సోషల్ మీడియాలో అనేక రకాల వీడియోలో ట్రెండ్ అవుతుంటాయి. వాటిలో పెంపుడు కుక్కలకు సంబంధించిన వీడియోలు, ముఖ్యంగా పెంపుడు కుక్కలకు సంబంధించినవి కూడా ప్రధానంగా ఉంటాయి. ఇక వాటిని చూసిన నెటిజన్లు, డాగ్ లవర్స్ అలా చూస్తుండిపోతారు. వాటితోనే వారి రోజు గడిచిపోయేలా గడిపేస్తారు. ట్రెండింగ్ వీడియలలోని కుక్కల మాదిరిగా తమ పెంపుడు కుక్క కూడా ముద్దుగా చిలిపి పనులు చేయాలని భావిస్తుంటారు. అంతేకాని తమ ఇంట్లోని పెంపుడు కుక్కలతో లాభాలు గడించాలని లేదా వాటితో డబ్బులు సంపాదించాలని కోరుకోరు. అయితే ప్రస్తుతం ఓ పెంపుడు కుక్కకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. ఇక ఈ వీడియలో పెంపుడు కుక్కకు దాని యజమాని డబ్బులు తీసుకురమ్మని, రోజుకు కనీసం 3,4 అయినా 500 రూపాయల నోట్లు తీసుకురావాలని చెప్తాడు. ఇక దీనికి సంబంధించిన వీడియో నెటిజన్ల కంట పడటంతో నెట్టంట హల్‌చల్ చేస్తోంది.
prabhat_ranjan21_ అనే ఇన్‌స్టా ఖాతా నుంచి షేర్ అయిన వీడియోలో మీరు ఈ దృశ్యాలను చూడవచ్చు. ముందుగా ఆ పెంపుడు కుక్కకు దాని యజమాని ఓ రూ.500 నోటుని చూపించి.. అలాంటి నోట్లను రోజుకు కనీసం 3,4 అయినా తీసుకురావాలని చెప్తాడు. అలాగే కనిపించిన వెంటనే నోట్లో పెట్టుకుని తీసుకురావాలాని, నమిలేయకూడదని, రూ.500 నోటు వాసన గుర్తుంచుకోమని అంటాడు. ఇక ఇది ఎక్కడ ఎప్పడు జరిగిందో తెలియదు కానీ ఆ వ్యక్తి వేసిన ప్లాన్ నెటిజన్లకు తెగ నవ్వు తెప్పిస్తోంది. దీంతో వారు కూడా రకరకాల కామెంట్లతో స్పందిస్తున్నారు.
కాగా, ఈ వీడియోకు ఇప్పటివరకు 36వేలకు పైగా లైకులు, 4 లక్షల 60 వేలకు పైగా వీక్షణలు వచ్చాయి. అలాగే పలువురు నెటిజన్లు వీడియోపై తమ స్పందనను కామెంట్ రూపంలో తెలియజేశారు. ఈ క్రమంలోనే ఒక నెటిజన్ ‘వావ్.. ఆ కుక్కపిల్ల ఎంతో క్యూట్‌గా ఉంది. ఎంత ముద్దుగా ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తున్నాడో..’ అంటూ కామెంట్ చేశారు. ఇంకో నెటిజన్ అయితే ‘ఈ మాత్రం ఆలోచన నాకు రాలేదు. వచ్చి ఉంటే ఈ పాటికి వేలకు వేలు సంపాదించి ఉండేవాడిన’ని సరదాగా రాసుకొచ్చాడు. ‘బ్రో.. మీ కుక్కపిల్ల మీ మాట వింటే.. త్వరలోనే ధనవంతుడివి అవుతావులే’ అని అన్నాడు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..