AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Delhi: ఢిల్లీలో మరో దారుణం.. యువకుడ్ని 3 కిలోమీటర్లు లాక్కెళ్లిన కారు

దేశరాజధాని దిల్లీ లో అత్యంత భద్రత ఉన్న వీఐపీ జోన్‌లో జరిగిన ప్రమాదం ఆలస్యంగా వెలుగుచూసింది. శనివారం రాత్రి కస్తుర్బాగాంధీ మార్గ్‌, టోల్‌స్తోయ్‌ మార్గ్ సమీపంలో ద్విచక్రవాహనంపై వెళ్తోన్న ఇద్దరు వ్యక్తులను ఓ కారు వేగంగా ఢీ కొట్టింది. దాంతో ఓ వ్యక్తి కొన్ని అడుగుల దూరం ఎగిరిపడగా.. మరో వ్యక్తి కారు పైభాగంపై పడిపోయాడు.

Delhi: ఢిల్లీలో మరో దారుణం.. యువకుడ్ని 3 కిలోమీటర్లు లాక్కెళ్లిన కారు
Accident
Aravind B
|

Updated on: May 03, 2023 | 9:56 PM

Share

దేశరాజధాని దిల్లీ లో అత్యంత భద్రత ఉన్న వీఐపీ జోన్‌లో జరిగిన ప్రమాదం ఆలస్యంగా వెలుగుచూసింది. శనివారం రాత్రి కస్తుర్బాగాంధీ మార్గ్‌, టోల్‌స్తోయ్‌ మార్గ్ సమీపంలో ద్విచక్రవాహనంపై వెళ్తోన్న ఇద్దరు వ్యక్తులను ఓ కారు వేగంగా ఢీ కొట్టింది. దాంతో ఓ వ్యక్తి కొన్ని అడుగుల దూరం ఎగిరిపడగా.. మరో వ్యక్తి కారు పైభాగంపై పడిపోయాడు. కానీ డ్రైవర్‌ మాత్రం ఆ కారును అలాగే వేగంగా ముందుకు తీసుకెళ్లాడు. దాదాపు మూడు కిలోమీటర్లు వెళ్లిన తర్వాత దిల్లీ గేట్ సమీపంలో పైభాగంలో ఉన్న వ్యక్తిని కిందికి పడేసి, కారు డ్రైవర్‌ పారిపోయాడు. అప్పటికే తీవ్ర గాయాలతో ఉన్న ఆ బాధితుడు ఆ తర్వాత మరణించాడు. గాయపడిన మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. కానీ వారి పేర్లను ఇంకా బయటకు వెల్లడించలేదు.

అయితే ఈ ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి పేరు దీపాన్షు వర్మ. ఇతను ఒక ఆభరణాల దుకాణాన్ని నడుపుతున్నాడు. తల్లిదండ్రులకు ఇతనొక్కడే కొడుకు. అయితే కొద్ది నెలల క్రితం దిల్లీలో ఇలాంటి తరహా ఘటనే చోటుచేసుకుంది. ఓ యువతి నడుపుతోన్న బైక్‌ను ఢీకొన్న కారు.. ఆమె శరీరాన్ని కొన్ని కిలోమీటర్లపాటు ఈడ్చుకెళ్లింది. దీంతో ఆ మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోవడం దుమారం రేపిన విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Follow Us
జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్నారా? ఇలా పీతల సూప్‌ తాగితే చాలు!
జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్నారా? ఇలా పీతల సూప్‌ తాగితే చాలు!
రేకుల షెడ్డు లీకేజీలతో ఇబ్బందా? తక్కువ ఖర్చుతో బెస్ట్ ట్రిక్
రేకుల షెడ్డు లీకేజీలతో ఇబ్బందా? తక్కువ ఖర్చుతో బెస్ట్ ట్రిక్
డాక్టర్ చనిపోయే ముందు హైవేపై ఏం జరిగింది..? నెట్టింట వీడియో వైరల్
డాక్టర్ చనిపోయే ముందు హైవేపై ఏం జరిగింది..? నెట్టింట వీడియో వైరల్
జపాన్ వెళ్లిన టీమిండియా.. అభిషేక్ శర్మ లగేజ్ చూశారా..?
జపాన్ వెళ్లిన టీమిండియా.. అభిషేక్ శర్మ లగేజ్ చూశారా..?
చిన్నపిల్లలకు ఇచ్చే దగ్గు మందు సీసాలపై కేంద్రం హెచ్చరిక!
చిన్నపిల్లలకు ఇచ్చే దగ్గు మందు సీసాలపై కేంద్రం హెచ్చరిక!
రష్యాపై ఉక్రెయిన్ కీలక నిర్ణయం..రాత్రికి రాత్రే ఏం చేసిందో తెలుసా
రష్యాపై ఉక్రెయిన్ కీలక నిర్ణయం..రాత్రికి రాత్రే ఏం చేసిందో తెలుసా
బాడీలోని కొవ్వును కరిగించే మొనగాడు ఆకు.. షుగర్ కూడా కంట్రోల్
బాడీలోని కొవ్వును కరిగించే మొనగాడు ఆకు.. షుగర్ కూడా కంట్రోల్
మీ UPI పిన్ సురక్షితంగా మార్చుకోవడం లేదా రీసెట్ చేయడం ఎలా?
మీ UPI పిన్ సురక్షితంగా మార్చుకోవడం లేదా రీసెట్ చేయడం ఎలా?
పుట్టగొడుగులు త్వరగా బూజు పడుతున్నాయా?ఎక్కువ రోజులు తాజాగా ఉండాలా
పుట్టగొడుగులు త్వరగా బూజు పడుతున్నాయా?ఎక్కువ రోజులు తాజాగా ఉండాలా
ఆసియా గేమ్స్‌లో నాలుగో పతకం కైవసం..!
ఆసియా గేమ్స్‌లో నాలుగో పతకం కైవసం..!