కుటుంబం జలపాతం కింద నీటిలో సేదతీరుతోంది. అందులో ఒక వ్యక్తి తన చిన్నారిని రక్షణగా గుండెలకు హత్తుకుని జలపాతం నీటి ప్రవాహం కింద నిలబడి ఉన్నాడు. సరిగ్గా అదే సమయంలో, ఎత్తైన కొండరాళ్ల పైభాగం నుండి ఒక పెద్ద పాము నేరుగా వచ్చి ఆ వ్యక్తి భుజంపై పడింది.

ఇవి కూడా చదవండి

ఒక్కసారిగా శరీరానికి ఏదో తగలడంతో ఆ వ్యక్తి దిగ్భ్రాంతికి గురయ్యాడు. అయితే అదృష్టవశాత్తూ ఆ పాము అతడిని గానీ, చిన్నారిని గానీ ఎలాంటి హానీ చేయలేదు. పడిన మరుక్షణమే అది భుజంపై నుంచి జారి కింద ఉన్న రాళ్ల మధ్యలోకి వెళ్లి, నీటి ప్రవాహంలో కొట్టుకుపోయింది. ఈ దృశ్యాన్ని అక్కడే ఉన్న మరొక పర్యాటకుడు వీడియో తీయగా, అది నెట్టింట తీవ్ర కలకలం రేపుతోంది.

పాము పడిన వెంటనే జలపాతం వద్ద ఉన్న పర్యాటకులు తీవ్ర భయాందోళనకు గురై అటూ ఇటూ పరుగులు తీశారు. వీడియోలో కొందరు పర్యాటకులు అది పెద్ద కోబ్రా అని అరిచినట్లు వినిపిస్తోంది. అయితే ఆ పాము ఏ జాతికి చెందిందనేది అధికారికంగా నిర్ధారణ కాలేదు. ఏది ఏమైనా, క్షణాల వ్యవధిలో తండ్రీబిడ్డలిద్దరూ ఎటువంటి గాయాలు లేకుండా ప్రాణాపాయం నుండి బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

వీడియో ఇక్కడ చూడండి..

వర్షాకాలంలో అడవులు, కొండ ప్రాంతాలు, జలపాతాల వద్దకు వెళ్లేటప్పుడు పర్యాటకులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని వన్యప్రాణి నిపుణులు సూచిస్తున్నారు. వర్షాల కారణంగా పాములు, ఇతర సరీసృపాలు తమ పుట్టలు, గూళ్లు మునిగిపోవడంతో పొడి ప్రదేశాల కోసం చెట్లు, కొండరాళ్ల దారుల్లోకి వస్తుంటాయి. జలపాతాల వద్ద తడి రాళ్ల సందుల్లో ఇవి దాక్కునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, ప్రవాహాల కింద నిలబడేటప్పుడు, పొదలు లేదా రాళ్లను తాకేటప్పుడు జాగ్రత్త వహించాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us