Viral Video: నువ్వు సింహానివైతే నాకేంటి.. మృగరాజుకు ముచ్చెమటలు పట్టించిన ముంగీస
సింహాలు కూడా భయపడే సందర్భాలు ఉంటాయి. చిన్న చిన్న జంతువులు కూడా సింహాలకు చుక్కలు చూపిస్తూ ఉంటాయి. తాజాగా అలంటి వీడియోనే ఇప్పుడు వైరల్ అవుతోంది.

సింహాన్ని చూస్తే ఎవ్వరైనా.. ఎంత పెద్ద జంతువైనా భయపడతాయి.అడవికి రాజుగా పేరొందిన సింహం ఎలాంటి జంతువునైనా వేటాడి తింటుంది. అయితే సింహాలు కూడా భయపడే సందర్భాలు ఉంటాయి. చిన్న చిన్న జంతువులు కూడా సింహాలకు చుక్కలు చూపిస్తూ ఉంటాయి. తాజాగా అలంటి వీడియోనే ఇప్పుడు వైరల్ అవుతోంది. సింహం ఒక చిన్న ముంగీసని చూసి భయపడితే, ఆ వీడియో వైరల్ కాకుండా ఉంటుందా..? ముంగీస ముందు సింహం వెనక్కి తగ్గాల్సి వచ్చింది ఈ వీడియోలో.. ఇక్కడ ముంగీస సింహాన్ని ధైర్యం చేసి నేరుగా తరిమేసింది.
ఆఫ్రికన్ యానిమల్స్ ట్విట్టర్ పేజీలో పంచుకున్న వీడియోలో, ముంగీస రెండు సింహాల మధ్య నిలబడి ఉంది. సింహం తనపై దాడికి వస్తోందని భావించి ముంగీస తిరిగి ఆ సింహంపై దాడి చేసింది. దీంతో ముంగీస దాడి నుంచి తప్పించుకునేందుకు సింహం వెనక్కి వెళ్లింది. దాడికి వచ్చిన ప్రతిసారీ సింహం గర్జించినా ముంగీస ఏమాత్రం భయపడలేదు.
ఆఫ్రికన్ యానిమల్స్ ట్విట్టర్ పేజీలో షేర్ చేసిన ఈ వీడియో 70,000 కంటే ఎక్కువ వ్యూస్ వచ్చాయి. చాలా మంది ఈ వీడియోని బాగా ఎంజాయ్ చేశారు. మన ముందు ఎంత పెద్ద శత్రువు అయినా సరే.. మన ధైర్యాన్ని పూర్తిగా వ్యక్తపరిచినప్పుడు అది ప్రత్యర్థిని వణికిస్తుందని నిరూపిస్తుందని పలువురు వీడియో కి కామెంట్ చేస్తున్నారు.
— African animals (@AfricanimaIs) July 22, 2021
