Relationship Tips: శృంగారంలో ఇలాంటి తప్పులు చేస్తే.. మహిళలకు అస్సలు నచ్చదట!

భార్యభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకోవడమే అన్యోన్య దాంపత్యమని అంటారు. ఇద్దరు తమ రిలేషన్‏షిప్‏లో సంతోషంగా ఉండాలంటే..

Relationship Tips: శృంగారంలో ఇలాంటి తప్పులు చేస్తే.. మహిళలకు అస్సలు నచ్చదట!
Relationship Tips

Updated on: Aug 12, 2022 | 12:45 PM

శృంగారం అనేది ఓ లైంగిక చర్య మాత్రమే కాదు.. భార్యభర్తల వివాహ బంధం బలంగా ఉండాలంటే ఇరువురు ఒకరినొకరు అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. అప్పుడే వారి సాధారణ, రొమాంటిక్ లైఫ్ రెండూ సాఫీగా ఉంటాయి. భార్యభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకోవడమే అన్యోన్య దాంపత్యమని అంటారు. ఇద్దరు తమ రిలేషన్‏షిప్‏లో సంతోషంగా ఉండాలంటే.. ఒకరి గురించి మరొకరు పూర్తిగా తెలుసుకోవాలి. అంతేకాకుండా వారి మానసిక స్థితిపై కూడా పూర్తి అవగాహన కలిగి ఉండాలి.

సెక్స్‌ విషయంలో ప్రతీ ఒక్కరికి భిన్నమైన ఆలోచనలు ఉంటాయి. అయితే ఇక్కడే ఒక మెలిక ఉంది మాస్టారూ.. శృంగారంలో ఎవరి అంచనాలు వారిదే. లైంగిక కోరికలు కూడా పూర్తిగా వేర్వేరు ఉంటాయి. తమ భాగస్వాములు వాటిని కచ్చితంగా రీచ్ కావాలని కోరుకుంటుంటారు. అందువల్ల రొమాన్స్ విషయంలో ఎప్పుడూ రొటీన్‌గా ఉండకండి. ఎప్పటికప్పుడు విభిన్నంగా ప్రయత్నించాలని.. అప్పుడే మీ పార్టనర్‌కు ఆ విషయంలో ఇంట్రెస్ట్ ఉంటుందని వైద్య నిపుణులు అంటున్నారు.

అలాగే మగవారు రొమాన్స్ విషయంలో ఎప్పుడూ తొందరపడకూడదు. మహిళలు నెమ్మదిగానే ఇష్టపడతారు. ఇది కచ్చితంగా పురుషులు గమనించాలి. అలాగే మగవారు స్కలనం చేసినప్పటికీ.. తమ భాగస్వామిని పట్టించుకోవడం, ప్రేమగా హత్తుకోవడం చేస్తేనే.. మహిళలు సంతృప్తిగా ఫీల్ అవుతారు. ఇలా ఒకరి గురించి మరొకరు అలోచించి రొమాన్స్ ఎంజాయ్ చేయాలని వైద్య నిపుణులు అంటున్నారు.