Viral Video: దోమ గుడ్డు పెట్టడం ఎప్పుడైనా చూశారా?.. అయితే, ఈ షాకింగ్ వీడియో చూసేయండి..

|

Oct 08, 2021 | 1:33 PM

Viral Video: ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో ప్రపంచమే ఒక కుగ్రామంలా మారింది. ఏ మూలన ఏం జరిగినా ఇట్టే తెలిసిపోయే పరిస్థితి ఉంది.

Viral Video: దోమ గుడ్డు పెట్టడం ఎప్పుడైనా చూశారా?.. అయితే, ఈ షాకింగ్ వీడియో చూసేయండి..
Mosquito
Follow us on

Viral Video: ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో ప్రపంచమే ఒక కుగ్రామంలా మారింది. ఏ మూలన ఏం జరిగినా ఇట్టే తెలిసిపోయే పరిస్థితి ఉంది. ఇక సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక వార్త, వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. వాటిలో చాలా వరకు ఫన్నీ వీడియోలు ఉంటాయి. ఇక ప్రాంక్‌లు, జంతువులకు సంబంధించిన ఫన్నీ వీడియో, భయానకమైవి, ఆశ్చర్యాన్ని కలిగించేవి, విజ్ఞానాన్ని పెంపొందించేవి కూడా ఉంటాయి. తాజాగా సోషల్ మీడియాలో దోమకు సంబంధించిన ఆసక్తికరమైన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఆ వీడియోలో దోమ గుడ్లు పెట్టడం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ వీడియోను చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.

దోమలంటేనే చిరాకు వస్తుంది. అవి చేసే శబ్ధానికి రాత్రి నిద్రపోని వారు ఎందరో ఉంటారు. ముఖ్యంగా దోమ కాటు వలన అనేక వ్యాధులకు సంక్రమించే ప్రమాదం ఉంది. అందుకే దోమల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటారు. అయితే దోమల నివారణలో ప్రధాన అస్త్రం.. వాటి గుడ్లను ధ్వంసం చేయడమే. దోమ గుడ్లను ధ్వంసం చేయడం ద్వారా వాటిని నియంత్రించవచ్చు. ముఖ్యంగా దోమ గొడ్లను తినే చేపలు కూడా ఉన్నాయి. అందుకే దోమలకు నివాసాలైన మురుగు కుంటల్లో, నీటి ప్రాంతాల్లో దొమ గుడ్లను నాశనం చేయడానికి ఆ చేప పిల్లలను వేస్తుంటారు.

అయితే, దోమల సంతానోత్పత్తి గుడ్ల ద్వారానే జరుగుతుంది. మరి దోమ గుడ్లు పెట్టడం ఎప్పుడైనా చూశారా? అయితే, ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియోలో దోమ ఎలా గుడ్లు పెడుతుందో చాలా స్పష్టంగా చూడొచ్చు. ఓ ఆడ దోమ ఒకేసారి 200 నుంచి 500 గుడ్లు పెట్టింది. ఆ గుడ్లన్నింటినీ ఒక వరుస క్రమంలో నిటారుగా నిలబడేలా పెట్టడం ఇక్కడ ఆశ్చర్యకరం. గుడ్లు దెబ్బతినకుండా, దోమ పిల్లలు సరైన సమయంలో బయటకు వచ్చేలా గుడ్లను ఏర్పాటు చేసింది దోమ.

ఇక ఇప్పుడు దోమ జీవితానికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకుందాం. వాస్తవానికి ఒక ఆడ దోమ జీవితం కాలం 40-50 రోజులు. అదే మగ దోమ జీవిత కాలం 10 రోజులు మాత్రమే. ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే.. ఆడ దోమ తన జీవితంలో ఒక్కసారి మాత్రమే లైంగిక సంపర్కం జరుపుతుంది. ఆ ఒక్కసారికే 200 నుంచి 500 గుడ్లు పెడుతుంది.

Viral Video:

Also read:

Micro-chip Fraud: అంతా మాయ.. వాహనదారులు చూసేదంతా మాయ.. పెట్రోల్ బంకుల్లో ‘మైక్రో చిప్‌’ మోసం.. కోట్లల్లో..

SBI Customers: ఎస్‌బీఐ కస్టమర్లకు గుడ్‌న్యూస్‌.. యోనో యాప్‌ ద్వారా ఉచితంగానే ఆ సేవలు..!

Telangana Cm Kcr: ఫసల్ బీమా పథకంపై సంచలన కామెంట్స్ చేసిన సీఎం కేసీఆర్..