Delivery Issues: ప్రస్తుత కాలంలో అంతా ఆన్‌లైన్ షాపింగ్‌పైనే ఆధారపడుతున్నారు. ఫ్యాషన్ కోసం అయినా, కిచెన్ కోసం అయినా మార్కెట్‌కి వెళ్లి తెచ్చుకునే అంత తీరిక ఎవరికీ ఉండడంలేదు. దీంతో అంతా ఆన్‌లైన్ షాపింగ్ వైపే చూస్తున్నారు. అయితే అలా అన్‌లైన్ షాపింగ్ చేసిన ఓ వ్యక్తికి పెద్ద షాక్ ఇచ్చింది అమెజాన్ సిబ్బంది. రూ. 90 వేల కెమెరా లెన్స్‌లను అర్డర్ చేసిన అరుణ్ కుమార్ అనే వ్యక్తికి ఏకంగా క్వినోవా సీడ్స్ వచ్చాయి. అంతే ఒక్కసారిగా ఖంగు తిన్న అతను నేరుగా ట్విట్టర్ వేదికగా అమెజాన్ ఇంకా, దాన్ని విక్రయించిన ఎప్పారియో రిటైల్ అనే సంస్థకు ఫిర్యాదు చేశాడు.
అయితే అతను చేసిన ట్వీట్ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ‘అమెజాన్‌లో రూ. 90 వేల కెమెరా లెన్స్ ఆర్డర్ చేసాను. కానీ లెన్స్ బాక్స్ లోపల క్వినోవా సీడ్స్ ప్యాకెట్‌ని పంపించారు. అమెజాన్, ఎప్పారియో రిటైల్ చేసిన పెద్ద స్కామ్. దీన్ని పరిష్కరించండి. దీనిపై అమెజాన్ ఇండియా నా సమస్యను పరిష్కరిస్తామని చెబుతున్నారు. కానీ అసలు ఇలా ఎందుకు జరిగింది..? నేను అర్డర్ చేసిన లెన్స్‌ని పంపించండి లేదా నా డబ్బులు రీఫండ్ చేయండ’ని అరుణ్ కుమార్ చేసిన ఆ పోస్ట్‌పై నెటిజన్లు తెగ స్పందిస్తున్నారు. రకరకాల కామెంట్లతో తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.
Ordered a 90K INR Camera lens from Amazon, they have sent a lens box with a packet of quinoa seeds inside instead of the lens. Big scam by @amazonIN and Appario Retail. The lens box was also opened. Solve it asap. pic.twitter.com/oED7DG18mn
— Arun Kumar Meher (@arunkmeher) July 6, 2023
షాప్‌కి వెళ్లి కొనుగోలు చేయడం మంచిదని కొందరు, తమకూ తగంలో ఇలాంటి అనుభవాలు ఉన్నాయని మరికొందరు రాసుకొస్తున్నారు. అమెజాన్ చేసి ఉండదు, డెలివరీ బాయ్ ఇలా చేసి ఉంటాడని ఇంకొందరు చెప్పుకొచ్చారు. మరోవైపు ఈ ట్వీట్‌ని ఇప్పటివరకు 1 లక్షా 40 వేల మంది వీక్షించారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..