Viral Video: కుక్కకి ఇంజెక్షన్ చేసిన డాక్టర్.. నెక్స్ట్ ఏమి జరిగిందో చూస్తే పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతారు..

ఈ వీడియోలో.. కుక్కకు ఇంజెక్షన్ చేసిన తర్వాత ఒక వ్యక్తి పరిగెత్తుతున్నట్లు కనిపిస్తుండగా.. కుక్క కురవడానికి పరిగెత్తడం కనిపిస్తుంది. ఇద్దరు దంపతులు తమ పెంపుడు కుక్కను గట్టిగా పట్టుకున్నారు.

Viral Video: కుక్కకి ఇంజెక్షన్ చేసిన డాక్టర్.. నెక్స్ట్ ఏమి జరిగిందో చూస్తే పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతారు..
Dog Viral Video
Follow us
Surya Kala

|

Updated on: Sep 27, 2022 | 9:07 AM

Viral Video: ప్రపంచంలోని అత్యంత పెంపుడు జంతువుల్లో ఒకటి కుక్కలు. ప్రజలు వాటిని పెంపుడు జంతువులుగా ఉంచడానికి అతి పెద్ద కారణం ఏమిటంటే చాలా విశ్వసనీయమైన జంతువులు. అవసరమైనప్పుడు తమ యజమానుల కోసం తమ ప్రాణాలను కూడా త్యాగం చేయగల విశ్వాసం వీటి సొంతం. అయితే  ప్రస్తుతం అధిక మంది కుక్కల కాటుకు గురవుతున్నారు. దీంతో శునకాలపై తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేయడమే కాకుండా కుక్కను పెంచుకోవద్దని సలహా ఇస్తున్నారు. అయినప్పటికీ కుక్కలకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతూనే ఉన్నాయి. తాజాగా కుక్క కాటుకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ కుక్కకు సంబంధించిన చాలా ఫన్నీ వీడియో చూసి మీరు పగలబడి నవ్వుతారు.

వాస్తవానికి, ఈ వీడియోలో.. కుక్కకు ఇంజెక్షన్ చేసిన తర్వాత ఒక వ్యక్తి పరిగెత్తుతున్నట్లు కనిపిస్తుండగా.. కుక్క కురవడానికి పరిగెత్తడం కనిపిస్తుంది. ఇద్దరు దంపతులు తమ పెంపుడు కుక్కను గట్టిగా పట్టుకున్నారు. పశువుల డాక్టర్ ఆ కుక్కకు దాక్కొని వెనుక నుండి ఇంజెక్షన్ చేశాడు. ఇలా ఇంజెక్షన్ చేసి..  వేగంగా ఇంటి నుండి బయటకు పరిగెత్తాడు. తరువాత ఇంటి గేటు తలుపును మూసివేశాడు. తన కారులో కూర్చున్నాడు. అయితే కుక్క తనకు ఇనెక్షన్ చేసిన చేసిన వ్యక్తిమీద కోపంతో అతని వెంట పరిగెత్తింది. గేటు దగ్గర ఆగి అరవడం కనిపిస్తుంది. అయితే ఆ వ్యక్తి పట్టుబడి ఉంటే.. అతడిని ఆ కుక్క  ఖచ్చితంగా కరిచేదని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

కుక్కకి ఇంజెక్షన్ వేయగానే కోపం ఎలా వచ్చిందో చూడండి

వీడియోలో కనిపిస్తున్న కుక్క పిట్ బుల్ జాతికి చెందింది. ఇది ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన కుక్కలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ ఫన్నీ వీడియో @atr_ahre అనే IDతో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయబడింది.

ఈ 14 సెకన్ల వీడియోను ఇప్పటివరకు 6 లక్షల 71 వేలకు పైగా వీక్షించగా, 26 వేల మందికి పైగా వీడియోను కూడా లైక్ చేశారు. అదే సమయంలో, వీడియో చూసిన తర్వాత ప్రజలు వివిధ రకాల కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియో చూసి జనాలు నవ్వుకుంటున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..