Viral News: ఇదేం పైత్యం రా సామి..! కాటేసిన పామును ఇలా చేశావేంట్రా బాబూ.. ఊరందరి ముందు..

విషపూరిత పాములు కాటేస్తే.. క్షణాల్లోనే చనిపోయే అవకాశం ఉంది. అందుకే అందరూ వాటికి దూరంగా ఉంటారు. అయితే.. తాజాగా ఓ షాకింగ్ సీన్ అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది.

Viral News: ఇదేం పైత్యం రా సామి..! కాటేసిన పామును ఇలా చేశావేంట్రా బాబూ.. ఊరందరి ముందు..
Snake

Updated on: Sep 08, 2022 | 11:22 AM

Man Has Revenge By Biting Snake: కింగ్ కోబ్రా లాంటి పామును సాధారణంగా దూరం నుంచి చూస్తేనే భయంతో వణికిపోతుంటాం.. ఇంకా దగ్గరగా చూస్తే పరిస్థితి ఎలా ఉంటుందో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విషపూరిత పాములు కాటేస్తే.. క్షణాల్లోనే చనిపోయే అవకాశం ఉంది. అందుకే అందరూ వాటికి దూరంగా ఉంటారు. అయితే.. తాజాగా ఓ షాకింగ్ సీన్ అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. తాచు పాము కాటేసిందని ఓ వ్యక్తి.. దానిపై ప్రతీకారం తీసుకున్నాడు. కింగ్ కోబ్రాను పట్టుకొని నోటితో కొరికి కొరికి చంపాడు. ఈ షాకింగ్ ఘటన ఒడిశా రాష్ట్రంలో చోటుచేసుకుంది.

ఒడిశాలోని దారాదా గ్రామంలో వరి పొలంలో పని చేస్తున్న సమయంలో సలీం ఖాన్ అనే వ్యక్తికి నాగుపాము కాటేసింది. అయితే, సలీంఖాన్ వెంటనే వైద్యులను ఆశ్రయించే బదులు.. పామును పట్టుకుని తిరిగి కాటేశాడు. నోటితో కొరికి కొరికి చంపినట్లు గ్రామస్తులు తెలిపారు. అతను పామును పట్టుకొని కొరుకుతుండటాన్ని చూసినట్లు గ్రామస్థులు తెలిపారు. ఆ తర్వాత సలీం ఖాన్ అంతటితో ఆగలేదు. చనిపోయిన పామును తన మెడలో వేసుకొని గ్రామంలో తిరిగాడు.

పాము కాటు తర్వాత అతనికి ఎలాంటి నొప్పి అనిపించలేదని.. చనిపోయిన నాగుపామును మెడలో వేసుకుని సలీం సైకిల్‌పై వెళ్లడం తాము చూశామని.. చూస్తుంటేనే భయం వేసిందని గ్రామస్థులు సంబాద్ తెలిపాడు. పాము కాటు వేసిన తర్వాత నాటు వైద్యం చేయించుకున్నానని సలీం ఓ వార్తా సంస్థకు తెలిపాడు.

ఇవి కూడా చదవండి

భారతదేశంలో కనిపించే అత్యంత ప్రమాదకరమైన పాములలో కింగ్ కోబ్రా ఒకటి. పాము కాట్ల వల్ల చాలా మంది ప్రజలు మరణిస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..