Viral: పెళ్లి వేడుకలో అతిథులు పరుగో పరుగు.. అలాంటి గెస్ట్ వస్తారని ఎవరూ ఊహించలే..!
వారి పెళ్లి గ్రాండ్‌గా జరుగుతుంది. బంధుమిత్రుల రాకతో.. ఆ ప్రాంతంగా సందడిగా మారింది. ఫోటోగ్రాఫర్లు, వీడియో గ్రాఫర్లు వేడుకకు వచ్చిన అందర్నీ కవర్ చేస్తున్నారు. అయితే ఈ సమయంలో గేటు బద్దలు కొడుతూ ఓ అనుకోని అతిథి అక్కడికి ఎంట్రీ ఇచ్చింది. దాన్ని చూసి వధూవరులతో సహా అందరూ పరుగు లఖించుకున్నారు...

బుధవారం రాత్రి ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో జరిగిన ఒక వివాహ వేడుకకు ఒక ఊహించని అతిథి ఎంట్రీ ఇచ్చింది. దాని ఎంట్రీతో అక్కడి వాళ్లు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. అక్షయ్ శ్రీవాస్తవ, జ్యోతి కుమారిల వివాహ వేడుకలోకి ఓ చిరుతపులి ఏకంగా గేటును బద్దలుకొట్టి మరీ ప్రవేశించిది. దీంతో ప్రాణ భయంతో అతిథులు పరుగులు తీశారు. ఈ సంఘటన బుధవారం రాత్రి 11 గంటలకు నగరంలోని ఎంఎం లాన్‌లో జరిగింది. ఆనందోత్సవాలతో అప్పటివరకు సాగిన ఆ వేడుక ఒక్కసారిగా పీడ కలగా మారిపోయింది. అతిథులు అంతా అరుస్తూ రోడ్డుపైకి పరుగులు తీశారు. ఒక వ్యక్తి.. భయంతో మొదటి అంతస్థు నుంచి కిందకి దూకడంతో గాయాలు అయ్యాయి. వధూవరులు పారిపోయి కారులోకి వెళ్లి లాక్ చేసుకున్నారు.
సమాచారం అందుకున్న వెంటనే అటవీ శాఖ అధికారులు, పోలీసులు స్పాట్‌కు చేరుకున్నారు. దాదాపు ఐదు గంటల పాటు దానిని రెస్క్యూ చేసే యత్నం చేశారు. ఈ క్రమంలో.. చిరుత రెండుసార్లు అటవీ సిబ్బందిపై దాడికి యత్నించింది. దాని దాడిలో అటవీ శాఖ అధికారి ముకద్దర్ అలీకి గాయాలయ్యాయి. ఆయన ఎడమ చేయి రక్తంతో తడిసి ఉన్నట్లు వీడియోలో కనిపించింది. తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో చిరుతను పట్టుకునే వరకు ఆపరేషన్ కొనసాగింది. వివాహ వేదిక నుండి తప్పించుకోవడానికి జరిగిన పెనుగులాటలో ఇద్దరు వీడియో గ్రాఫర్లు కూడా కిందపడి గాయపడినట్లు తెలిసింది. ఊహించని ఘటన తర్వాత, వివాహ ఆచారాలు గురువారం రోజు ఉదయం తిరిగి ప్రారంభమయ్యాయి.
लखनऊ में एक शादी में तेंदुआ घुस आया… पुलिस वालों ने पकड़ने की कोशिश किया तो राइफल लेकर भाग गया…. इसमें सबसे मेहनत का काम कैमरामैन कर रहा है pic.twitter.com/a6RCi1HOyD
— Mohammad Imran (@ImranTG1) February 12, 2025
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..
