బంగారం అంటే ఇష్టపడని మనిషి ఉండడంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా భారతీయులు అత్యధికంగా ఇష్టపడే వాటిలో బంగారం ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది. అయితే గత కొన్ని ఏళ్ల క్రితం వరకూ బంగారం వస్తువులు చేయించుకోవడం అంటే అది ఒక ముఖ్య ఘట్టం. ఇంటికి కంసాలి వచ్చి.. నగల నమూనా చూపించి స్వహస్తాలతో అందంగా ఆభరణాలు చేసి ఇచ్చేవారు. ఆ నగలు అందుకున్న యజమానులు కూడా మజూరితో పాటు అతనికి స్వయం పాకం ఇచ్చి గౌరవించి సంతోషాన్ని తెలియజేసేవారు. కాలంలో వచ్చిన మార్పుల్లో భాగంగా బంగారం వస్తువుల కొనుగోళ్ళ విషయంలో కూడా మార్పులు వచ్చాయి. ఇప్పుడు నగల షాపు కి వెళ్లి తమకు నచ్చిన డిజైన్స్ లో కొనుగోలు చేస్తున్నారు. అలా కొనుగోలు చేసే నగలపై హాల్‌మార్క్ ముంద్రించి ఉండాలని.. అవి మంచి బంగారం అని ప్రభుత్వం సూచిస్తుంది. అదే వినియోగదారులు కూడా నమ్ముతున్నారు. అందుకనే హాల్‌మార్క్ ఉన్న నగాలనే కొనుగోలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఇలా హాల్‌మార్క్ ముంద్రించి ఉన్న బంగారం అసలా నకిలీనా అనే చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఇందు ఉదాహరణగా నిలుస్తోంది. తాజాగా వైరల్ అవుతోన్న ఒక వీడియో.
వైరల్ అవుతున్న వీడియోలో ఒక వ్యక్తి బంగారు ఆభరణంలో బంగారం ఎంత ఉంది అనే విషయాన్నీ ఒక చిన్న టెక్నిక్‌తో చూపించాడు. ఇది చూసిన పసిడి ప్రియులు షాక్ అవుతున్నారు. ఎందుకంటే ఆ నగ చూడానికి ఒరిజినల్ గోల్డ్ లా ఉంది. పైగా ప్రభుత్వం సర్టిఫై చేసిన హాల్ మార్క్ కూడా ముద్రించి ఉంది. అయితే ఆ నగను ఆ వ్యక్తీ పరీక్షిస్తూ ఆ బంగారం లాకెట్ ను చూపిస్తూ బంగారం పూత పూసి మోసం చేశారని.. 5% మేకింగ్ చార్జీలు తక్కువకు నగలు అమ్మకం అని అనగానే వెనకా ముందు చూసుకోకుండా కొనేస్తున్నారు కనుక ఇలాంటి మోసాలు జరుగుతున్నాయని వివరించాడు. ఆ లాకెట్ బంగారం కాదు అని నిరుపించానికి ముందుగా ఒక గీటు రాయికి తీసుకుని దానిపై ఆ నగను రుద్దాడు. తర్వాత ఒక జెల్ వంటిది ఆ బంగారం మీద పోశాడు. అప్పుడు అది నకిలీ నగ అని తేల్చు చెబుతూ.. తక్కువ ధరకు వస్తున్నాయని.. ఏ నగల దుకాణం బడితే ఆ నగల దుకాణంలోకి వెళ్ళవద్దు.. గుర్తింపు ఉన్న నగల షాప్స్ లో మాత్రమే వస్తువులు కొనుగోలు చేయమని సూచించాడు. లేదంటే మోసపోయే అవకాశం ఎక్కువ ఉందని హెచ్చరిస్తున్నాడు.
ఈ వీడియో ప్రస్తుతం ఓ రేంజ్ లో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 1.5 మిలియన్‌కు పైగా వ్యూస్ ను సొంతం చేసుకున్న ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. నెటిజన్లు మోస పోయేవారు ఉన్నంత కాలం మోసాలు జరుగుతూనే ఉంటాయని.. కొంచెం తక్కువ ధరకు అంటే చాలు ఎగబడి కొనే వినియోగదారులు ఉన్నంత కాలం ఇలాంటి మోసాలు కొనసాగుతాయని కామెంట్ చేస్తున్నారు. అంతేకాదు బంగారం కొనే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా సూచిస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..