జంతు ప్రపంచంలో అత్యంత ఆకర్షణీయమైన జీవులలో కోతులకు ప్రముఖ స్థానం ఉంది. ఎందుకంటే కోతుల నుంచే మనుషులు పుట్టారంటారు. అది నిజమో కాదో పక్కనపెడితే.. కోతులు, మనుషులు చేసే పనుల్లో చాలా పోలికలు కనిపిస్తుంటాయి. తాజాగా నెట్టింట వైరల్ అవుతున్న ఒక వీడియో ఇదే విషయాన్ని ఎత్తిచూపుతోంది. మనుషులతో చాలా పోలికలు ఉన్న కోతి కూడా దేవుడి పట్ల భక్తిని చాటుకుంటోంది. రామభక్తుడిగా మారిన హనుమంతుడికి ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది భక్తులున్నారు. అయోధ్య అంటే రామజన్మభూమిగా ప్రసిద్ధి. రాముడితో పాటు భక్తులకు ఆంజనేయుడు కూడా గుర్తుకువస్తాడు. రామునిపై అపరిమితమైన భక్తి ఉన్నవాడు హనుమంతుడు. భక్తికి నిర్వచనం హనుమంతుడు.. ప్రస్తుతం అయోధ్యలో ఓ ఆశ్చర్యకరమైన సంఘటన చోటు చేసుకుంది.
పవిత్ర నగరమైన అయోధ్యలోని ఒక ఆలయంలో ఎవరూ లేని సమయంలో ఒక కోతి వచ్చి పూజలు చేయడం సర్వత్ర విస్తు పోయేలా చేస్తుంది. గుడిలో ఎవరూ లేని సమయంలో ఆ కోతి ప్రతిరోజూ ఈ గుడికి వెళ్తుంది. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. అయితే, ఈ వీడియో పాతదని అంటున్నారు.. అయినప్పటికీ నెట్టింట మరోమారు దూసుకుపోతోంది. నెటిజన్ల హృదయాలను కొల్లగొడుతోంది.
సాత్విక్ సోల్ అనే ట్విట్టర్ యూజర్ ఈ వీడియోను షేర్ చేశారు. వైరల్ వీడియోలో ఒక కోతి కొండపైన ఉన్న గుడికి వెళ్లి దేవుడికి మొక్కడం కనిపిస్తుంది. వీడియోను ఇప్పటివరకూ 3 లక్షల మందికి పైగా వీక్షించారు. ప్రతిరోజూ రాత్రి సమయంలో కోతి ఆలయాన్ని సందర్శిస్తోందని వీడియోను షేర్ చేసిన యూజర్ రాసుకొచ్చారు. ఈ వీడియో అయోధ్యకు చెందినదని చెప్పారు.
This happens in Ayodhya every night when nobody is around pic.twitter.com/mTczR3Xx6S
— Satviksoul ??I stand with Modiji (@satviksoul) March 14, 2023
మెట్లు ఎక్కి కోతి రోజూ ఆలయానికి వెళ్లి దేవుడి ఆశీస్సులు పొందుతున్న వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఈ వీడియోకు ఇంటర్‌నెట్ ఫిదా అయింది. పెద్దసంఖ్యలో నెటిజన్లు ఈ వైరల్ వీడియోపై స్పందిస్తున్నారు. వానరం భక్తిని పలువురు నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..