Viral Video: ద్యావుడా.. ఇలా కూడా ర్యాంప్‌ వాక్‌ చేస్తారా? ఈ వీడియో చూస్తే మీరూ పొట్టచెక్కలయ్యేలా నవ్వుతారు..

| Edited By: Ravi Kiran

Jul 03, 2022 | 6:53 AM

Viral Video: సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఇందులో కొన్ని ఫన్నీగా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యానికి గురిచేస్తాయి. ఇప్పుడు అలాంటి ఓ ఫన్నీ వీడియోనే ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది.

Viral Video: ద్యావుడా.. ఇలా కూడా ర్యాంప్‌ వాక్‌ చేస్తారా? ఈ వీడియో చూస్తే మీరూ పొట్టచెక్కలయ్యేలా నవ్వుతారు..
Follow us on

Viral Video: సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఇందులో కొన్ని ఫన్నీగా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యానికి గురిచేస్తాయి. ఇప్పుడు అలాంటి ఓ ఫన్నీ వీడియోనే ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. సాధారణంగా ఫ్యాషన్‌ షోలు, అందాల పోటీలు ఆంటే ఫ్యాన్సీ డ్రెస్‌లతో ర్యాంప్‌వాక్‌లు, క్యాట్‌ వాక్‌లు చేస్తారు. అయితే ఓ మోడల్‌ ఇంట్లో ఉపయోగించేకునే వస్తువులతో ర్యాంప్‌ వాక్‌ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇందుకోసం కుర్చీ, నిచ్చెన, గేటు, జల్లెడ, చెక్క బల్ల, డ్రమ్ము తదితర వస్తువులను ఉపయోగించాడు. డాక్టర్ అజయిత అనే ట్విటర్ యూజర్ తన ప్రొఫైల్‌లో ‘ఈ రోజుల్లో చాలా ఫ్యాషన్ షోలు’ అనే క్యాప్షన్ తో పోస్టు చేశారు. దీంతో ఇప్పుడు ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ గా మారింది.

ఇంట్లో సామాన్లను దొంగతనం చేస్తున్నాడేమో?

ఇవి కూడా చదవండి

ఇందులో మోడల్ షహీల్ షెర్మాంట్ ఫ్లెయిర్ ర్యాంప్ వాక్ చేశాడు. ఇందుకోసం ఫాన్సీ దుస్తులకు బదులుగా ఇంట్లో వాడుకునే చిన్న చిన్న వస్తువులను ఎంచుకున్నాడు. ఈ వస్తువులను పట్టుకుని మోడల్స్‌ను అనుకరించాడు. ముఖ్యంగా మూడోసారి ఓ అమ్మాయిని చంకలో కూర్చొపెట్టుకుని  రావడం నవ్వులు పూయిస్తోంది. కాగా ఇంటర్నెట్‌ను షేక్‌ చేస్తోన్న ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు. ఇదేం ఫ్యాషన్‌ షో రా అయ్యా.. అతను ఫ్యాషన్ షో చేస్తున్నాడా లేక ఇంట్లోని సామాన్లను దొంగతనం చేస్తున్నాడా అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటికే ఈ వీడియోకు 14.6 మిలియన్లకు వ్యూస్‌ రావడం విశేషం. మరి మీరు కూడా ఈ వీడియోను చూసి మనసారా నవ్వుకోండి.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..