AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirupati: అమ్మా.. తల్లి.. పరాశక్తి.. JCBతో పొలం చదును చేస్తుండగా..

తిరుపతి జిల్లా పాకాల మండలం ఇరంగారిపల్లిలో రైతు పొలంలో తవ్వకాలు చేపట్టగా పురాతన అమ్మవారి విగ్రహం వెలుగులోకి వచ్చింది. జేసీబీకి బండరాయిలా తగిలిన విగ్రహాన్ని జాగ్రత్తగా మట్టి తొలగించగా, సింహావాహనంపై ఆసీనులై ఉన్న అమ్మవారిగా గుర్తించారు. స్థానికులు దుర్గాదేవి విగ్రహంగా భావిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.

Tirupati: అమ్మా.. తల్లి.. పరాశక్తి.. JCBతో పొలం చదును చేస్తుండగా..
Goddess Statue
Raju M P R
| Edited By: |

Updated on: May 23, 2026 | 10:48 AM

Share

తిరుపతి జిల్లా పాకాల మండలంలో పురాతన అమ్మవారి విగ్రహం వెలుగులోకి రావడం స్థానికంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. మండలంలోని ఇరంగారిపల్లి గ్రామానికి చెందిన ఓ రైతు తన పొలాన్ని చదును చేయించేందుకు జేసీబీతో పనులు చేపట్టాడు. పొలం చుట్టూ కంచె నిర్మాణం చేయాలనే ఉద్దేశంతో తవ్వకాలు నిర్వహిస్తుండగా అనూహ్యంగా పురాతన విగ్రహం బయటపడింది.

తవ్వకాల సమయంలో జేసీబీకి బండరాయిలా ఏదో గట్టిగా తగలడంతో పనులు నిలిపివేసి పరిశీలించారు. అనంతరం జాగ్రత్తగా మట్టిని తొలగించగా, సింహ వాహనంపై ఆసీనులై ఉన్న అమ్మవారి విగ్రహం దర్శనమిచ్చింది. విగ్రహం ఆకృతి, శిల్పకళను చూసిన స్థానికులు దీన్ని దుర్గాదేవి విగ్రహంగా భావిస్తున్నారు.

విగ్రహం ఎక్కడైనా దెబ్బతినకుండా ఉండేందుకు గ్రామస్తులు, కార్మికులు ఎంతో జాగ్రత్తగా వ్యవహరించారు. తాళ్లు కట్టి జేసీబీ సహాయంతో విగ్రహాన్ని బయటకు తీశారు. అనంతరం పొలంలోనే ఒక ప్రదేశంలో ఏర్పాటు చేసి పూజలు ప్రారంభించారు. అమ్మవారు ప్రత్యక్షమయ్యారనే భావనతో గ్రామస్తులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.

ఈ విషయం ఆ నోటా ఈ నోటా వ్యాపించడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. కొందరు దీన్ని పురాతన దేవాలయ ఆనవాళ్లుగా భావిస్తుండగా, మరికొందరు చారిత్రక ప్రాధాన్యత కలిగిన విగ్రహంగా చెబుతున్నారు. విగ్రహాన్ని చూసేందుకు భక్తులతో పాటు ఆసక్తిగా ప్రజలు కూడా తరలివస్తుండటంతో ఆ ప్రాంతం సందడిగా మారింది.

సమాచారం అందుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. పొలం యజమాని వివరాలు సేకరించి, విగ్రహం పురాతనతపై వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. పురావస్తు శాఖ అధికారులకు కూడా సమాచారం అందించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పొలంలోనే ఉన్న అమ్మవారి విగ్రహానికి గ్రామస్తులు నిత్య పూజలు నిర్వహిస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
నిద్రలో పళ్లు కొరుకుతున్నారా? ఈ కారణాలు, లక్షణాలు తెలుసుకోండి!
నిద్రలో పళ్లు కొరుకుతున్నారా? ఈ కారణాలు, లక్షణాలు తెలుసుకోండి!
కాళ్ల నొప్పి పదేపదే వస్తుందా? ఈ 3 పోషకాల లోపం కారణం కావచ్చట!
కాళ్ల నొప్పి పదేపదే వస్తుందా? ఈ 3 పోషకాల లోపం కారణం కావచ్చట!
30 ఏళ్ల నొప్పికైనా 5 నిమిషాల్లో ఉపశమనం.. నిమ్మకాయతో ఇలా చేస్తే
30 ఏళ్ల నొప్పికైనా 5 నిమిషాల్లో ఉపశమనం.. నిమ్మకాయతో ఇలా చేస్తే
గజకేసరి రాజయోగంతో ఈ 4 రాశులకు అదృష్టం, ఊహించని ధనలాభం! మీ రాశి..
గజకేసరి రాజయోగంతో ఈ 4 రాశులకు అదృష్టం, ఊహించని ధనలాభం! మీ రాశి..
హైదరాబాద్‌కు వాటర్ అలర్ట్.. వర్షాలు పడుతున్నా నీటి భయం ఎందుకు..?
హైదరాబాద్‌కు వాటర్ అలర్ట్.. వర్షాలు పడుతున్నా నీటి భయం ఎందుకు..?
అక్క తోప్ హీరోయిన్ చెల్లి మాత్రం సినిమాలు మానేసి ఇప్పుడు ఇలా..
అక్క తోప్ హీరోయిన్ చెల్లి మాత్రం సినిమాలు మానేసి ఇప్పుడు ఇలా..
సినిమా చూస్తా.. సీఎం సార్ పర్మిషన్ ఇవ్వండి.. రేవంత్ రెడ్డికి నాని
సినిమా చూస్తా.. సీఎం సార్ పర్మిషన్ ఇవ్వండి.. రేవంత్ రెడ్డికి నాని
బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న ఒకే ఒక్క హిట్..
బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న ఒకే ఒక్క హిట్..
పసిఫిక్‌లో వేడి.. హైదరాబాద్ మార్కెట్‌లో ధరల సెగలు..
పసిఫిక్‌లో వేడి.. హైదరాబాద్ మార్కెట్‌లో ధరల సెగలు..
గణపయ్యకు 10వ రోజు పెరుగు వడ నైవేద్యం..
గణపయ్యకు 10వ రోజు పెరుగు వడ నైవేద్యం..