వింత చరిత్రకు ప్రసిద్ధి చెందిన అనేక ప్రదేశాలు ప్రపంచంలో ఉన్నాయి. భారతదేశంలోనే అలాంటి ప్రదేశాలు రహస్య ఆలయాల గురించి తరచుగా వింటూనే ఉన్నాం.. అయితే ఈ రోజు ఓ వింత దేవాలయం గురించి చెప్పబోతున్నాం.. దీని గురించి తెలిస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఈ ఆలయాన్ని విడాకుల ఆలయంగా పిలుస్తారు. ఈ వింత ఆలయం జపాన్‌లో ఉంది.
జపాన్‌లో ఉన్న ఈ దేవాలయం పేరు మత్సుగోకా టోకీ-జీ. దాదాపు 600 ఏళ్ల క్రితం నిర్మించబడిన ఆలయం ఇది. వాస్తవానికి 12వ, 13వ శతాబ్దాల్లో జపనీస్ సమాజంలో విడాకుల నిబంధనలు పురుషుల కోసం మాత్రమే అమలు చేయబడేవి. ఆ కాలంలో పురుషులు తమ భార్యలకు చాలా సులభంగా విడాకులు ఇచ్చేవారు. ఈ నేపథ్యంలో గృహ హింస లేదా వేధింపులకు గురైన మహిళల కోసం ఈ ఆలయ తలుపులు తెరవబడ్డాయి.
విడాకుల ఆలయం ఖచ్చితంగా కొంచెం వింతగా అనిపిస్తుంది. ఈ ఆలయ నిర్మాణం వెనుక కూడా ఒక కథ ఉంది. ఈ ఆలయ చరిత్ర సుమారు 600 సంవత్సరాల నాటిది. ఈ ఆలయం జపాన్‌లోని కమకురా నగరంలో ఉంది. ఈ దేవాలయం గృహ హింసకు గురైన మహిళలకు న్యాయం చేసే నిలయంగా పరిగణించబడుతుంది. శతాబ్దాల క్రితం స్త్రీలు తమ నిరంకుశ భర్తలను వదిలించుకోవడానికి ఈ ఆలయాన్ని ఆశ్రయించేవారని చెబుతారు.
జపాన్‌లోని కామకురా యుగంలో భర్తలు ఎటువంటి కారణం చెప్పకుండా తమ వివాహాన్ని విచ్ఛిన్నం చేసుకునేవారు. భార్యకు విడాకులు ఇచ్చేవారు. ఇలా విడాకుల కోసం కేవలం మూడున్నర లైన్ల నోటీసు రాయాల్సి వచ్చేది అంతే. అయితే అప్పుడు స్త్రీలకు న్యాయం కావాలని ఈ ఆలయాన్ని కకుసన్-ని అనే సన్యాసి తన భర్త హోజో టోకిమున్ జ్ఞాపకార్థం నిర్మించారట. ఆమె తన భర్తతో ఎప్పుడూ సంతోషంగా జీవించలేడు. అయితే భర్త నచ్చలేదని ఆమెకు విడాకులు తీసుకునే మార్గం లేదు. దీంతో ఈ ఆలయాన్ని నిర్మించింది. స్థానికులు చెప్పిన ప్రకారం ఈ ఆలయంలో సుమారు మూడు సంవత్సరాలు ఉన్న తర్వాత మహిళలు తమ భర్తలతో సంబంధాలు తెంచుకోవచ్చు. కాలక్రమంలో ఈ గడువుని రెండేళ్లకు తగ్గించారు.
1902 సంవత్సరం వరకు ఆలయంలో పురుషుల ప్రవేశాన్ని నిషేధించారు. అయితే 1902లో ఈ ఆలయ సంరక్షణను ఎంగాకు-జీ స్వీకరించినప్పుడు.. ఆలయ నిర్వహణకు మగ మఠాధిపతిని నియమించాడు.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..