Viral Video: ఇంటర్నెట్‌లో షేర్ చేయబడిన జంతు వీడియోలకు వాటి అభిమానుల సంఖ్య కూడా భారీగానే ఉంటుంది. ఈ వీడియోలలో మనం సాధారణంగా చూడని, అరుదైన ఘటనలు అనేకం ఉంటాయి. రోజుకో కొత్త వీడియోలు ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తూనే ఉంటాయి. వైరల్ అవుతుంటాయి. వీటిలో చాలా వరకు జంతువుల వీడియోలే ఎక్కువగా ఉంటాయి. ఇక పాములకు సంబంధిన వీడియోలు మరింత ఎక్కువగా వైరల్ అవుతూనే ఉంటాయి. కొన్నిసార్లు ఈ వీడియోలు చూడటానికి ఫన్నీగానూ, కొన్నిసార్లు చాలా ఆశ్చర్యంగానూ ఉంటాయి.
సోషల్ మీడియా కూడా విచిత్రమైన కంటెంట్‌తో నిండిపోయింది. ఎన్ని సార్లు చూసినా రిపీట్ అయ్యేలా కనిపించే కొన్ని వీడియోలు కూడా ఉంటాయి. కొన్ని వీడియోలు చూసిన తర్వాత ఇలా కూడా జరుగుతుందా..? అనే సందేహం కలుగకమానదు. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక వ్యక్తి పాముతో కలిసి కనిపించాడు. వీడియోలో అతను పాముతో సెల్ఫీ తీసుకోవడం, పాము కూడా ఆనందంగా ఫోటోకు పోజులివ్వడం కనిపించింది.
సాధారణంగా ఇలాంటి దృశ్యాలు కనిపించవు. అయితే ఈ వీడియోలో కనిపిస్తున్నది నిజమేనని అంటున్నారు. సోషల్ మీడియాలో వచ్చిన ఈ షాకింగ్ వీడియోలో ఒక వ్యక్తి దాని పక్కన పాముతో కలిసి కూర్చున్నట్లు చూడవచ్చు. ఆ మరుసటి క్షణం ఫోన్ తీసి సెల్ఫీలు తీసుకోవడం మొదలుపెట్టాడు. మనిషిలాగే పాము కూడా హాయిగా పక్కనే కూర్చుని సెల్ఫీ దిగేందుకు సిద్ధమైంది. ఈ దృశ్యాన్ని చూసి జనం ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వైరల్ అవుతోంది.
సాధారణంగా పాములంటే అందరికీ భయం. అయితే, ఈ వీడియోలో మాత్రం ఆశ్చర్యకరమైన సన్నివేశం కనిపించింది.
ఈ వీడియో Instagram ఖాతాలో షేర్ చేయబడింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. మనుషులు సెల్ఫీలకు పోజులిచ్చినట్లే పాములు కూడా ఊగకుండా సెల్ఫీలకు పోజులివ్వడం. ఈ వీడియోకు చాలా లైక్‌లు,వ్యూస్ వచ్చాయి. ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి