Viral: ఇవేం వింత కోరికలు నాయనా.! వైరలవుతున్న మ్యాట్రిమోని యాడ్.. దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు

పుర్రెకో బుద్ది.. జిహ్వాకో రుచి అని పెద్దలు అంటుంటారు. ఈ సామెత ఊరికనే చెప్పలేదు. మారుతున్న కాలానికి తగ్గట్టుగా...

Viral: ఇవేం వింత కోరికలు నాయనా.! వైరలవుతున్న మ్యాట్రిమోని యాడ్.. దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు
Matrimonal Ad
Follow us
Ravi Kiran

| Edited By: Anil kumar poka

Updated on: Nov 27, 2021 | 12:22 PM

పుర్రెకో బుద్ది.. జిహ్వాకో రుచి అని పెద్దలు అంటుంటారు. ఈ సామెత ఊరికనే చెప్పలేదు. మారుతున్న కాలానికి తగ్గట్టుగా ప్రజల్లో కూడా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అవి ఊహాకు అందట్లేదు. నాడు చాలావరకు పెళ్లిళ్లను పెద్దలు కుదిరిస్తే.. ఇప్పుడు కొంతమంది మూడు ముళ్ల బంధంలోకి అడుగు పెట్టేందుకు మాట్రీమోనియల్ సైట్ల సాయం తీసుకుంటారు. తమ వ్యక్తిగత, కుటుంబ వివరాలను పొందుపరిస్తూ.. వారి ప్రొఫైల్‌ను అప్‌లోడ్ చేస్తున్నారు. సాధారణంగా అబ్బాయిలు.. తమ జీవిత భాగస్వామి విషయంలో రంగు ఇలా ఉండాలి.. ఎత్తు తనకు తగ్గట్టుగా ఉండాలి.. కొంచెం కలర్ ఉండాలి అనే కోరికలు కోరుతారు. వీటిపై వెనక్కి తగ్గరు. అయితే ఇక్కడ ఈ వ్యక్తి ఏకంగా తనకు కాబోయే భార్య కొలతలు తనకు నచ్చిన విధంగా ఉండాలంటూ అతడు ప్రొఫైల్‌లో పేర్కొన్నాడు. ఇవే కాకుండా పలు విచిత్రమైన కోరికలను కూడా వివరించాడు. వాటిని చూసిన తర్వాత మీకు కూడా ఖచ్చితంగా ఫ్యూజులు ఎగిరిపోతాయి.

Capture

కాగా, ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్ పెడుతున్నారు. ‘ఇవేం కోరికలు నాయనా’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘ఇతడు ఏమైనా లేడీస్ టైలరా.? ఏంటి.?’ అని ఒకరి కామెంట్ చేయగా.. ‘ ‘ఆ వ్యక్తికి ఓ బార్బీ డాల్ సెట్ కొని ఇవ్వండి’ అని ఇంకొకరు కామెంట్ చేశారు. ‘ఇలాంటివి కూడా అడుగుతున్నావ్ ఏంటి బాబూ’ అని మరొకరు విమర్శించారు. ఇక ఓ ట్విట్టర్ యూజర్.. ఈ ట్వీట్‌పై సదరు మ్యాట్రిమోనియల్ సంస్థను ట్యాగ్ చేసి కంప్లైంట్ ఇవ్వగా.. అతనిపై చర్యలు తీసుకున్నామని ఆ సంస్థ పేర్కొంది.

Read Also: బిందె పట్టుకుని ఫోటోకి పోజిస్తోన్న ఈ చిన్నారి ఇప్పుడు కుర్రాళ్ల మతులు పోగొడుతోంది.. ఎవరో కనిపెట్టండి!

కొండచిలువతో క్రేజీ ఆటలు.. గుడ్లను పట్టుకోబోయిన వ్యక్తిని ఏం చేసిందో చూస్తే షాకవుతారు!

ఈ 6 రాశులవారికి వచ్చే సంవత్సరం అదృష్టం వరిస్తుందట.. ఏయే రాశులంటే!

ఏడుగురు బ్యాట్స్‌మెన్లు డకౌట్.. 21 బంతుల్లోనే మ్యాచ్ ఖతం.. అసలు స్కోర్ ఎంతంటే?