Viral Video: వీరజవాన్ గుండె ధైర్యానికి కింగ్‌ కోబ్రా తలొగ్గాల్సిందే..! వీడియో చూస్తే బెదురుకుంటారు..

|

May 29, 2023 | 3:17 PM

చాలా చాకచక్యంగా కింగ్‌కోబ్రాను పట్టుకున్న వీడియో వైరల్‌ అవుతోంది. ఆ విధంగా జవాన్‌ ఒట్టి చేతులతో పామును పట్టుకుంటున్న వీడియో ప్రపంచవ్యాప్తంగా వీక్షకుల నుండి ప్రశంసలను అందుకుంది. వీడియోలో వ్యక్తి దాడి చేస్తున్న నాగుపాము ఎదురుగా నిలబడి ఉండటం కనిపించింది.

Viral Video: వీరజవాన్ గుండె ధైర్యానికి కింగ్‌ కోబ్రా తలొగ్గాల్సిందే..! వీడియో చూస్తే బెదురుకుంటారు..
King Cobra
Follow us on

సోషల్ మీడియా లేకుండా ఉండలేని వాతావరణంలో మనం జీవిస్తున్నాం..చాలా మందికి సోషల్ నెట్ వర్కింగ్ సైట్లు పని చేయనప్పుడు వీడియోలు చూడటం అలవాటు. అలా సోషల్ మీడియా ప్రపంచంలో మనం ఊహించలేని ఎన్నో విషయాలను చూస్తూనే ఉంటాం.. ఆ విధంగా జంతువుల వీడియోలు, పిల్లల కొంటె వీడియోలు ఇలా ఎన్నో వీడియోలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మనం చూసే వీడియోలు కొన్నిసార్లు మనల్ని నవ్విస్తాయి, కొన్నిసార్లు మనల్ని ఆలోచింపజేస్తాయి.. మరికొన్ని వీడియోలు మనల్ని ఆశ్చర్యపరుస్తాయి.. కొన్ని వీడియోలు మనల్ని షాక్‌కు గురిచేస్తాయి. కొన్ని వీడియోలు మనల్ని బాధపెడతాయి. అలాంటి వీడియోలలో ఎక్కువగా పాములకు సంబంధించిన వీడియోలు కూడా వైరల్‌ అవుతుంటాయి. అలాంటిదే ఈ వీడియో కూడా. ఇక్కడ కింగ్‌కోబ్రా, నౌకాదళ జవాన్‌ మధ్య జరిగిన సంఘటన ఇంటర్‌నెట్‌లో వైరల్‌ అవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

మామూలు నాగుపామును ఎదురుగా చూస్తేనే, ప్రాణం పోయినంత పని అవుతుంది. ఇక కింగ్‌ కోబ్రా ఎదురుపడితే ప్రాణాలపై ఆశలు వదులుకోవాల్సిందే. కాని, ఒక నౌకాదళ జవాన్‌- కింగ్‌కోబ్రాను ఖాళీచేతులతో పట్టుకున్నారు. చాలా చాకచక్యంగా కింగ్‌కోబ్రాను పట్టుకున్న వీడియో వైరల్‌ అవుతోంది. ఆ విధంగా జవాన్‌ ఒట్టి చేతులతో పామును పట్టుకుంటున్న వీడియో ప్రపంచవ్యాప్తంగా వీక్షకుల నుండి ప్రశంసలను అందుకుంది. వీడియోలో వ్యక్తి దాడి చేస్తున్న నాగుపాము ఎదురుగా నిలబడి ఉండటం కనిపించింది.

ఇవి కూడా చదవండి

మెరుపు వేగం, ఖచ్చితత్వంతో అతను పాము తలను పట్టుకోవడం కూడా వీడియోలో కనిపించింది. Reddit సైట్‌లో అప్‌లోడ్ చేసిన ఈ వీడియో ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులను ఆకర్షించింది. మరి షాక్ తిన్న యూజర్లు ఇది ఎలా సాధ్యమని ప్రశ్నిస్తున్నారు. ఈ వీడియో ఇప్పుడు యూట్యూబ్‌లో కూడా అప్‌లోడ్ చేయబడింది.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..