Navaratri 2022: గల్లీలో హుషారుగా స్టెప్పులేసిన రావణుడు.. ఆదిపురుష్‌లో ఛాన్స్ ఇవ్వాలంటోన్న నెటిజన్లు

| Edited By: Ravi Kiran

Oct 07, 2022 | 6:30 AM

చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నవరాత్రి ఉత్సవాల చివర రోజున రావణ దమన కార్యక్రమాలను కూడా నిర్వహించారు. ఈనేపథ్యంలో ఓ వ్యక్తి రావణుడి గెటప్‌లో వెరైటీగా డ్యాన్స్ చేశాడు.

Navaratri 2022: గల్లీలో హుషారుగా స్టెప్పులేసిన రావణుడు.. ఆదిపురుష్‌లో ఛాన్స్ ఇవ్వాలంటోన్న నెటిజన్లు
Raavan Dance
Follow us on

దేశమంతటా దసరా ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ప్రజలు పండుగను ఆనందోత్సాహాలతో పండగను సెలబ్రేట్‌ చేసుకున్నారు. శరన్నవరాత్రులను పురస్కరించుకుని దుర్గామాతను వివిధ అలంకరణల్లో ముస్తాబు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నవరాత్రి ఉత్సవాల చివర రోజున రావణ దమన కార్యక్రమాలను కూడా నిర్వహించారు. ఈనేపథ్యంలో ఓ వ్యక్తి రావణుడి గెటప్‌లో వెరైటీగా డ్యాన్స్ చేశాడు. వీధుల్లో తిరుగాడుతూ పాటలకు అనుగుణంగా ఎంతో హుషారుగా స్టె్ప్పులేశాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు ఆన్‌లైన్‌లో తెగ వైరలవుతోంది. హర్యాన్వి సాంగ్ 52 గజ్ కా దామన్ అనే పాటకు డ్యాన్స్ చేశాడని ఈ వీడియోలో చెప్పుకొచ్చారు. రావణుడితోపాటు మరొకరు ఫ్యాన్సీ డ్రెస్‌లో డ్యాన్స్‌ చేస్తూ ఆ వీడియోలో కనిపించారు. ద‌స‌రా రోజున ఈ వీడియోను సోష‌ల్ మీడియాలో అప్‌లోడ్‌ చేయగా లక్షలాది వ్యూస్‌ వచ్చాయి. అలాగే వేలాది లైకులు, కామెంట్లు వస్తున్నాయి.

ఓహ్ మై గాడ్, దిస్ ఇస్ సో ఫన్నీ , వీడియో చాలా బాగుందని మరొకరు రాశారు. జై లంకేశ్ అని నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అదేవిధంగా ప్రభాస్‌ హీరోగా నటించిన ఆదిపురుష్‌లో ఇతనికి అవకాశం కల్పించాలని సరదాగా కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఓం రౌత్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఆది పురుష్‌ లో సైఫ్ అలీఖాన్‌ లంకాధిపతిగా నటించనున్నాడు. అయితే ఇటీవల విడుదలైన సినిమా టీజర్ లో సైఫ్‌ పాత్ర, వేషధారణపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. రావణుడితో పాటు హనుమంతుడి పాత్రలను వక్రీకరించారని, సినిమాను అడ్డుకొని తీరుతామంటూ హిందూ సంఘాలు, బీజేపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..