వార్నీ.. కోతి షెకలు అంటే ఇవే..! ఈ వానరం చేసిన పనికి దేశం మొత్తం చీకటి
కోతి చేష్టలతో ఇప్పటికే ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న వార్తలు మనం అనేకం చూస్తూనే ఉంటాం.. కొన్ని సార్లు వానర చేష్టలు మనల్ని నవ్వించడమే కాకుండా, కొన్నిసార్లు మనల్ని ఇబ్బందుల్లోకి నెట్టివేస్తాయి. ఈసారి, ఒక కోతి చేసిన పనికి ఏకంగా ఓ దేశం దేశమే కరెంటు లేకుండా పోయింది. ఒక్క కోతి చేసిన పని వల్ల ఆ దేశం మొత్తం అంధకారంలో మునిగిపోయింది. దాంతో ఆ దేశప్రజలు తిండి, నీళ్లు, ఆస్పత్రి వసతులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వచ్చింది. ప్రస్తుతం ఈ వార్త ప్రపంచవ్యాప్తంగా వైరల్‌గా మారింది. ఇంతకీ అది ఏ దేశం.. ఆ కోతి ఏం చేసిందో పూర్తి వివరాల్లోకి వెళితే...

రామాయణంలో హనుమంతుడు రావణుడి లంక మొత్తాన్ని అగ్నితో కాల్చినట్లుగా, ఇప్పుడు కలియుగంలో ఓ కోతి శ్రీలంకను ఒక రోజంతా చీకట్లో ఉంచింది..అవును మీరు చదివింది నిజమే.. నిజంగానే ఒక కోతి కారణంగా శ్రీలంక అంతటా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. శ్రీలంక విద్యుత్ గ్రిడ్ సబ్‌స్టేషన్‌లోకి ఉదయం 11.30 గంటల ప్రాంతంలో ఒక కోతి చొరబడింది. అది చేసిన పనితో దేశవ్యాప్తంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఆ తర్వాత, కోతి కొన్ని గంటలపాటు ఆ కోతి లోపలే ఉండిపోవడంతో..విద్యుత్ సరఫరా పూర్తిగా పునరుద్ధరించబడలేదు.
ఈ సంఘటన కొలంబో శివారు ప్రాంతంలో జరిగింది. కానీ, శ్రీలంకలో విద్యుత్తు అంతరాయం ఏర్పడటానికి గల ఖచ్చితమైన కారణాన్ని CEB వెల్లడించలేదు. ఒక రోజంతా దేశం మొత్తంలో కరెంట్ లేకపోవడంతో అనేకమంది జనరేటర్లపై ఆధారపడాల్సి వచ్చింది. ఈ వ్యవహారాన్ని అధికారులు తేలిగ్గా తీసుకోవడంపై ప్రజలు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ వేదికగా ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Monkey
శ్రీలంక టైమ్ ప్రకారం ఉదయం 11:30 గంటలకు మొత్తం గ్రిడ్ విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని తెలిసింది. చాలా గంటల తర్వాత విద్యుత్ సరఫరా పునరుద్ధరించబడిందని అధికారి తెలిపారు. పాణదుర ప్రాంతంలోని విద్యుత్ గ్రిడ్ సబ్‌స్టేషన్‌ను ఒక కోతి తాకడంతో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడినట్టుగా ఆ దేశ విద్యుత్ శాఖ మంత్రి కుమార జయకోడి మీడియాకు వివరించారు.. దీంతో ఈ వార్త ఆ దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా వైరల్‌గా మారింది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..




