Watch: ఆరుగురిని మింగేసిన మృత్యుగుహ.. సముద్రం అడుగున కనిపించిన భయానక దృశ్యం
మాల్దీవుల సమీపంలోని అండర్‌వాటర్‌లో ఉన్న షార్క్‌కేవ్ అన్వేషణకు వెళ్లి ఐదుగురు డైవర్ల బృందం మృతి చెందిన ఘటన కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. వారు సందర్శనకు వెళ్లిన సమయంలో వాళ్ల వద్ద ఉన్న గోప్రోలో రికార్డైన దృశ్యాలు ఇప్పుడు బయటకు వచ్చాయి. తాజాగా ది ఇండిపెండెంట్ అనే పత్రిక విడుదల చేసిన ఈ దృశ్యాలు అండర్‌వాటర్‌లో పరిస్థితులు ఎంత భయంకరంగా ఉంటాయో కళ్లకు కట్టినట్టు చూపించింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మాల్దీవుల చరిత్రలోనే అత్యంత ఘోరమైన డైవింగ్ ప్రమాదాల్లో ఒకటిగా నిలిచిన సంఘటనకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆరుగురు డైవర్ల ప్రాణాలు బలిగొన్న ఈ ప్రమాదకరమైన అండర్ వాటర్ కేవ్ లోపల పరిస్థితులు ఎంత భయానకంగా ఉన్నాయో తెలిపే చిత్రాలను ది ఇండిపెండెంట్ అనే పత్రిక తాజాగా విడుదల చేసింది. నీటి అడుగున చిక్కుకున్న మృతదేహాలను వెలికితీసేందుకు మల్టీనేషనల్ రెస్క్యూ టీమ్ చేపట్టిన ఆపరేషన్ విజయవంతం కావడంతో ఈ ఫోటోలు వెలుగులోకి వచ్చాయి. డైవర్లు ప్రమాదానికి గురైన వావు అటోల్ ప్రాంతంలో, సముద్ర మట్టానికి దాదాపు 60 మీటర్ల లోతులో ఉన్న గుహలో ఇరుకైన సొరంగాలు, బురదతో నిండిన గదులు ఉన్నట్లు ఈ చిత్రాల్లో మనం చూడవచ్చు.
నివేదికల ప్రకారం.. మే 14న ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఇటలీకి చెందిన ఐదుగురు అనుభవజ్ఞులైన డైవర్లు మెరైన్ ఎకాలజీ ప్రొఫెసర్ మోనికా మోంటెఫాల్కోన్, ఆమె 20 ఏళ్ల కుమార్తె జార్జియా సోమకాల్, మెరైన్ బయాలజిస్ట్ ఫెడెరికో గ్వాల్టియరీ, పరిశోధకురాలు మురియెల్ ఒద్దెనినో, డైవింగ్ ఇన్‌స్ట్రక్టర్ జియాన్‌లుకా బెనెడెట్టి కలిసి అలీమథా ద్వీపం సమీపంలో ఉన్న షార్క్ కేవ్ గా పిలిచే గుహను పరిశీలించేందుకు కోసం వెళ్లారు. అయితే మాల్దీవులలో సాధారణంగా రిక్రియేషనల్ డైవింగ్ పరిమితి 30 మీటర్లు మాత్రమే ఉంటుంది. కానీ, ఈ బృందం నిబంధనలను అతిక్రమించి 50 నుండి 60 మీటర్ల లోతుకు వెళ్లినట్లు అధికారులు గుర్తించారు. అయితే అక్కడ వీరు ఒక గుహలాంటి ప్రదేశంలోకి వెళ్లారని.. అక్కడ బురదతో కూడిన కొన్ని గలదుల్లో చిక్కుకుపోయారని తెలిపారు.
సముద్రం అడుగున భయానక దృశ్యాలు
View this post on Instagram
అయితే వీరంతా తప్పిపోయిన కొద్దిసేపటికే ఈ గ్రూప్‌లో ఒకరైన డైవింగ్ ఇన్‌స్ట్రక్టర్ బెనెడెట్టి మృతదేహం గుహ ద్వారం వద్ద లభ్యంకావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అయితే మిగిలిన నలుగురు డైవర్ల మృతదేహాలు కూడా అదే గుహ లోపల ఉండవచ్చని అధికారులు భావించారు. ఈ క్రమంలోనే మృతహాలను వెళికితేసేందుకు సహాయక చర్యలు చేపట్టారు. కానీ గుహ లోపల దారి సరిగ్గా కనిపించకపోవడం, ఇరుకైన మార్గాలు ఉండటంతో సహాయక చర్యలు అత్యంత సంక్లిష్టంగా మారాయి. లోపల చిక్కుకున్న వారిని రక్షించే ప్రయత్నంలో మాల్దీవుల మిలిటరీ చెందిన ఒక అధికారి కూడా ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఈ ప్రమాదంలో మృతి చెందిన వారికి సంఖ్య ఆరుకు చేరింది.
అయినా అధికారులు రెస్క్యూను మాత్రం ఆపలేదు. ఫిన్లాండ్‌కు చెందిన ప్రత్యేక కేవ్ డైవర్లు రంగంలోకి దించారు. వారు అధునాతన రీబ్రీథర్ పరికరాలను ఉపయోగించి గుహ అంతర్భాగంలో ఉన్న చివరి గదిలోకి చేరుకుని, మిగిలిన నలుగురి మృతదేహాలను వెలికితీశారు. అయితే ఈ రెస్క్యూ టీమ్ గుహలో చివరి అంచు వద్దకు చేరుకున్న సమయంలో అక్కడ పేరుకుపోయిన దట్టమైన బురద, సిల్ట్ పైకి లేవడంతో డైవర్లకు ఏమీ కనిపించక, దిక్కుతోచని స్థితిలో చిక్కుకుని ఉంటారని రెస్క్యూ టీమ్ తెలిపారు.
ఇక ఈ ప్రమాదానికి గల అసలు కారణాలను విశ్లేషించేందుకు అధికారులు డైవర్ల నుంచి స్వాధీనం చేసుకున్న గోప్రో ఫుటేజ్‌ను, డైవింగ్ కంప్యూటర్లను క్షణ్నంగా పరిశీలిస్తున్నారు. అయితే నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించినందుకు విచారణ పూర్తి అయ్యేంతవరకు సదరు డైవింగ్ నౌక ఆపరేటింగ్ లైసెన్స్‌ను రద్దు చేస్తున్నట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
