AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నక్క తోక తొక్కావు బాసూ..! ఆర్డర్ పెట్టింది ఒకటి.. వచ్చింది అంతకుమించి.. నెటిజన్ల రియాక్షన్ ఇదే..

అదృష్టం అనేది ఎవరికో ఒక్కరికి మాత్రమే ఉంటుంది. అలాంటి వారు పట్టిందల్లా బంగారంగా మారుతుంటుంది. అందుకే.. అదృష్టం అనేది అందరికీ కలిసిరాదంటారు.

నక్క తోక తొక్కావు బాసూ..! ఆర్డర్ పెట్టింది ఒకటి.. వచ్చింది అంతకుమించి.. నెటిజన్ల రియాక్షన్ ఇదే..
Flipkart Billion Days
Shaik Madar Saheb
|

Updated on: Oct 06, 2022 | 9:53 PM

Share

అదృష్టం అనేది ఎవరికో ఒక్కరికి మాత్రమే ఉంటుంది. అలాంటి వారు పట్టిందల్లా బంగారంగా మారుతుంటుంది. అందుకే.. అదృష్టం అనేది అందరికీ కలిసిరాదంటారు. మరికొంత మందికి అప్పుడప్పుడు లక్ తలుగుతుంటే.. ఇంకొంత మందికి మాత్రం లక్ అనేది ఆమడదూరంలో ఉంటుంది. ఇక్కడ మాత్రం బిగ్ బిలియన్ డేస్ సేల్ లో అదిరిపోయే లక్ తగిలింది. ఇటీవల ఫ్లిప్ కార్ట్ ఇటీవల బిగ్ బిలియన్ డేస్ సేల్ ను నిర్వహించిన విషయం తెలిసిందే.. ప్రస్తుతం ఈ సేల్ అందుబాటులో లేదు. ఈ సేల్ లో భాగంగా ఫ్లిప్‌కార్ట్ ఎన్నో రకాల ఆఫర్లను వినియోగదారులకు అందుబాటులో ఉంచింది. వినియోగదారులకు ఈ ఆఫర్లను తెగ వినియోగించుకున్నారు. అలాగే ఐఫోన్లపై కూడా భారీ ఆఫర్లు ఉండడంతో బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో చాలామంది ఐఫోన్లను కొనుగోలు చేశారు.

ఈ క్రమంలో ఫ్లిప్ కార్ట్ లో ఐఫోన్ ఆర్డర్లు క్యాన్సిల్ చేసిందని విమర్శలు కూడా వినిపించాయి. అయితే, ఇక్కడ మాత్రం ఓ వ్యక్తికి ఫ్లిప్ కార్ట్ గుడ్ న్యూస్ చెప్పింది. ఐఫోన్ 13 ఆర్డర్ ఇస్తే.. ఐఫోన్ 14 డెలివరీ చేశారు. ఇటీవల జరిగిన బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఐఫోన్ 13 ధర 50వేల వరకు ఉంది. ఈ విషయాన్ని ట్విట్టర్ యూజర్ వెల్లడించారు. ఐఫోన్ 13 ఆర్డర్ చేస్తే ఐఫోన్ 14 వచ్చిందంటూ ట్విట్ చేసి తెలిపారు.

రిటైల్ బాక్స్ వంటి వాటిని కూడా సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆర్డర్ వివరాల ప్రకారం.. ఐఫోన్ కోసం రూ.49,019 చెల్లించాడు. అయితే అతనికి ఐఫోన్ 14 డెలివరీ అయింది. ఐఫోన్ 14 ధర 80వేల నుంచి లక్ష వరకు ఉంటుంది.

అశ్విని హెగ్డే అని వ్యక్తి ట్విట్ చేయగా.. ఇది నెట్టింట వైరల్‌గా మారింది. లక్ అంటే ఇలా ఉంటుందని.. మాకు ఇలాంటి అదృష్టం కలిసి రాదంటూ కొందరు నెటిజన్లు ట్విట్టర్‌లో ఫన్నీగా స్పందిస్తున్నారు.

దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్‌ను షేర్ చేస్తూ.. చాలామంది నెటిజన్లు పలు రకాల కామెంట్లు చేస్తున్నారు.

అంతకుముందు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి వాటిల్లో ఫోన్లను ఆర్డర్ చేసిన కస్టమర్‌లకు వాటికి బదులుగా సబ్బులు, ఇటుకలు, ఇతర పనికిరాని ఉత్పత్తులు వచ్చిన విషయం తెలిసిందే. అయితే.. తాజాగా ఈ ఘటన అందరినీ ఆశ్చర్యపోయేలా చేసింది.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్