Viral Video: ఇదొక హఠాత్పరిణామం.. ఎవ్వరూ ఊహించనిది.. క్లాస్‌లో అమ్మాయికి ప్రొపోజ్ చేసిన బాలుడు కట్ చేస్తే..
అలాంటి వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సోషల్ మీడియాలో అబ్బాయిలు అమ్మాయిలకు ప్రపోజ్ చేసుకునే వీడియోలు చాలానే ఉన్నాయి.
సోషల్ మీడియాలో ఎప్పుడు ఏది వైరల్ అవుతుందో చెప్పలేం. ఇక్కడ అత్యధికంగా వ్యూస్ లైక్స్ తెచ్చుకున్న వీడియోలు నిత్యం వైరల్ అవుతూ ఉంటాయి. అలాంటి వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సోషల్ మీడియాలో అబ్బాయిలు అమ్మాయిలకు ప్రపోజ్ చేసుకునే వీడియోలు చాలానే ఉన్నాయి. స్కూల్ విద్యార్థుల మధ్య వైరల్ అవుతున్న ప్రపోజల్ వీడియోలు కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియో కూడా క్లాస్ రూంలో జరిగేదే.
ఓ బాలిక తరగతి గదిలో తన స్నేహితులతో మాట్లాడుతూ ఉంది. ఆ సమయంలో అదే తరగతికి చెందిన ఒక అబ్బాయి అమ్మాయికి పువ్వుతో ప్రపోజ్ చేచేయబోయాడు. అప్పుడే సీన్ రివర్స్ అయ్యింది.
వీడియోలో, అమ్మాయి పువ్వుతో వచ్చిన అబ్బాయిని కొట్టడం చూడవచ్చు. ఇది ఊహించని ఘటనగా మారింది. బాలిక ఒక్కసారిగా కొట్టడంతో అక్కడి వారంతా నవ్వేశారు. ఈ వీడియో వివిధ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. చాలా మంది దీనిపై కామెంట్స్ చేస్తున్నారు. remixkiduniya.08 అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా వీడియోను షేర్ చేశారు. అయితే ఈ వీడియో ఎప్పుడు, ఎక్కడ చిత్రీకరించారనేది తెలియరాలేదు. రెండు లక్షల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేశారు. ఇది ఓల్డ్ వీడియోనే అయినా మరో సారి వైరల్ అవుతోంది.
View this post on Instagram