Viral Video: రోడ్డు దాటడానికి యువకుడు అద్భుతమైన ట్రిక్.. చూస్తే నవ్వకుండా ఉండలేరు..

|

Jul 09, 2023 | 11:05 AM

చాలా మంది వాహనాలు ఆపే వరకు వేచి ఉండి.. అనంతరం రోడ్డు దాటుతారు. ప్రస్తుతం రోడ్డు దాటడానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. వీడియోలో ఒక యువకుడు రోడ్డు దాటడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తుంది. అయితే అతని తెలివి తేటలు చూసి నవ్వకుండా ఉండలేరు.

Viral Video: రోడ్డు దాటడానికి యువకుడు అద్భుతమైన ట్రిక్.. చూస్తే నవ్వకుండా ఉండలేరు..
Viral Video
Follow us on

నిత్యం వాహనాలు వస్తూ పోతూ ఉండడంతో రద్దీ ప్రాంతాల్లో రోడ్డు దాటడం పెద్ద సవాలే. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా సరే ఎలా రోడ్డు దాటగలరు ? అంటే అది ఒక సమాధానం లేని ప్రశ్ననే.. చాలా మంది రోడ్డు దాటటానికి రకరకాల పరిష్కారాలను కనుగొన్నారు. చాలా సార్లు హ్యాండ్ సిగ్నల్స్‌తో వాహనాలను ఆపుతూ హాయిగా రోడ్డు దాటుతున్నారు. చాలా మంది వాహనాలు ఆపే వరకు వేచి ఉండి.. అనంతరం రోడ్డు దాటుతారు. ప్రస్తుతం రోడ్డు దాటడానికి సంబంధించిన వీడియో ఒకటి సామజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతోంది. వీడియోలో ఒక యువకుడు రోడ్డు దాటడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తుంది. అయితే అతని తెలివి తేటలు చూసి నవ్వకుండా ఉండలేరు.

రోడ్డు మీద ఒక వికలాంగుడు చేతి సంజ్ఞలతో వాహనాలను ఆపుతూ రోడ్డు దాటేందుకు ప్రయత్నిస్తున్నట్లు  వీడియోలో చూడవచ్చు. కుంటుకుంటూ హాయిగా రోడ్డు దాటుతున్న యువకుడిని చూసి వాహనాలు కొంచెం స్లో అయ్యాయి.. యువకుడు రోడ్డు దాటిన వెంటనే యువకుడు నార్మల్ అయ్యాడు. హాయిగా నడుచుకుంటూ  వెళ్లడం మొదలుపెట్టాడు. నిజానికి ఆ యువకుడు వికలాంగుడు కాదు.. రద్దీగా ఉన్న రోడ్డును దాటడానికి వికలాంగుడిగా నటించాడు. ఎవరైనా రోడ్డు దాటడానికి ఉపయోగించే అనేక ట్రిక్కులు చూసి ఉంటారు కానీ.. యువకుడు ఆలోచించిన విధంగా ఎవరూ ఆలోచించి ఉండరు.. ఇలాంటి దృశ్యాన్ని ఎప్పుడూ చూసి ఉండరు. ఇది ‘సూపర్ సే భీ ఊపర్’ అంటే సూపర్ ఆలోచన కంటే ఇంకా ఎక్కువ ఆలోచన అని చెప్పవచ్చు.

ఇవి కూడా చదవండి

ఈ ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఇది adil_loui అనే IDతో ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఇది ఇప్పటివరకు 12 లక్షల వ్యూస్, 71 వేల మందికి పైగా లైక్స్ ను సొంతం చేసుకుంది.

అదే సమయంలో వీడియోను చూసిన తర్వాత వినియోగదారులు వివిధ ఫన్నీ రియాక్షన్లు కూడా ఇచ్చారు. ‘ఈ అన్నయ్యకు ఆస్కార్ అవార్డ్ ఇవ్వండి’ అని కొందరు, ‘అద్భుతమైన హ్యాట్ మ్యాన్’ అని కొందరు, ‘ఇలా చేయకూడదు’ అని మరికొందరు యూజర్లు అంటున్నారు. ఒకరి సమస్యను ఎగతాళి చేయడం తప్పని మరికొందరు చెబుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..